‘రామచరిత మాసన’ విక్రయాల జోరు! | Ramcharitmanas Demand Grows: Gita Press Faces Shortage | Sakshi
Sakshi News home page

Ramcharitmanas: ‘రామచరిత మాసన’ విక్రయాల జోరు!

Published Sat, Jan 13 2024 12:49 PM | Last Updated on Sat, Jan 13 2024 1:06 PM

Ramcharitmanas Demand Grows Gita Press - Sakshi

ఈనెల  22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగిపోయింది. 

ఈ ప్రభావంతో దేశంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు, ఆడియో, వీడియోలకు మునుపెన్నడూ లేనంత డిమాండ్‌ పెరిగింది. 50 ఏళ్లలో తొలిసారిగా ‘రామచరిత్‌మానస’కు అమితమైన ఆదరణ లభించిందని ‘రామచరిత్‌మానస’విక్రేతలు చెబుతున్నారు.
 

‘రామచరితమానస’ పుస్తకం విషయానికొస్తే దీనిని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గల గీతా ప్రెస్ విరివిగా ముద్రిస్తోంది. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా గీతా ప్రెస్‌లో ‘రామచరితమానస’ స్టాక్‌ తగినంతగా లేని పరిస్థితి ఏర్పడింది. రామచరితమానసకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, గీతా ప్రెస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టు గీతాప్రెస్‌లో ‘రామచరితమానస’ పుస్తకం ప్రింటింగ్‌ను వేగవంతం చేస్తున్నారు. గీతా ప్రెస్ మేనేజర్ లాలమణి త్రిపాఠి మాట్లాడుతూ అయోధ్యలో నూతన రామమందిరం ‍ప్రారంభానికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సుందరాకాండ’, ‘హనుమాన్ చాలీసా’ ‘రామచరితమానస’కు డిమాండ్ మరింతగా పెరిగిందని అన్నారు. గతంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 75 వేల కాపీలు ముద్రితమయ్యేవని, ఇప్పుడు దానిని లక్షకు పెంచినప్పటికీ, స్టాక్‌ ఉండటం లేదన్నారు.
ఇది కూడా చదవండి: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement