సల్మాన్ ఖాన్ను కలవనున్న గీత
ఇండోర్: తను భారత్కు వెళ్లిన తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను కలుసుకోవాలనుకుంటున్నట్లు పాకిస్థాన్లోని కరాచీలో ఉంటున్న గీత తన మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇండియాకు వచ్చిన మరుక్షణమే కుటుంబ సభ్యులతో సహా వెళ్లి ఆయనను కలుస్తామని చెప్పినట్లు తెలిసింది. పుట్టుకతోనే మూగచెవిటిదైన బాలిక గీత.. దశాబ్దకాలం కిందట సరిహద్దు దాటి పొరపాటున పాకిస్థాన్కు వెళ్లిపోయిన విషయం విధితమే. ప్రస్తుతం ఆమె కరాచీలోని ఓ ముస్లిం స్వచ్ఛంద సంస్థ ఆదరణలో పెరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు 20 ఏళ్లు దాటాయి.
సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ చిత్ర కథ.. గీత కథ దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలైన తర్వాత తనకు ఇండియా రావాలని ఉందని కరాచీలోని గీత తన కోరికను మీడియా ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులను కూడా గుర్తించింది. దీంతో త్వరలోనే బీహార్లోని తన తల్లిదండ్రులను గీత కలుసుకోబోతుంది. ఈ నేపథ్యంలో దయేంద్ర పురోహిత్ అనే వ్యక్తి గీతాను వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. ఈ సందర్భంగా ఆమెకు భారత్ తొందరగా రావాలని కుతూహలంగా ఉందని, రాగానే సల్మాన్ ఖాన్ ను కలుసుకోవాలనుకుంటుందని వెల్లడించింనట్లు తెలిపారు.