ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరిలో నీరు తగ్గుతోంది. గోదావరి నదిపై ఉన్న వంతెనల వద్ద నీటిమట్టం తగ్గడంతో నల్లమట్టి దిబ్బలు పైకి కనిపిస్తున్నాయి.
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరిలో నీరు తగ్గుతోంది. గోదావరి నదిపై ఉన్న వంతెనల వద్ద నీటిమట్టం తగ్గడంతో నల్లమట్టి దిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. స్నానఘట్టాలకు నీరు చేరకపోవడంతో అక్కడికి వచ్చిన భక్తులంతా మట్టి కుప్పలను దాటుకుంటూ వెళ్లి పుష్కరస్నానాలు ఆచరిస్తున్నారు. తగినంతగా నీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వంతెనల వద్ద ఉన్న నాలుగు, ఐదు స్నానఘట్టాల్లో షవర్ల కింద కూర్చున్నా బురదతో కలిసిన నీరే వస్తోంది. గోదావరిలో నీరు లేక ఇలా బురదతో కూడిన నీటితో స్నానం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బాసర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పవిత్రంగా భావించే నదీజలాలను బురదతో కూడి ఉన్నప్పటికీ బాటిళ్లలో నింపుకుని ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు.