private security
-
ఆస్పత్రుల్లో ప్రైవేటు సైన్యం!
సాక్షి, సిటీబ్యూరో: వాళ్లు సెక్యూరిటీ గార్డులు..గేటు దగ్గరి నుంచి డాక్టర్‌ను కలిసే దాకా అడుగడుగునా ఉరుముతూ కనిపిస్తుంటారు. తెలిసీతెలియక ఏదైనా అడిగితే చిరాకు పడుతుంటారు. మరోసారి అడిగామంటే అంతే సంగతులు..అక్కడికి వచ్చే పేషెంట్ గజగజలాడాల్సిందే. ఈ పరిస్థితి ఏదో ప్రైవేటు ఆస్పత్రుల్లోనిది కాదు.. మన భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వ్యవహార శైలి. నిజం..నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సెక్యూరిటీ రాజ్యం నడుస్తోంది. ఒక రకంగా ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషిస్తున్నట్టే ఉంది వ్యవహారం. దూరభారాల నుంచి వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం..గట్టిగా మాట్లాడితే దుర్భాషలాడటం.. మరీ కాదంటే దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల గురించి పాఠకులకు తెలియజేసేందుకు ఫొటోలు తీసేందుకు వెళ్లిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై ప్రైవేటు సెక్యూరిటీ గార్డు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లోని ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆగడాలపై మరోసారి చర్చకు తెరలేచింది. అంత ఉలుకెందుకు? ఆస్పత్రుల్లో తాకిడిని నియంత్రించేందుకు థర్డ్ పార్టీ ద్వారా ప్రైవేటు సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పరచుకుంటుకున్నారు. అయితే వారి వ్యవహార శైలి ఏ ఆస్పత్రిలో చూసినా.. ఎప్పుడైనా వివాదాస్పదమే. చిన్న విషయాలకే రోగులపై విరుచుకుపడటం, దుర్భాషలాడటం సర్వసాధారణం అయింది. ఆస్పత్రులకు వచ్చే వారు అనారోగ్యంతో ఎంతో బాధతో వస్తుంటారు. కనీసం వారితో మర్యాదగా మాట్లాడుదామనే ఆలోచనే ఉండట్లేదని రోగులు వాపోతున్నారు. నేరస్తులను చూసినట్టు చూస్తుంటారని, చేతిలో లాఠీల్లాంటి కర్రలతో బెదిరిస్తుంటారని చెబుతున్నారు. శిక్షణ లేకుండానే విధుల్లోకి..? ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించే ప్రైవేటు సెక్యూరిటీకి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో ఎలా మెలగాలి? వారితో ఎలా ప్రవర్తించాలి..? అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి..? మానవతా దృక్పథం ఎలా అలవర్చుకోవాలి వంటి అనేక అంశాలపై వారికి అవగాహన కలి్పంచాలి. పైగా వీరిని గమనించే ఇన్చార్జి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతిసారి షిఫ్ట్ మారుతున్న సమయంలో రోల్ కాల్‌కు పిలిచి వారికి సూచనలు చేస్తుండాలి. కానీ ఏ ఆస్పత్రిలో కూడా ఇలా జరుగుతున్న దాఖలాలు లేవు. దీంతో సెక్యూరిటీ గార్డులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సమస్యలు దాస్తే ఏం లాభం? ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిపాలనా యంత్రాంగం.. మసిపూసి మారేడు కాయ చేయడంపైనే దృష్టిసారిస్తోంది. ఆస్పత్రుల్లోని సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఎన్నడూ లేని ఆంక్షలు విధిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి..ఆ సమస్యలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్న చందంగా పాలక వర్గం వ్యవహరిస్తోంది. దీంతో రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోతోంది. మీడియాపై ఆంక్షలు విధించి, సమస్యలను దాచేస్తే సరిపోతుందా.. నిజాలు బయటకు రాకుండా ఎంతకాలం దాస్తారంటూ పలువురు రోగులు ప్రశి్నస్తున్నారు.‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి.. విధుల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితిని ప్రపంచం ముందు పెట్టేందుకు వెళ్లిన ‘సాక్షి’ మీడియా ఫొటోగ్రాఫర్ జి.బాలస్వామిపై అక్కడి సెక్యూరిటీ గార్డు దాడి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కెమెరా లాక్కుని దుర్భాషలాడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాను విధుల్లో భాగంగా ఇక్కడికి వచ్చానంటూ ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా, సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించామని తెలిపారు. అయితే వ్యవస్థ మొత్తం ఇలాగే ఉండగా, ఒక్కరిపై వేటు వేసి చేతులు దులుపుకోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నడూ లేనంత ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. -
ఫేస్బుక్ వాడుతున్నారా..? జర జాగ్రత్త
న్యూఢిల్లీ: దేశంలో ఫేస్బుక్ వాడే వినియోగదారులు తమ అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్టీ ఇన్) సూచించింది. ఇటీవలే ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన డేటా దాడి 61 లక్షల భారతీయుల అకౌంట్లపై పడిన సందర్భంగా ఏజెన్సీ ఈ సూచన చేసింది. ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నకొద్దీ యూజర్ల అకౌంట్లు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయని, ఇలాంటప్పుడు యూజర్ల డేటాను వారికి తెలియకుండానే సేకరించడం జరుగుతుందని ఏజెన్సీకి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ప్రొఫైల్ సమాచార లీకేజీ భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలా లీకయ్యే సమాచారంలో ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ ఐడీలు, పేర్లు, వృత్తి వివరాలు, ఫోన్ నంబర్లు, జన్మతేదీలు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య సమాచారం, పాస్వర్డ్స్ వివరాలు లేవని ఫేస్బుక్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది సమాచారం(61 లక్షలమంది భారతీయుల సమాచారంతో సహా) సైబర్ క్రిమినల్ ఫోరమ్స్‌లో ఉచితంగా లభిస్తోందని ఏజెన్సీ తెలిపింది. ఈ లీకేజీ కారక టెక్నాలజీ ఫీచర్‌ను సరిదిద్దామని ఫేస్బుక్ పేర్కొంది. లీకైన సమాచారం మొత్తం 2019కి పూర్వపు సమాచారమని తెలిపింది. ( చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ ) -
గాంధీభవన్‌కు భద్రత పెంపు
-
భక్తులపై ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం
విజయవాడ: దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దేవస్థాన ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులపై అత్యుత్సాహం ప్రదర్శించింది. అమ్మవారి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుంటున్న భక్తులను ఒక్కసారిగా సిబ్బంది బయటకు తోసివేశారు. దాంతో దర్శనానికి వచ్చిన భక్తులంతా ప్రైవేట్ సెక్యూరిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదుల చర్యలతో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు కూడా పోలీసులతో ప్రత్యేక తర్ఫీదు ఇప్పించాలని నిర్ణయించారు. తద్వారా ఉగ్రవాద చర్యలను సులభంగా పసిగట్టడంతోపాటు నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. నగరాలు, పట్టణాలలోకి కొత్తగా వచ్చే వ్యక్తులు, అనుమానితుల విషయాలను ఎప్పటికప్పుడు పోలీసుకు చేరేలా ఒక వ్యవస్థను రూపొందించబోతున్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, ప్రదేశాల వద్ద కాపాలా కాయడంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలదే ప్రముఖ పాత్ర. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ లేదు. దీంతో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడంలో ప్రైవేటు సెక్యూరిటీ గుర్తించలేకపోతున్నారు. ఈ మేరకు ఇటీవల పలుచోట్ల పోలీసులు నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో లోపాలు బయటపడ్డాయి. వీటిని అధిగమించేందుకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అందుకు అనుగుణంగా త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించడం కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులపై డేగకన్ను హైదరాబాద్‌తోపాటు ముఖ్యమైన నగరాలు, పట్టణాల్ల డేగకన్నుతో విస్తృతమైన భద్రతాచర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. లుంబినీ పార్కు, గోకుల్‌ఛాట్, మక్కా మసీదు తదితర ప్రాం తాల్లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో వాటిని పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లతో నిత్యం సమాచారం పంచుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. -
శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఘర్షణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్... ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌పై ప్రైవేట్ సెక్యూరిటీ దాడి చేశాడు. దాంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తలకు తీవ్రంగా గాయమైంది. సహాచర సిబ్బంది వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం అతడిని తిరుపతిలోని అశ్వనీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో టీటీడీ ఈవో డి.సాంబశివరావు కూతవేటు దూరంలోనే ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సదరు సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమలలో నారా లోకేష్, బ్రహ్మాణీ దంపతుల గారల పట్టి దేవాన్ష్ అన్నప్రసన నేడు శ్రీవారి ఆలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు... నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు నేడు తిరుమల రానున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయం కూడా కావడంతో తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. -
ప్రైవేట్ భద్రత కట్టుదిట్టం
నోయిడా: నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజలు అభద్రతాభావంలో జీవించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు స్థానికులు మొరపెట్టుకొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాలు నేరాలను అదుపు చేయలేకపోతున్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ఆ రెండు యంత్రాంగాలు ఏమీ చేయలేకపోతున్నాయి. మహా అయితే కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. దీన్ని అధిగమించేందుకు స్వీయ భద్రతా చర్యలకు నగరవాసులు నడుం బిగించారు. సెక్టార్ 39 పరిధిలో స్వీయ రక్షణ చర్యలు ఆర్డబ్ల్యూఏ పరిధిలోని 39వ సెక్టర్లోని కొన్ని గృహసముదాయాలకు చెందిన ప్రజలు గ్రూపుగా ఏర్పడి, తమకు అవసరమైన భద్రతా చర్యలను తీసుకొన్నారు. ఇందుకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవడంతోపాటు రక్షణ చర్యలు తీసుకొన్నారు. గేట్ల ఎదుట సీసీటీవీలు, అపరిచిత వాహనాలు లోపలికి ప్రవే శం లేదనే బోర్డులు, ప్రవేశ, బయటి ద్వారాల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసుకొన్నారు. ఇంటి చుట్టూ ఇనుపవైర్లతోపాటు గేటు ముందు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలు జరగకుండా నివారించేందుకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా సొంతంగా సెక్యూరిటీ వ్యవస్థను కట్టుదిట్టం చేసుకొన్నామని పలువురు నగర వాసులు పేర్కొన్నారు. ప్రతినెలా రూ. 2లక్షలు ఖర్చు చేస్తున్నాం: అధ్యక్షురాలు ఆర్డబ్ల్యూఏ 39వ సెక్టర్ సంఘం అధ్యక్షురాలు సుమిత్రా చోప్రా మాట్లాడుతూ.. మా సెక్టర్ భద్రత కోసం ప్రతి నెలా రూ.2.లక్షలను వెచ్చిస్తున్నాం. ఫలితంగా చైన్‌స్నాచింగ్‌లు, కార్ జాకింగ్స్లాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. సెక్టార్ భద్రత కోసం వైర్ కంచెను ఏర్పాటు చేశాం. దీని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుంది. ఈ కంచెను ఒక వ్యక్తి తొలగించడం సులువుకాదు. అంత పటిష్టంగా ఉంటుందని చెప్పారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడొద్దనే.. అదేవిధంగా ‘సురక్షితమైన జీవనం కోసమే మా సెక్టర్లో ప్రైవేట్ భద్రతా చర్యలు తీసుకొన్నాం. నగరంలో పోలీసు సిబ్బంది కొరత కూడా ఉంది. అందుకే సెక్టార్లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి పోలీసుల మీద ఆధారపడడం కూడా సముచితం కాదు. కాలనీ ప్రజలంతా కలిసి నవరాత్రులు, తదితర పండుగలను నిర్వహిస్తుంటాం. ఇలాంటి సమయంలో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, శాంతియుతంగా పండుగలు జరుపుకోవడానికి అవసరమైన చర్యలను అందరం కలిసే తీసుకొన్నామని మరో సభ్యురాలు చెప్పారు. కాలనీ అభివృద్ధికి సహకరించాలి మా పరిసరాలను శుభ్రంగా, భద్రంగా ఇతర కాల నీల ప్రజలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకొంటున్నాం.. కాలనీ ప్రజలు సురక్షితంగా జీవించడానికి అవసరమైన అన్ని చర్యలు మేమే తీసుకొంటున్నాం. మా కాలనీలోని పార్కులను చూసుకోవడానికి తోటమాలీలు, స్వీపర్లను అధికారుల కేటాయించారు అని చెప్పారు. మా కాలనీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు. -
నేరరహిత నగరానికి సహకరించండి
‘‘చారిత్రాత్మక హైదరాబాద్ నగరం జనాభా 80 లక్షలు పైమాటే. ఇంత మంది ప్రజలకు 12 వేల మంది పోలీసులే ఉన్నారు. ప్రతి చోటా, ప్రతి సమయంలో ప్రజలకు రక్షణగా పోలీసులు ఉండాలంటే కష్టమే. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో నేరరహిత నగరంగా తీర్చిదిద్దాలంటే నగర పౌరుల సహకారం ఎంతో అవసరం. మేము యూనిఫాంలో ఉన్న పోలీసులమైతే.. మీరు యూనిఫాం లేని పోలీసులు. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. లేదా నేరం చేసిన వ్యక్తిని మీరే పట్టుకొని పోలీసులకు అప్పగించండి’ - మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి నాంపల్లి: నాంపల్లి చాపెల్ రోడ్డులోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో శుక్రవారం తోపుడు బండ్ల వ్యాపారులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ప్రోగ్రామ్ ఆన్ సేప్టీ అండ్ సెక్యూరిటీ మే జర్స్ టు ది హాకర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలను అరికట్టడం ఎలా అనే అంశంపై లఘు చిత్రాలను ప్రదర్శించి వ్యాపారులను, సెక్యూరిటీ సిబ్బం దిని జాగృతం చేశారు. కార్యక్రమంలో డీసీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడు. అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ కోటిరెడ్డి, సెంట్రల్ జోన్ అడిషన్ డీసీపీ వరప్రసాదరావు, ఏసీపీలు అమరకాంత్‌రెడ్డి, మహ్మద్ ఇస్మాయిల్, జైపాల్, ఇన్స్పెక్టర్లు మధు మోహన్‌రెడ్డి, అశోక్, జగ్గారెడ్డి తదితరులు ఆగస్టు 15న పోలీసు శాఖకు కొత్త వాహనాలు... హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లు న్యూయార్క్, లండన్ తరహాలో పనిచేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు వెచ్చించి, 2 వేల కొత్త వాహనాలు,3 వేల ద్విచక్రవాహనాలను కొనుగోలు చేశారని డీసీపీ కమలాసన్‌రెడ్డి చెప్పారు. ఇవి ఈనెల 15న పోలీసుస్టేషన్లకు చేరుతాయన్నారు. హై దరాబాద్ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేం దుకు కమిషనర్ మహేందర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలు చేపడతున్నారన్నారు. పేలుళ్లు పునరావృతమైతే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది... తీవ్రవాదులు పేలుళ్లు జరిపేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారని డీసీపీ అన్నారు. గతంలో మక్కామసీదు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్, దిల్సుఖ్నగర్లలో పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసులా వ్యవహరించి పేలుళ్లు జరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరించాలి. వ్యాపార సముదాయాలు, థియేటర్లు తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, ఎవ్వరూ నేరం చేయాలంటేనే బయపడే విధంగా అమెరికా, ఇంగ్లాండ్ తరహాలో నగరంలో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. చిరువ్యాపారులకు ఎస్ఎంఎస్ అలర్ట్ సౌక ర్యం... తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీగార్డుల ఫోన్ నంబర్లను సేకరించాం. ఈ ఫోన్ నంబర్లను సాఫ్ట్వేర్ ద్వారా భద్రపరిచాం. వీరితో ఎలాంటి అభిప్రాయాలు పంచుకోవాలన్నా ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్ చేస్తాం. తోపుడు బండ్లు, సెక్యూరిటీగార్డుల భాగస్వామ్యంతో నేరాలను అరికట్టవచ్చును. ఈ విధానం మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. తీవ్రవాదుల ఊహా చిత్రాల విడుదల ... పేలుళ్లతో సంబంధం ఉన్న తీవ్ర వాదుల ఊహాచిత్రాలను పోలీసులు తోపుడు బండ్ల వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. వీరి వివరాలు చెప్తే రూ. 25 లక్షల రివార్డు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. వీరిలో తీవ్రవాదులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, యాసీన్ భత్కల్, అక్తర్, వాఖాస్ , అసదుల్లా అక్తర్, మోహిసీన్ చౌదరి, తౌఖీర్, అరీజ్ ఖాన్, డాక్టర్ షానావాజ్, మహ్మద్ ఖాలిద్, సాజిద్ ఖురేసీ అలియాస్ బడా సాజిద్, మిర్జా సాదబ్ బేగ్, ముద్దాసిర్ యాసిన్, అలమ్బేజ్ అఫ్రిది, అహ్మద్ మొయిన్, మౌలానా సుల్తాన్ తదితరులు ఉన్నారు. వివరాలను తెలియజేయాల్సిన ఫోన్ నంబర్లు హైదరాబాద్ కంట్రోల్ రూం 100 లేదా 9490618941, సైబరాబాద్ కంట్రోల్ రూమ్ 100 లేదా 9440700975, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మలక్‌పేట్ పీఎస్ 040-24152069 లేదా 9490616387, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సరూర్‌నగర్ పీఎస్ 040-27853903 లేదా 9490617170లలో సంప్రదించవచ్చు.