దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు
విజయవాడ: దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులపై అత్యుత్సాహం ప్రదర్శించింది.
అమ్మవారి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుంటున్న భక్తులను ఒక్కసారిగా సిబ్బంది బయటకు తోసివేశారు. దాంతో దర్శనానికి వచ్చిన భక్తులంతా ప్రైవేట్ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.