న్యూఢిల్లీ: దేశంలో ఫేస్‌బుక్ వాడే వినియోగదారులు తమ అకౌంట్ ప్రైవేట్ సెట్టింగ్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఈఆర్‌టీ ఇన్) సూచించింది. ఇటీవలే ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన డేటా దాడి 61 లక్షల భారతీయుల అకౌంట్లపై పడిన సందర్భంగా ఏజెన్సీ ఈ సూచన చేసింది. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్ విస్తరిస్తున్నకొద్దీ యూజర్ల అకౌంట్లు బహిర్గతమయ్యే అవకాశాలు పెరుగుతాయని, ఇలాంటప్పుడు యూజర్ల డేటాను వారికి తెలియకుండానే సేకరించడం జరుగుతుందని ఏజెన్సీకి హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ ప్రొఫైల్ సమాచార లీకేజీ భారీగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలా లీకయ్యే సమాచారంలో ఈమెయిల్ ఐడీలు, ప్రొఫైల్ ఐడీలు, పేర్లు, వృత్తి వివరాలు, ఫోన్ నంబర్లు, జన్మతేదీలు ఉన్నాయని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య సమాచారం, పాస్‌వర్డ్స్ వివరాలు లేవని ఫేస్‌బుక్ పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది సమాచారం(61 లక్షలమంది భారతీయుల సమాచారంతో సహా) సైబర్ క్రిమినల్ ఫోరమ్స్‌లో ఉచితంగా లభిస్తోందని ఏజెన్సీ తెలిపింది. ఈ లీకేజీ కారక టెక్నాలజీ ఫీచర్‌ను సరిదిద్దామని ఫేస్‌బుక్ పేర్కొంది. లీకైన సమాచారం మొత్తం 2019కి పూర్వపు సమాచారమని తెలిపింది.
( చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ )
Comments
Please login to add a commentAdd a comment