water scarecity
-
సాగునీరు అందేదెట్టా..?
కారేపల్లి : కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లుంది.. కోటిలింగాల చెక్‌డ్యాం ఆయకట్టు రైతుల పరిస్థితి. మిషన్ కాకతీయ పనులతో చెక్‌డ్యాంకు మరమ్మతులు చేస్తున్నారని, వాగులో ఉన్న పూడికను తొలగిస్తున్నారని ఆనందపడాలో.. లేక ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వేసుకున్న పొలాలు, మిర్చి తోటలు ఎండిపోతాయని బాధపడాలో.. అర్థం కాని పరిస్థితుల్లో ఆయకట్టు రైతులు ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పేరుపల్లి, ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న బుగ్గవాగుపై కోటిలింగాల దేవాలయం వద్ద చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం ఆయకట్టులో సుమారు 100 ఎకరాల్లో బుగ్గవాగు నీటిని వినియోగించుకుంటున్నారు. మిర్చి తోటలు, వరి పంట లను సాగు చేస్తున్నారు. పేరుపల్లి రైతులతోపాటు, జమాళ్లపల్లి, పోలంపల్లి, దుబ్బతండా, మోకాళ్లవారి గుంపు, పోలంపల్లి గేటుతండా గ్రామాలకు చెందిన సుమారు 45 మంది రైతులు.. బుగ్గవాగులో నీరు సంవృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది రబీలో వరి సాగు చేస్తున్నారు. అయితే మిషన్ కాకతీయలో చెక్‌డ్యాం మరమ్మలకు రూ.37.44లక్షలు మంజూరు అయ్యాయి. ఇదిలా ఉండగా మరమ్మతులు చేపట్టాలంటే.. బుగ్గవాగులో నీటిని తొలగించాల్సి ఉంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చెక్‌డ్యాం వద్ద తూమ్ గేట్లను పగలకొట్టి బుగ్గవాగు నీళ్లను ఖాళీ చేస్తున్నారని ఆయకట్టు రైతులు ధరావత్ గోపాల్, వర్స రామయ్య, మాలోతు శంకర్, గుగులోతు బాల, వాంకుడోతు హర్జ్య, ఈసం ఎర్రయ్య చెబుతున్నారు. డీజిల్ ఇంజన్లతో పంటలకు కాపాడుకుంటున్నామని, వాగు నీళ్లను ఖాళీ చేస్తే తీవ్రంగా నష్ట పోతామంటున్నారు. దీనికి అధికారులే ప్రత్యామ్నాయం చూపాలని, లేదంటే పైర్లు నాశనం అవుతాయని మొరపెట్టుకుంటున్నారు. పంటలు ఎండిపోక తప్పదు.. మరమ్మతుల పేరుతో బుగ్గవాగు నీళ్లు ఖాళీ చేస్తే పంటలు ఎండిపోక తప్పదు. మా కుటుంబం వీధిన పడుతుంది. నాకున్న 3 ఎకరాల్లో వరి పంట, ఎకరంలో మిర్చి సాగు చేశా. వీటికి బుగ్గవాగు నీళ్లే దిక్కు. పెద్ద సార్లు ఆలోచించి పైర్లు ఎండిపోకుండా చూడాలి. – ధరావత్ గోపాల్, పోలంపల్లి -
మన బీరు మనకే!
రాష్ట్ర అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు పంపిణీ ప్రతి బ్రూవరీలో నిత్యం లక్ష కార్టన్లకు తగ్గకుండా నిల్వలు ఎండలు మండుతున్నందున ఉత్పత్తి పెంచాలని ఆదేశం మంజీరా నుంచి బ్రూవరీలకు పెరిగిన నీటి సరఫరా సాక్షి, హైదరాబాద్: మంటెక్కిస్తున్న ఎండలతో తాగునీటికే కాదు, బీర్లకు కూడా కొరత వచ్చేసింది. దాంతో మద్యం ప్రియులకు అవసరమైనంత బీరును ఇక్కడే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బీర్లను ఇక్కడి అవసరాలు తీరాకే వేరే రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది. అవసరమైతే పని గంటలు పెంచుకునైనా రాష్ట్ర అవసరాలకు సరిపడా బీరును ఉత్పత్తి చేయాలని బ్రూవరీలను ఆదేశించింది. ప్రజల తాగునీటికి కోత పెట్టి మరీ బీర్ల ఉత్పత్తికి కోట్లాది లీటర్ల నీటిని సరఫరా చేస్తున్న దృష్ట్యా వేసవిలో ఎక్కడా బీర్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత బ్రూవరీ కంపెనీలదేనంటూ అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన జిల్లాలకు సరఫరా చేసేందుకు ప్రతి బ్రూవరీలో కనీసంగా లక్ష కార్టన్ల (12 బీరు సీసాలతో కూడిన పెట్టె) బీర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశాలందాయి. బీర్ల ఉత్పత్తి, సరఫరా తీరుపై ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ శనివారం అదనపు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లతో సమావేశమై సమీక్షించారు. రోజుకు 20 వేల నుంచి 75 వేల పెట్టెల బీర్లు రాష్ట్రంలో ఏడాదికి 50 కోట్ల లీటర్ల బీర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు బ్రూవరీ కంపెనీలు పనిచేస్తున్నాయి. బీర్ల తయారీ కోసం వీటికి నెలకు సుమారు 8 కోట్ల నుంచి 10 కోట్ల లీటర్ల నీటి ని హైదరాబాద్ వాటర్‌బోర్డు సరఫరా చేస్తుంది. రోజూ ఒక్కో కంపెనీ 2.4 లక్షల నుంచి 7 లక్షల దాకా బీరు సీసాలను (20 వేల నుంచి 75 వేల కార్టన్లు) ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా డి మాండ్‌కు సరిపడా సరఫరా ఉండటం లేదంటూ పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్‌లోనే ఎన్నడూ లేనంతటి ఎండలు మాడు పగలగొడుతుండటంతో చల్లని బీర్లకు డిమాండ్ మరింత పెరిగింది. దాంతో సరఫరా కష్టమవుతోంది. వచ్చే నెల రోజుల్లో ఎండలు మరింత పెరిగేలా ఉండటంతో సర్కారు అప్రమత్తమైంది. అందుకే ఇక్కడ ఉత్పత్తయ్యే బీర్లను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. బడ్వైజర్, కాల్స్‌బర్గ్, హైవర్డ్స్ 5000, నాకౌట్ తదితర బ్రాండ్ బీర్లకు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా 40 నుంచి 60 శాతం ఎగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరాకే ఎగుమతి చేసేలా బీర్ల కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీర్ల కంపెనీలకు పెరిగిన నీటి కోటా బీర్ల తయారీకి అవసరమైన నీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు జనవరి నాటికే ఎండిపోవడంతో నీటి సరఫరాను అప్పట్లో వాటర్‌బోర్డు ఆపేసింది. బీర్ల కంపెనీల ఒత్తిళ్లు, ఖజానాకు సమకూరే ఆదాయం దృష్ట్యా మంజీరా నుంచి ఐదు బ్రూవరీలకు ప్రత్యేకంగా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటికి నెలకు ఏకంగా 6 నుంచి 8 కోట్ల లీటర్లు సమకూరుస్తున్నారు. రాష్ట్రంలోని బ్రూవరీల ఉత్పాదన సామర్థ్యం, నీటి సరఫరా వివరాలు బీర్ల కంపెనీ వార్షిక ఉత్పాదన సామర్థ్యం నెలకు నీటి సరఫరా (లీటర్లలో) సౌత్ ఏషియా బ్రూవరీస్ 15,00,00,000 2,30,00,000 క్రౌన్ బీర్స్ ఇండియా లి. 5,00,00,000 2,02,61,000 యు.బి. నిజాం బ్రూవరీస్ 5,00,00,000 1,11,60,000 యు.బి. లిమిటెడ్ 20,00,00,000 2,79,00,000 కార్ల్స్‌బెర్గ్ ఇండియా ప్రై.లి. 6,00,00,000 2,00,000 -
కండ్లు తెరిసే లోపే...
కొద్దిసేపటి క్రితం అవి నీటి అడుగున ఉండె కొద్దిసేపటి క్రితం నీటిపైకి వచ్చినవి కొద్దిసేపటి క్రితం గుంపులు గుంపులుగా పూసతాడునుంచి పై పందాడు దాక నీళ్ల మధ్యలో వల మెరిసిన బంగారు పరదా కొద్దిసేపటి క్రితం నా గుండెల నిండుగా పండుగ ఎవరినీ తక్కువేమీ చేయలేదు అందరూ విందులోనే వున్నారు కొద్దిసేపటి క్రితం వల తలలోనే వుండిపోయింది చెరువులో చుక్కనీరు లేదు. మునాస వెంకట్, 9948158163 -
బురద నీళ్లతోనే పుష్కరస్నానం
బాసర : ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరిలో నీరు తగ్గుతోంది. గోదావరి నదిపై ఉన్న వంతెనల వద్ద నీటిమట్టం తగ్గడంతో నల్లమట్టి దిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. స్నానఘట్టాలకు నీరు చేరకపోవడంతో అక్కడికి వచ్చిన భక్తులంతా మట్టి కుప్పలను దాటుకుంటూ వెళ్లి పుష్కరస్నానాలు ఆచరిస్తున్నారు. తగినంతగా నీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంతెనల వద్ద ఉన్న నాలుగు, ఐదు స్నానఘట్టాల్లో షవర్ల కింద కూర్చున్నా బురదతో కలిసిన నీరే వస్తోంది. గోదావరిలో నీరు లేక ఇలా బురదతో కూడిన నీటితో స్నానం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బాసర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పవిత్రంగా భావించే నదీజలాలను బురదతో కూడి ఉన్నప్పటికీ బాటిళ్లలో నింపుకుని ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు.