ఢిల్లీ : ఆన్‌లైన్ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంప్‌తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఏడాది జులైలో పబ్‌జీ (pubg) వీడియోగేమ్‌లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.
పాక్ నుంచి భారత్‌కు వచ్చిన హైదర్ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్‌ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment