dassara festival
-
Dussehra 2024: అమ్మలగన్న అమ్మ... మన రక్షణ దుర్గం
శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం. ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి. ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–మహత్వం – ఓం,కవిత్వం– ఐం,వశిత్వం– క్లీం పటుత్వం– హ్రీమ్,సంపద– శ్రీమ్ అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం. చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.– పమిడికాల్వ మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
సందడిగా సద్దుల బతుకమ్మ.. ఆటపాటలతో ఆడబిడ్డలు
-
చికాగోలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
న్యూజెర్సీలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టిప్యాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
-
నేత్రపర్వంగా మైసూరులో దసరా
మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు. మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది. 10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు విదేశాల నుంచీ జనం తరలివచ్చారు. Glimpse of Jumboo Savari reaching Bannimantapa and Ambaari taken back to Mysuru Palace 🙏🙏 VC : Suhas Shivaay#MysuruDasara2023 pic.twitter.com/gX3ykOOn3K — Mysuru Memes (@MysuruMemes) October 25, 2023 -
దసరా స్పెషల్.. అటు మహేశ్ కూతురు, ఇటు బన్నీ వారసులు
జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న యాంకర్ అనసూయ చీరలో క్యూట్‌గా అనిపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ లంగా ఓణీలో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్ బ్లాక్ చీరలో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ ఈషా రెబ్బా హాట్ పోజుల్లో మెల్ట్ అయ్యేలా చేస్తున్న ఈషా గుప్తా చీరలో పరువాల విందు చేస్తున్న కావ్య కల్యాణ్ రామ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియో పోస్ట్ చేసిన మలైకా అరోరా టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ అనుకృతి సోయగాలు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Amore by BK (@amorebybk) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో భక్తుల రద్దీ
-
పండుగ రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
దసరా రోజున.. ఈ మూడు రకాల పక్షులను చూసారో.. ఇకపై విజయాలే!
సాక్షి, కరీంనగర్: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధనవమి వరకు తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు జరుపుకుని పదోరోజు విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ ఇది. చెడుపై మంచి విజయానికి సూచికగా నిర్వహించుకునే వేడుకే విజయదశమి. దసరా రోజున చేపట్టిన ప్రతీపనిలో విజయం లభిస్తుందని నమ్మకం. అందుకే శక్తి స్వరూపం ఆశీస్సులతో ప్రతిపని చేస్తుంటారు. దసరా అంటే పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది. రాముడు రావణుడిపై గెలిచిన రోజుగానే గాకుండా పాండవులు వనవాసం వీడుతూ.. జమ్మిచెట్టుపై ఉన్న తమ ఆయుధాలు తిరిగితీసిన రోజు అని కూడా చర్రిత చెబుతోంది. అందుకే దసరా రోజు రావణవధ, జమ్మి ఆకు పూజ చేస్తుంటారు. దుర్గాదేవి మహిషాసురడనే రాక్షసునితో నవరాత్రులు యుద్ధం చేసి విజయం సాధించిన రోజును విజయదశమిగా కూడా చెబుతుంటారు. 'పాల పిట్టల దర్శనం..' దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాలపిట్టను చూస్తే పాపాలు, కర్రెపిట్టను చూసే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూసే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. శమీ పూజ విశేషం.. దసరా రోజున శమీ పూజ ప్రత్యేకం. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు చేసిన జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదుపెట్టెలో ఉంచుతారు. దీంతో ధనవృద్ధి జరుగుతుందని ప్రతీతి. శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కలతో నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువులను నశింపచేసేదిగా, అందుకే జమ్మి చెట్టుకు అంత ప్రాముఖ్యం. ఆయుధ పూజ మహిషాసురుడిని వధించడానికి దుర్గదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలు తమ ఆయుధాలను అందించడంతో ఆదిశక్తి మహావిరాట్ రూపాన్ని సంతరించుకుంది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుడిని వధించి వి జయవిలాసిగా మూర్తిమత్వాన్ని చాటుకుంది. అందువల్లే పూర్వం రాజులు ఆయుధాలను పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రం, వా హన, పనిముట్లకు పూజలు చేయడం ఆనవాయితీ. బంగారం ఇచ్చి ఆశీర్వాదం! పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ కలిసి జమ్మిచెట్టు ఆకులను కుంకుమ కలిపిన బియ్యంలో కలుపుతారు. పూజ చేసిన జమ్మి, ఆకులు, బియ్యాన్ని ప్రతి ఒక్కరు తీసుకవెళ్తారు. దీనిని బంగారం అని పిలుస్తారు. ఈ బంగారం తీసుకెళ్లి తల్లిదండ్రులకు, పెద్దలకు చేతిలో పెట్టి ఆశీర్వాదం పొందడం అనవాయితీ. ఒకరికి ఒకరు ఇచ్చుకుని అలయ్‌బలయ్ చేసుకుంటారు. -
ఉదయం రెక్కీ...రాత్రి పూట ఇళ్లకు కన్నం
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
-
ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజు దసరా మహోత్సవాలు
-
బిగ్ ‘సి’ దసరావళి తొలి డ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ ‘సి’ దసరావళి తొలి లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. సంస్థ ఫౌండర్ ఎం.బాలు చౌదరి, డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. మొత్తం 20 మందిని లక్కీ డ్రాలో ఎంపిక చేశారు. వీరిలో 10 మందికి మారుతీ ఆల్టో 800 కార్లు, 10 మందికి బజాజ్ ప్లాటినా బైక్‌లను బహుమతిగా అందిస్తారు. అక్టోబరు 29 వరకు ఉండే ఈ ఆఫర్ కింద మొత్తం 30 మారుతి ఆల్టో కార్లు, 30 బజాజ్ ప్లాటినా బైక్‌లను కస్టమర్లు గెలుచుకోవచ్చు. అలాగే 10% హెచ్డీఎఫ్సీ క్యాష్ బ్యాక్, సులభ వాయిదాల్లో మొబైల్ కొన్నవారికి ఒక ఈఎంఐ ఉచితం, 30% పేటీఎం క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంది. -
భక్తులపై ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం
విజయవాడ: దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులపై అత్యుత్సాహం ప్రదర్శించింది. అమ్మవారి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుంటున్న భక్తులను ఒక్కసారిగా సిబ్బంది బయటకు తోసివేశారు. దాంతో దర్శనానికి వచ్చిన భక్తులంతా ప్రైవేట్ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముహూర్తం..11:13
►దసరా రోజున ఇదే సమయంలో అన్ని కొత్త జిల్లాల ప్రారంభోత్సవం ► దాదాపు 300 ఉత్తర్వుల విడుదలకు ఏర్పాట్లు ► తొలుత కొత్త జిల్లాల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ ► ఆ వెంటనే కలెక్టర్, ఎస్పీల నియామకాలు.. ► ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ► 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ► ఏర్పాట్లు చేసుకొనేందుకు అధికారులకు ముందుగానే మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున అంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11.13 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే సమయంలో ప్రారంభోత్సవం జరగాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దసరా పండుగ రోజే ఉత్తర్వులన్నీ జారీ చేయనుంది. ఆ రోజు ఉదయమే దాదాపు 300కు పైగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. తొలుత కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అవుతాయి. తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో అధికారులను నియమిస్తారు. అయితే కొత్త జిల్లాలకు వెళ్లి తమ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం ముందుగానే మౌఖిక ఆదేశాలు జారీ చేయనుంది. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, అన్ని శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉదయం 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసు పరేడ్‌ను నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు, జిల్లాధికారులు తమకు నిర్దేశించిన జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. నమూనా ఉత్తర్వులు సిద్ధం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు ప్రభుత్వ ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ విధానంలో కేటాయించేందుకు జారీ చేయాల్సిన తాత్కాలిక ఉత్తర్వుల నమూనాను శనివారం సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. ఆ నమూనాను అనుసరించి అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు ఈ నెల 11న కొత్త జిల్లాల్లో విధుల్లో చేరే విధంగా వారిని సంబంధిత అధికారులు తక్షణమే రిలీవ్ చేసేలా ఆదేశించాలని.. ఇందుకోసం శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది ప్రకటన సిద్ధమయ్యాక ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయనుంది. త్వరలో కొత్త పోస్టుల మంజూరు జిల్లా కలెక్టరేట్లు, కొత్త మండలాలకు తహసీల్దార్లు సహా వివిధ పోస్టులను మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. 119 మండలాలకు ఓఎస్డీలు, ఎంఈవోలు, వ్యవసాయాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, విద్యా, వ్యవసాయ శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల ముసాయిదాలో 27 జిల్లాలను ప్రకటించగా.. అనంతరం వాటిని 31కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో అదనంగా పెరిగిన నాలుగు జిల్లాలకు కలెక్టర్, జేసీ, ఎస్పీ, అదనపు ఎస్పీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. -
ఆదివాసుల ఆశలు అడియాశలేనా?
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నాడు కొత్తగా 17 జిల్లాలను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించి, క్రొత్త జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ యంత్రాంగం కేటాయింపుపై కేసీఆర్ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ‘‘పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం’’ పేరిట క్రొత్తగా 17 జిల్లాల ముసాయిదా ప్రకటన 22.8. 2016న విడుదల చేసింది. నెలరోజుల్లో ఆయా జిల్లాల ప్రజల అభిప్రాయాలు కోరింది. ప్రభుత్వం చెప్పుకుం టున్న ‘‘ప్రజల అభిప్రాయం’’, ప్రత్యేకంగా సమాజంలో నేటికీ అన్ని విధాలుగా వెనకబడి ఉన్న ఆది వాసుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదు. గతంలో ఒకటి, రెండు జిల్లాల ఏర్పాటుకు నిర్దేశించిన 1974 జిల్లాల పునర్విభజన చట్టం, దాని నియమ నిబంధనలు, ప్రస్తుతం పెద్దఎత్తున చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సరిపోదు. ఆదివాసీ స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటుకు బదులుగా, ఆదివాసీ ప్రాంతాలను చీల్చి, మరింతగా విచ్ఛిన్నం చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంది. ఆదివాసీల స్వయంపాలన హక్కును శాశ్వతంగా సమాధి చేసే విధంగా జిల్లాలను ఏర్పాటు చేయుట రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పైగా, కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలను విభజించి, 10, 12, 13 మండలాలతో చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఆదివాసులకు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పరచే విషయాన్ని ఏ దశలో కూడా ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న ఆదివాసులు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలు ఈ 4 జిల్లాలలోనే వున్నాయి. పై నాలుగు జిల్లాల్లోనే కాక, కరీంనగర్, నల్ల గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆదివాసు లకు ప్రత్యేక జిల్లాలు, కనీసం ఒక్క జిల్లా కూడా ఏర్ప ర్చలేదు. షెడ్యూల్డు ప్రాంతాలను వివిధ జిల్లాల కింద విభ జించేశారు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం కేంద్రంగా, ఆది లాబాద్ జిల్లాలో ఉట్నూరు కేంద్రంగా, వరంగల్ జిల్లాలో ములుగు లేక ఏటూరునాగారం కేంద్రంగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు, వివిధ గిరిజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కానీ వీరి డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆదివాసులకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో, ఎన్నికల ప్రణాళికలో చేసిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ లేదు. గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా, వీరిని పోడు భూముల నుండి దౌర్జన్యంగా గెంటివే యడం, పంటలు ధ్వంసం చేసి, తప్పుడు కేసులు బనా యించే కార్యక్రమం చేపట్టింది. ఆదివాసుల ప్రత్యేక అస్తిత్వాన్నీ, సంస్కృతీ, సాంప్రదాయాలనూ వీరికిగల ప్రత్యేక చట్టాలు, రక్ష ణలు, హక్కులను దృష్టిలోకి తీసుకుని వీరు నివసిస్తున్న షెడ్యూల్డు ప్రాంతాలు, వీటితో కలసి ఉన్న గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలు, స్వయం పరి పాలనా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. - వ్యాసకర్త సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు 94907 00066 - వేములపల్లి వెంకట్రామయ్య -
'దసరాకు కొత్త జిల్లాలు.. సూచనలు చేయండి'
హైదరాబాద్: దసరా పండుగ నాటికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సివుందని.. అందుకు అవసరమైన సూచనలు చేయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను కోరారు. బుధవారం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో జిల్లాలు, మండలాల ఏర్పాటుపై చర్చకొనసాగుతోంది. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలుగా విభజిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త జిల్లాలపై త్వరలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. జిల్లా, మండల పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. తమ ప్రతిపాదనలకు కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు అందజేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరూ తమ జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాకు పలు పేర్లను సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు మంజీర పేరు పెట్టాలని మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు కొమరం భీం పేరు పెట్టాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ప్రతిపాదనలను కే.కేశవరావుకు అందజేశారు.