
వసంత పంచమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని బాసరలో శనివారం జరగబోయే వసంత పంచమి ఏర్పాట్ల గురించి ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
బాసర: సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని బాసరలో శనివారం జరగబోయే వసంత పంచమి ఏర్పాట్ల గురించి ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఏర్పాట్లపై ఆలయ అధికారులతో, పోలీసులతో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే కలిసి వస్తుందని భక్తజనం భావిస్తుంటారు. ఈ పంచమికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది ప్రజలు తరలి వస్తారు.మూడు రోజుల పాటు పంచమి వేడుకలు జరుగుతాయి.