Saraswati Temple
-
వర్గల్ క్షేత్రానికి నవరాత్రి శోభ
వర్గల్(గజ్వేల్): వర్గల్ శంభునికొండపై కొలువుదీరిన శ్రీవిద్యా సరస్వతీ క్షేత్రం సోమవారం నుంచి అక్టోబర్ 4వ తేదీ నవమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. వర్గల్ క్షేత్రానికి సికింద్రాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు, 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇవే కాకుండా సికింద్రాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వర్గల్ క్రాస్‌రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలో క్షేత్రానికి చేరుకోవచ్చు. నేటి నుంచి నవరాత్రోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభ వం అవుతాయి. వచ్చే నెల 2వ తేదీన లక్ష పుష్పార్చన, పల్లకీసేవ, పుస్తక రూపిణి సరస్వతీ పూజ, 4న మంగళవారం మహార్నవమి, అమ్మవారికి అష్టో త్తర కలశాభిషేకం, పూర్ణాహుతి, 5న బుధవారం కలశోద్వాసన, విజయదశమి వేళ అమ్మవారి విజ య దర్శనం, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామికి విశేష అభిషేకం జరుగుతుంది. తొమ్మిది రోజులు.. ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు లలితాదేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణాదేవిగా, ఐదో రోజు మహాలక్ష్మీదేవిగా, ఆరో రోజు రాజరాజేశ్వరిదేవిగా, ఏడో రోజు విద్యాసరస్వతిదేవిగా, ఎనిమిదో రోజు దుర్గాదేవిగా, తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధినిగా దర్శనం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి వర్గల్ క్షేత్రంలో త్రిశక్తి స్వరూపిణి శ్రీవిద్యాసరస్వతిమాత శరన్నవ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఉత్సవాలకు పీఠాధిపతులు శ్రీవిద్యాశంకర భారతీస్వామి, శ్రీమాధవానందస్వామి, శ్రీమధుసూదనానందస్వామి హాజరవుతున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పార్కింగ్ సదుపాయం, అన్నదానం ఉంటుంది. – చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ -
రాజగోపురంపై కనిపించని కలశ తొడుగులు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో అర్చకులు, అధికారుల నిర్లక్ష్యంతో మరో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో గురువారం వరకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామిజీ చేతుల మీదుగా ఘనంగా మహా కుంభాభిషేకం జరిపించారు. ఇందులో భాగంగా అమ్మవారి గర్భగుడి శిఖరాలకు కలశ పూజ నిర్వహించారు. అనంతరం దక్షిణ రాజగోపురంపైకి వెళ్లి సంప్రోక్షణ పూజలు నిర్వహించేందుకు ఉపక్రమించగా.. అక్కడి కలశాలకు తొడుగులు కనిపించలేదు. దీంతో స్వామిజీ అర్చకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెల సప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి తొడుగులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయమై ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిని వివరణ కోరగా.. భద్రత చర్యల్లో భాగంగానే శిఖరాలకు తొడుగులు ఉంచలేదన్నారు. ఉత్తర, దక్షిణ రాజగోపురాలపై శిఖరాలకు తొడుగులు లేకపోవడాన్ని స్వామివారు గ్రహించారని, ఇందుకు సంప్రోక్షణ పూజలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఆలయానికి ఎలాంటి ఆపచారం, దోషం లేదని స్వయంగా పీఠాధిపతి సూచించినట్లు పేర్కొన్నారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసరకు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
బాసరలో యాత్రీకుల యాతన
భైంసా(ముథోల్) : బాసర క్షేత్రానికి భక్తులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. చిన్న పిల్లలతో కుటుంబమంతా రాత్రి సమయంలో రైలు దిగి ఆలయానికి వెళ్లేందుకు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ముందరున్న ఏ వాహనమైన సరే తీసుకుని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి.. అప్పటికే ప్రయాణంలో అంతా అలిసిపోయి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోతారు. పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని పక్కనే ఉన్న ఆలయానికి చేరుకోవాలని యాత్రీకులు తపన పడుతుంటారు. అలాంటి సమయంలో వచ్చే యాత్రీకులకు రైలు దిగగానే ఉచిత బస్సు సౌకర్యం ఉందని, ఆలయంలో వసతి సౌకర్యం ఉందని చెప్పే ఏర్పాట్లు ఉండాలి. రైల్వేస్టేషన్లోనే ఆలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి యాత్రీకులకు తగ్గట్లు అవసరమైతే బస్సును 2 నుంచి 3 ట్రిప్పులు అయినా సరే పంపించే ఏర్పాట్లు చేయాలి. బస్సులో వెళ్లే యాత్రీకులు రైలు దిగగానే అక్కడే సేదదీరేలా వసతి కల్పించాలి. బాసర రైల్వేస్టేషన్లోనే రైలుమార్గం ద్వారా వచ్చే యాత్రీకులకు వసతి గదులను బుక్ చేసుకునేలా ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే వచ్చే వారికి తక్కువ ధరకే ఆలయ వసతి గృహాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం వచ్చిన యాత్రీకులంతా ముందు వసతి కోసం ఆలయ అతిథి గృహాలకు వెళ్లి అక్కడ గదులు లేవని చెప్పగానే ప్రైవేటు లాడ్జీలకు తిరగాల్సి వస్తోంది. ఇలా రాత్రంతా పిల్లాపాపలతో వచ్చే కుటుంబీకులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేకువజామునే స్నానాలు చేసి నిద్ర లేకుండానే పిల్లలకు అక్షరశ్రీకార పూజలు జరిపిస్తున్నారు. దీంతో ఒక్కసారి బాసరకు వచ్చే యాత్రీకులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవంటూ పెదవి విరుస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత బస్సులను నడిపితే రాత్రి సమయంలో వచ్చే యాత్రీకులకు ఇబ్బందులు దూరమవుతాయి. ఆ బస్సులోనే ఆలయ వసతిగృహాల ఖాళీ గదుల వివరాలను తెలిపే ఏర్పాట్లు చేస్తే యాత్రీకులను నేరుగా అక్కడికే వెళ్లగలుగుతారు. క్యాబ్‌లు నడిపితే.. ప్రస్తుతం బాసర రైల్వేస్టేషన్ నుంచి ఆలయం వరకు ప్రైవేటు ఆటోలు నడుపుతున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తగ్గట్లు ప్రభుత్వమే క్యాబ్‌లను అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాబ్‌లలో యాత్రీకులకు నిర్ధిష్టమైన అద్దె చెల్లింపునకు రశీదులు అందుతాయి. ఇప్పుడున్న ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన యాత్రీకుల వద్ద అద్దె డబ్బులను తీసుకుంటున్నారు. క్యాబ్‌లతో బాసర ఆలయానికి కొత్త అందం కూడా వస్తుంది. యాత్రీకులకు సౌకర్యంగా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వాహనాలు నడిపే వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ఉంటుంది. రోడ్డుపైనే పార్కింగ్ బాసర రైల్వేస్టేషన్ వద్ద ఉన్న చౌరస్తాలో ప్రైవేటు ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. భైంసా–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎప్పుడు చూసినా ఇక్కడ చౌరస్తా సర్కిల్లో ప్రయాణికుల కోసం వాహనాలను నిలిపి ఉంచుతారు. ఆలయానికి ప్రతీరోజు వందల సంఖ్యలో యాత్రీకులు వస్తుంటారు. వారిని తీసుకువచ్చే వాహనాల రాకపోకలకు రోడ్లపై నిలిపిన ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. యాత్రీకుల నిరీక్షణ రైల్వేస్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది. యాత్రీకులు రైలు దిగగానే బస్సుల కోసం వేచిచూస్తారు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం జరుగలేదు. కిలోమీటరున్నర దూరంలో బాసర గ్రామంలో ఉన్న బస్టాండ్ ఎవరికీ ఉపయోగపడడంలేదు. రైలు దిగగానే ట్రిపుల్ఐటీకి వెళ్లే విద్యార్థులు భైంసా, మహారాష్ట్రకు వెళ్లేవారు బాసర ఆలయానికి చేరుకునే వారంతా బస్సుల కోసం ప్రధాన రోడ్డుపైకి వస్తుంటారు. వర్షాకాలంలో, వేసవిలో పక్కనే ఉన్న హోటల్ షెడ్లలోకి వెళ్లి బస్సు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చౌరస్తా కూడలిలో అందరికీ ఉపయోగపడేలా బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సిన అత్యవసరం ఉంది. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఇక ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. బాసర రైల్వేస్టేషన్, గ్రామం, భైంసా, నిజామాబాద్‌ల నుంచి నాలుగు వైపులుగా వచ్చే వాహనాలన్నీ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చౌరస్తా మీదుగా వెళ్తాయి. ఈ చౌరస్తా వద్ద ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ముథోల్‌కు చెందిన హోంగార్డు కూడా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాసరకు చెందిన పలువురు యువకులు సైతం ఇలా రోడ్లపై నిలిపి ఉన్న భారీ వాహనాలకు ఢీకొని మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఉచిత బస్సులు నడపాలి దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఆలయం నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి నదికి వెళ్లేలా ఉచిత బస్సులను నడపాలి. అలా చేస్తే ఇబ్బందులు ఉండవు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. - లక్ష్మి, నిర్మల్ వసతి కల్పించాలి రైల్వేస్టేషన్‌కు రాగానే ఉచిత బస్సు వచ్చే వరకు నిరీక్షించేందుకు వసతి సౌకర్యం కల్పించాలి. రైలు ద్వారా ఒకేసారి వందలాది మంది యాత్రీకులు వస్తారు. అందరినీ ఉచిత బస్సు ద్వారానే ఆలయానికి తరలించాలి. - భాస్కర్, మహారాష్ట్ర ఆన్లైన్లో వివరాలుంచాలి ఉచిత బస్సు, ఆలయంలో వసతి వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలి. రైల్వేస్టేషన్లో దిగగానే యాత్రీకులకు ఎక్కడెక్కడ గదులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలి. - సురేశ్, మహారాష్ట్ర -
ఖేడ్ జిల్లా కోసం మంజీర నదిలో పుణ్యస్నానాలు
జ్ఞానసరస్వతీకి వినతిపత్రంఽ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నారాయణఖేడ్: నారాయణఖేడ్ కేంద్రంగా మంజీర జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి బాధ్యులు ఆదివారం వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజక వర్గానికి సరిహద్దులో గల పుల్కుర్తి వద్ద మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించచారు. అనంతరం సరస్వతీ ఆలయంలో అమ్మవారి పేరిట పూజారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ అశోక్ తోర్నాల్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా బంగారు నారాయణఖేడ్ చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మంజీర నదిలో పూజలు చేయడంతోపాటు దీపాలు వదిలినట్టు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి సిద్దారెడ్డి, కార్యదర్శులు కె.సంత్చారి, శంకర్, సర్దార్, కోశాధికారి కుమార్ స్వామి, మల్లేశ్, బస్వరాజ్, బాబు పాల్గొన్నారు. -
తెలియని క్షేత్రాలు
కొలనుభారతి సరస్వతీ ఆలయం అనగానే సాధారంణా అందరికీ భాసర, వర్గల్ గుర్తుకొస్తాయి. కాని కర్నూలుజిల్లా ఆత్మకూరు సమీపంలో శివపురం తర్వాత నల్లమల అడవుల చెంత కొలనుభారతి కొలువు తీరిన సంగతి తెలిసిన వారు చాలా తక్కువనే చెప్పాలి. సరస్వతికి కొలను భారతి అనే పేరు ఎందుకొచ్చింది? కొల్లం అంటే చెంచుల సమూహం. ఆ జనావాసాల మధ్య ఉంది కాబట్టి కొల్లం భారతి అనేవారట. అదే కొలను భారతి అయ్యింది. ఈ ఆలయ సమీపంలో సప్త శివాలయాలు ఉంటాయి. అవేకాక జనార్దన స్వామి ఆలయమూ ఉంది. ఈ సప్త శివాలయాలనూ రెడ్ శాండ్ స్టోన్‌తో నిర్మించినందువల్ల చాళుక్యుల ఆలయాలు అనుకుంటాము కానీ ఆధారాల్లేవు. ఆ ఆలయాలు శిథిల ం కాగా, ఇటీవలే వీటిని పున ర్నిర్మించి కొత్త శివలింగాలనూ ప్రతిష్ఠించి పక్క ఒక్కో ఆలయంలో సప్త మాతృకల్లో ఒక్కొక్కరి విగ్రహాలనూ ఆలయంలో నిలిపారు. అసలే ఆ తల్లి వీణాధరి... సకల విద్యలకూ అధిదేవత... మరి అంతటి తల్లి పక్కనున్న జలధార మామూలుగా గలగలా, జలజలా అంటుందా? ఆ జలధారకు ఎంత చక్కని పేరో? చారుఘోషిణి. తప్పక చూడదగ్గ క్షేత్రం ఇది. - గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి -
బాసర సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
బాసర : చదువుల తల్లి బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం. బుధవారం సరస్వతి అమ్మవారి జన్మనక్షవూతమైన మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాసర తరలి వచ్చారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజున చేసే సరస్వతి అలంకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకొంటుంది. ఆరోజున పిల్లలందరూ సరస్వతిని విధిగా ఆరాధిస్తుంటారు. ఈ తల్లి అనుగ్రహం కలిగి సకల విద్యాప్రాప్తి జరగాలని కోరుకొంటారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మరోవైపు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
బాసరలో వసంత పంచమి వేడుకలు
ఆదిలాబాద్ : చదువుల తల్లి సరస్వతి అమ్మవారి జన్మదిన వసంత పంచమి వేడుకలు బాసర పుణ్య క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏటా మాఘుశుద్ధ పంచమిని అమ్మవారి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. చదువుల తల్లి జన్మదినం సందర్భంగా ఆ సన్నిధిలో అక్షరభ్యాసం చేయిస్తే తమ చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈక్రమంలోనే వందలాది మంది చిన్నారులకు అక్షరాభాస్య పూజలు జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తొలి రోజున అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అక్షరాభ్యాసం పూజలు ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ప్రారంభమైంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహేభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై విజయీభవ కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదంగా ఫొటో, పెన్ను, రక్షాబంధన్ అందచేస్తున్నారు.