బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో అర్చకులు, అధికారుల నిర్లక్ష్యంతో మరో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో గురువారం వరకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామిజీ చేతుల మీదుగా ఘనంగా మహా కుంభాభిషేకం జరిపించారు.
ఇందులో భాగంగా అమ్మవారి గర్భగుడి శిఖరాలకు కలశ పూజ నిర్వహించారు. అనంతరం దక్షిణ రాజగోపురంపైకి వెళ్లి సంప్రోక్షణ పూజలు నిర్వహించేందుకు ఉపక్రమించగా.. అక్కడి కలశాలకు తొడుగులు కనిపించలేదు. దీంతో స్వామిజీ అర్చకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెల సప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి తొడుగులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ విషయమై ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిని వివరణ కోరగా.. భద్రత చర్యల్లో భాగంగానే శిఖరాలకు తొడుగులు ఉంచలేదన్నారు. ఉత్తర, దక్షిణ రాజగోపురాలపై శిఖరాలకు తొడుగులు లేకపోవడాన్ని స్వామివారు గ్రహించారని, ఇందుకు సంప్రోక్షణ పూజలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఆలయానికి ఎలాంటి ఆపచారం, దోషం లేదని స్వయంగా పీఠాధిపతి సూచించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment