ప్రభుత్వం ఓకే చెబితేనే అమలు
బాసర ఆర్‌జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన
ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయంలో (ఆర్‌జీయూకేటీ) సమీకత బీటెక్ (ట్రిపుల్‌ఐటీ) కోర్సులో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థుల వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. బాసరలోని క్యాంపస్‌లో 1,000 సీట్ల భర్తీకి విద్యార్థులను ఎంపిక చేసినట్లు మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో బాసర క్యాంపస్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి ప్రవేశాలు కల్పిస్తామని వివరించారు.
స్పెషల్ కేటగిరీ (స్పోర్ట్స్, ఎన్‌సీసీ, వికలాంగులు) వారికి 28, 29 తేదీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. నిర్ణీత తేదీల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా, సీట్లు మిగిలినా 31వ తేదీన తుది దశ కౌన్సెలింగ్ నిర్విహ స్తామని పేర్కొన్నారు. తుది కౌన్సెలింగ్ తరువాత కూడా సీట్లు మిగిలితే ఆ తరువాత ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించే తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రవేశాల కోసం మొత్తంగా 10,713 మంది దరఖాస్తు చేసుకోగా జనరల్ కేటగిరీలో 936 మంది విద్యార్థులను ప్రవేశాలకు ఎంపిక చేసినట్లు వివరించారు.
ప్రభుత్వం ఓకే అంటేనే అదనం
ప్రస్తుతం రాష్ట్రంలోని 202 మండలాలకు చెందిన విద్యార్థుల్లో ఒక్కరికి కూడా సీట్లు లభించలేదని పాపిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆర్‌జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సూపర్ న్యూమరరీ సీట్లు క్రియేట్ చేయాలని తీర్మానం చేసిందని, ఈ మేరకు ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు చెప్పారు. ప్రస్తుతం బాసర క్యాంపస్‌లో 1,000 సీట్లు ఉన్నాయని, ప్రభుత్వం ఒప్పుకుంటే 202 సీట్లు అదనంగా వస్తాయన్నారు.
బాసర ఆర్‌జీయూకేటీలో పెరగనున్న సీట్లు!
Published Thu, Jul 2 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM
Advertisement