ఆదిలాబాద్ జిల్లా బాసర గ్రామపంచాయతీలోని యు.హనుమంతరావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం వేకువజామున చోరీ జరిగింది.
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర గ్రామపంచాయతీలోని యు.హనుమంతరావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం వేకువజామున చోరీ జరిగింది. ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత వచ్చిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా రూ.లక్ష నగదు, 24 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే చోరీ జరిగిందని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.