తెలియని క్షేత్రాలు | Unknown Fields | Sakshi
Sakshi News home page

తెలియని క్షేత్రాలు

Published Tue, Dec 29 2015 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

తెలియని క్షేత్రాలు

తెలియని క్షేత్రాలు

కొలనుభారతి

సరస్వతీ ఆలయం అనగానే సాధారంణా అందరికీ భాసర, వర్గల్ గుర్తుకొస్తాయి. కాని కర్నూలుజిల్లా ఆత్మకూరు సమీపంలో శివపురం తర్వాత నల్లమల అడవుల చెంత కొలనుభారతి కొలువు తీరిన సంగతి తెలిసిన వారు చాలా తక్కువనే చెప్పాలి. సరస్వతికి కొలను భారతి అనే పేరు ఎందుకొచ్చింది? కొల్లం అంటే చెంచుల సమూహం. ఆ జనావాసాల మధ్య ఉంది కాబట్టి కొల్లం భారతి అనేవారట. అదే కొలను భారతి అయ్యింది. ఈ ఆలయ సమీపంలో సప్త శివాలయాలు ఉంటాయి.

అవేకాక జనార్దన స్వామి ఆలయమూ ఉంది. ఈ సప్త శివాలయాలనూ రెడ్ శాండ్ స్టోన్‌తో నిర్మించినందువల్ల చాళుక్యుల ఆలయాలు అనుకుంటాము కానీ ఆధారాల్లేవు. ఆ ఆలయాలు శిథిల ం కాగా, ఇటీవలే వీటిని పున ర్నిర్మించి కొత్త శివలింగాలనూ ప్రతిష్ఠించి పక్క ఒక్కో ఆలయంలో సప్త మాతృకల్లో ఒక్కొక్కరి విగ్రహాలనూ ఆలయంలో నిలిపారు. అసలే ఆ తల్లి వీణాధరి... సకల విద్యలకూ అధిదేవత... మరి అంతటి తల్లి పక్కనున్న జలధార మామూలుగా గలగలా, జలజలా అంటుందా? ఆ జలధారకు ఎంత చక్కని పేరో? చారుఘోషిణి. తప్పక చూడదగ్గ క్షేత్రం ఇది.
 - గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement