Haider
-
తల్లి కాబోతున్న సీమా హైదర్
ఢిల్లీ : ఆన్లైన్ గేమ్‌లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంప్‌తో వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ఏడాది జులైలో పబ్జీ (pubg) వీడియోగేమ్‌లో గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో ప్రేమలో పడింది. సచిన్ మీనాకు దూరంగా ఉండలేక తన నలుగురు పిల్లలతో సహా పాక్ సరిహద్దును దాటి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ ఉదంతంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.పాక్ నుంచి భారత్‌కు వచ్చిన హైదర్ ఆరోపణలు,కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మతం మార్చుకుని సచిన్‌ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన నలుగురు పిల్లల పేర్లు మార్చారు. నలుగురు పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. తాజాగా, త్వరలో తాను పండంటి బిడ్డకు జన్మనిస్తున్నట్లు ఓ వీడియోను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. -
మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
పాక్ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్‌తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. గులాం హైదర్ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్‌ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది. సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్ భర్త గులాం హైదర్‌లకు జన్మించారు.తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్‌కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదో వేచి చూడాల్సిందే. -
‘సీమా హైదర్ చాలా డేంజర్’
ప్రియుని కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్‌లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నాడు.సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్‌కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్‌కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్‌తో టచ్‌లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్‌తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్ పేర్కొన్నారు. -
సీమా హైదర్‌కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్‌లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
సీమా హైదర్ కేసులో కొత్త మలుపు?
తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల కార్యకర్త ఒకరు పాక్‌లోని కరాచీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సీమా, సచిన్ మీనాల కేసును ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీరిని నోయిడా పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత 2023 జూలైలో ఈ జంటను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాటు రబుపురా ప్రాంతంలో రహస్యంగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె పిల్లలందరూ ఏడేళ్లలోపు వారే. సీమా, మీనాలను గత ఏడాది జులై 4న అరెస్టు చేసిన స్థానిక కోర్టు జూలై 7న వారికి బెయిల్ మంజూరు చేసింది. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గల జాకోబాబాద్‌కు చెందిన సీమా హైదర్ కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా గత ఏడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో సీమా భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. కాగా పాక్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ, సీమా భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఈ నేపధ్యంలో తాము భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటార్నీని పంపామని తెలిపారు. మానవ హక్కుల కార్యకర్త బెర్నీ ఒక ట్రస్ట్‌ను కూడా నడుపుతున్నారు. ఇది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురయిన పిల్లలను వెదికేందుకు పనిచేస్తుంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలకు సాయం అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. కాగా సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది. కాగా గులాం హైదర్ వాదన బలంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మత మార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు. సీమ ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని, వారు చిన్న వయస్సులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని, కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్‌కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు. భారతదేశంలోని సీమా హైదర్, సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని, దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు. -
అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన!
అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్ తాను కృష్ణ భక్తురాలిని చెప్పుకుంటుంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అమె వెల్లడించింది. సోషల్ మీడియాలో సీమాహైదర్‌కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్‌తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులందరితో కలిసి రామ్‌లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సీమా మీడియాకు తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
ప్రశ్నించేవారికి షరతు విధించిన సీమాహైదర్!
పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్ ప్రతిరోజూ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తుంటుంది. ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది. సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్‌కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది. సచిన్, సీమా హైదర్‌లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్‌ల వీడియో వైరల్‌గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది. తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీమా హైదర్ ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు. -
‘సీమా హైదర్ ఒక దొంగ.. నేరస్తురాలు.. ఉరికంబం ఎక్కిస్తా’
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన ప్రియుడు సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది. ఆమె భారతదేశానికి వచ్చినప్పటి నుండి.. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాడు. గులాం హైదర్‌కు చెందిన పలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అందులో ఆమెను వెనక్కి పంపించాలంటూ అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కనిపిస్తుంది. సీమా హైదర్ భారతదేశానికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఆమె భర్త గులాం హైదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంపై తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈ ఛానెల్ ద్వారా గులాం హైదర్ తన సందేశాన్ని భారత్, పాకిస్తాన్ ప్రజలకు తెలియజేయజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను భారత ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తున్నాడు. గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి పంపించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. మరోవైపు సీమా హైదర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్, నేత్రపాల్‌లను గులాం హైదర్ హెచ్చరిస్తూ కూడా వీడియోలో కనిపిస్తున్నాడు. వీలైనంత త్వరలో తాను పాకిస్తాన్ నుంచి భారత్‌కు వస్తానని కూడా గులాం హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలో గులాం హైదర్ తన భార్య సీమా హైదర్‌పై పలు ఆరోపణలు చేస్తూ.. తన పిల్లలను పాకిస్తాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తీసుకెళ్లిందని ఆరోపించాడు. తన పిల్లలను తనతోపాటు తీసుకురావడానికి తాను ఖచ్చితంగా భారతదేశానికి వెళ్తానని, భారతదేశ ప్రజలపై, భారతదేశ చట్టాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని గులాం హైదర్ పేర్కొన్నాడు. తన పోరాటానికి భారత్‌లో తప్పకుండా మద్దతు దొరుకుతుందని అన్నాడు. ‘సీమా హైదర్ ఒక దొంగ... నేరస్తురాలు.. నా ఆస్తి, ఇల్లు అమ్మేసి ఇండియా పారిపోయింది. అందుకే ఈరోజున నేను రోడ్డున పడ్డాను. సీమా.. ఇక నువ్వు ఏం చేసినా తప్పే.. నువ్వు ఏడుస్తావు.. పశ్చాత్తాపపడతావు.. బాధపడతావు.. ఆర్తనాదాలు చేస్తావు.. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను.. ఇదే నా జీవిత లక్ష్యం’ అని ఆ వీడియోలో గులాం హైదర్ పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగితో పాటు పాకిస్తాన్ ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని గులాం హైదర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అలాగే సీమా హైదర్ ప్రేమికుడు సచిన్ మీనా, ఏపీ సింగ్, నేత్రపాల్‌లను హెచ్చరించాడు.. ‘గుర్తుంచుకోండి.. మీరు ఇప్పటివరకు ఏమి చేసినా.. ఏదో ఒకరోజు మీ అందరికీ శిక్ష పడుతుంది’ అని పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
కొత్త సంవత్సరంలో సీమా హైదర్ ప్లానేమిటి?
2023 ముగిసింది. 2024 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అందరూ తమ ఆశలు, అంచనాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. 2023లో వార్తల్లో కనిపించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ కూడా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. 2023 తనకు ఎంతో మంచి చేసిందని సీమా హైదర్ మీడియాకు తెలిపారు. 2024లో తన సమస్యలన్నీ తొలగిపోతాయని, కుటుంబంతో కలిసి భారతదేశంలో స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నానని ఆమె పేర్కొన్నారు. మే 2023లో నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో సహా యూపీ చేరుకున్న సీమా హైదర్ ప్రస్తుతం రబుపురా గ్రామంలోని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే నిబంధన ఉందని, అందుకే ఇంటిలోనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నానని సీమా తెలిపారు. తనకు బయటకు వెళ్లే అవకాశం దొరికినప్పుడు దేశమంతా పర్యటించాలని కోరుకుంటున్నానని, తన భర్త, పిల్లలు ఇంటి బయట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే తన నలుగురు పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే వారు ట్యూషన్‌కు వెళుతున్నారని ఆమె తెలిపారు. అయితే 2024లో తన పిల్లలను బడికి పంపించే అవకాశం దక్కుతుందనుకుంటున్నానని సీమ పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి 2023, మే 13న నేపాల్ మీదుగా భారత్‌కు తరలివచ్చారు. తరువాత రబుపురా గ్రామం చేరుకుని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. కాగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను, సచిన్, సచిన్ తండ్రిని అరెస్ట్ చేశారు. ముగ్గురినీ గత జూలై 4న అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు -
పరిచయం కాస్త ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా..
రాంచీ: పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా బాటలోనే పోలాండ్‌కు చెందిన ఓ మహిళ కూడా తన ప్రియుని కోసం జార్ఖండ్‌కు వచ్చింది. హజారీబాగ్ జిల్లాలోని కటకంసంది మండలం ఖుత్రా గ్రామానికి చేరుకుని ప్రియుడు షాబాద్ మాలిక్‌ను కలుసుకుంది. ఐదేళ్ల కూతురుతో కలిసి 45 ఏళ్ల విదేశీ మహిళ చేరుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆమె పేరు బార్బరా పొలాక్ (45) పొలాండ్‌కు చెందిన మహిళ. తమ భర్తతో విడాకులు తీసుకుంది. అక్కడ సొంతంగా ఓ కంపెనీలో 50 శాతం షేర్‌తో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు షాబాద్ మాలిక్(27). వారిమధ్య కొన్నాళ్ల పరిచయం కాస్త ప్రేమగా పరిణమించింది. అనంతరం ఇరువురూ ముంబయిలో పలుమార్లు కలుసుకున్నారు. ఇక షాబాద్‌ను కలవడానికి ఖుత్రా గ్రామానికి బార్బరా రావడం ఇదే మొదటిసారి. వీసా కారణాల వల్ల బార్బరా.. షాబాద్‌తో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక పూర్తి స్థాయిలో వీసా రావడంతో ఏకంగా ఖుత్రా గ్రామానికి చేరుకుంది. ఖుత్రా గ్రామానికి చేరుకున్న బార్బరా.. షాబాద్ ఇంట్లోనే పోలాండ్ వంటకాలను తయారు చేస్తోంది. ఇంట్లో ఏసీ పెట్టించింది. బార్బరా కూతురు అనియా పోలాక్.. షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. కాగా.. బార్బరా మొదటి భర్త విడాకుల అనంతరం న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. పోలాండ్ మహిళ గ్రామానికి వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఖుత్రా గ్రామానికి చేరుకున్నారు. బార్బరాకు 2028 వరకు వీసా ఉన్నట్లు స్థానికి డీఎస్పీ తెలిపారు. దర్యాప్తు ముగిసేవరకు హోటల్లో బస చేయాల్సిందిగా బార్బరాకు చెప్పారు. అయితే.. షాబాద్‌ను తనతోపాటే పోలాండ్‌కు తీసుకువెళతానని బార్బరా తెలిపారు. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి..
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనే అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఆమెను విచారిస్తున్న ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(యూపీ ఏటీఎస్)ముందు ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. పబ్జీ ఆడుతూ భారత్‌కు చెందిన యువకుడు సచిన్ ప్రేమలో పడి, అక్రమంగా నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన సీమాకు సంబంధించిన పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సీమా సోదరుడు, మామ పాక్ ఆర్మీ సభ్యులు తాజాగా సీమా సోదరుడు ఆసిఫ్ పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తున్నాడని అధికారుల విచారణలో వెల్లడయ్యింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్ కూడా పాక్ పాక్ సైన్యంలోనే పనిచేస్తున్నాడని తేలింది. ఈ విషయాన్ని సీమా భర్త గులాం హైదర్ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం విశేషం. పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్, అతని సోదరి, తన భార్య అయిన సీమా తరచూ మాట్లాడుకునేవారనే విషయాన్ని సీమా భర్త గులాం అధికారుల సమక్షంలో వెల్లడించాడు. సీమా మామ పాక్ ఆర్మీలో ఉన్నత పదవిలో కొనసాగుతున్నారని, ఆయన ఇస్లామాబాద్‌లో ఉంటున్నాడని గులామ్ తెలిపాడు. సీమా హైదర్‌కు పాక్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో గల సంబంధాలపై ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఢిల్లీలో మరికొంతమందితో ఆమెకు పరిచయం యూపీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడి ప్రేమలో పడ్డానంటూ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాక్ మహిళ సీమా గులాం హైదర్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) పోలీసులు విచారిస్తున్నారు. పాక్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో మరికొంతమందితో పరిచయం ఉన్నన్నదని ఏటీఎస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎస్ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి! ఆశ్యర్యపరుస్తున్న సీమా ఆంగ్ల పరిజ్ఞానం విచారణలో సీమా హైదర్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి కీలక విషయాలకు సమాధానాలు రాబట్టడం అంత సులభం కావడంలేదని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమాకు గల ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. ఇదిలావుండగా సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని, ఆమెను తిరిగి అక్కడికి పంపాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెసేజ్ చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పాక్ పంపించండి: భర్త వేడుకోలు యూపీ ఏటీఎస్ అధికారుల విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివాసం ఉంటున్నందున సీమాను నోయిడా పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్‌తోపాటు అతడి తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ప్రస్తుతం ఈ ముగ్గురిని యూపీ ఏటీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా సీమా తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపింది. అయితే ఆమెను ఎలాగైనా పాక్‌కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్ పోలీసులను కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. -
షాహిట్ కపూర్
కొందరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండా కూడా చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు కారణాలు ఉండి చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు మాత్రం చెడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నా గట్టిగా, మొండిగా, తొణక్కుండా, బెణక్కుండా కుటుంబం కోసం, లక్ష్యం కోసం నిలబడతారు. షాహిద్‌కపూర్ నటించిన ‘ఉడ్తా పంజాబ్’ పెద్ద సంచలనం రేపింది. డ్రగ్స్ మత్తులో దొర్లే పంజాబ్ రాష్ట్ర పరిస్థితులను చెప్పే ఈ సినిమాలో షాహిద్ కపూర్ డ్రగ్స్‌కు బానిసైన ఒక రాప్ సింగర్‌గా నటించాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాహిద్‌ను కరడుగట్టిన డ్రగ్స్ బానిస అనే నిర్థారణకు వస్తారు. కాని వాస్తవం ఏమిటంటే షాహిద్ జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తాకి ఎరగడు. నిజం ఏమిటంటే అతడు మద్యం కూడా తాగి ఎరగడు. ఇంకా నిజం ఏమిటంటే అతడు పక్కా శాకాహారి. మాంసం కూడా ముట్టడు. దేశంలో పెద్ద హీరోగా చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండి సాయంత్రమైతే పార్టీలు, పబ్‌లు ఉండే బాలీవుడ్ వాతావరణంలో ఉన్నా షాహిద్ ఇలాగే తన కేరెక్టర్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది మామూలు సంగతి కాదు. పెద్ద విజయం. షాహిద్‌కు మూడేళ్ల వయసప్పుడు అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి పంకజ్ కపూర్, తల్లి నీలిమా అజీమ్. పంకజ్ కపూర్ ప్యారలల్ సినిమాల నటుడు. కమర్షియల్ సినిమాలలో వచ్చే పాత్రలు, డబ్బులు అతడికి రావు. ఇక నీలిమా అజీమ్ కథక్ డాన్సర్, మోడల్. కొన్ని సినిమాలలో నటించింది. వీళ్లిద్దరి కాపురం షాహిద్ పుట్టాక ఒడిదుడుకులకు లోనైంది. విడాకుల తర్వాత నీలిమ.. షాహిద్‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. పదేళ్ల వయసు వచ్చే వరకూ షాహిద్ ఢిల్లీలోనే పెరిగాడు. దేవుడు ఒక తోడును తెంపేస్తే రెండు ఆసరాలను ఇస్తాడు. చిన్నారి షాహిద్‌కు ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్యలే గొప్ప నేస్తాలు. వారిద్దరూ అప్పట్లో రష్యా నుంచి వెలువడే ‘స్పుత్నిక్’ పత్రిక కోసం పని చేసేవారు. షాహిద్‌కు తాతయ్య రోజూ కథలు చెప్పేవాడు. విడిపోయిన తండ్రి పట్ల ద్వేషం కలగకుండా మంచి మాటలు మాట్లాడేవాడు. కాని షాహిద్‌కు మాత్రం తనతో ఉన్న తల్లి అంటేనే ఎంతో ఇష్టం ఉండేది. తల్లి ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది –‘అప్పుడు షాహిద్‌కు ఐదేళ్లు కూడా లేవు. నేను ఢిల్లీలో చాలా ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని. ఒకరోజు రాత్రి నేను బాగా ఏడుస్తున్నాను. షాహిద్ నన్ను గమనించాడు. ఏమనుకున్నాడో ఏమో అంత చిన్న వయసులో నన్ను దగ్గరకు తీసుకుని ‘ఏడవకమ్మా. నేనున్నానుగా అన్నాడు. అది నేను మర్చిపోలేను’ అంటుందామె. నిజంగానే షాహిద్ ఎప్పుడూ కుటుంబానికి నేనున్నాను అన్నట్టుగానే ఉన్నాడు. బాధ్యత తప్పిపోవడం అతడికి తెలియదు. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే గర్ల్ ఫ్రెండ్ అని బాలీవుడ్ సామెత. కరీనా కపూర్ అతడి జీవితంలో అలా నడిచి వచ్చింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ముద్దు ముచ్చట్లు చెప్పుకున్నారు. లండన్ టాబ్లాయిడ్ ఒకటి వీళ్ల బహిరంగ ముద్దును ఫొటోలుగా వేస్తే పెద్ద సంచలనం అయ్యింది. వీళ్లద్దరూ కలిసి నటించిన ‘జబ్ వియ్ మెట్’ కమర్షియల్‌గా ఘన విజయం సాధించడమే కాదు ఇద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. షాహిద్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లి నీలిమ సినీ అవకాశాల కోసం ముంబై చేరుకుంది. రాజేష్ ఖత్తార్ అనే నటుణ్ణి పెళ్లి చేసుకుంది. షాహిద్ తల్లి నిర్ణయాన్ని అంగీకరించి ఆమెతో ఉండిపోయాడు. మరోవైపు తండ్రి పంకజ్‌కపూర్ కూడా నటి సుప్రియా పాఠక్‌ను పెళ్లి చేసుకున్నాడు. తండ్రి నిర్ణయాన్ని కూడా షాహిద్ అంగీకరించాల్సి వచ్చింది. కొన్నాళ్లు ఇక్కడ... మారుతండ్రి. కొన్నాళ్లు అక్కడ... మారు తల్లి. ఎదుగుతున్న వయసు. తల్లిదండ్రులు బిజీగా ఉంటే, సమాజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ కుర్రాడైనా చెడిపోవాలి. కాని షాహిద్ చెడిపోలేదు. పతనం అయ్యే బలహీనుణ్ణి కాను నేను అని బలం తెచ్చుకున్నాడు. దృష్టి ఏకాగ్రత కోసం అతడు చేసిన పని ఏమిటో తెలుసా? డాన్స్ నేర్చుకోవడం. షాహిద్ రక్తంలోనే డాన్స్ ఉంది. కొరియోగ్రాఫర్ అయి ఉంటే షాహిద్ చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అయి ఉండేవాడు. ఆ రోజుల్లో వచ్చిన ‘తాళ్’, ‘దిల్ తో పాగల్ హై’ సినిమాల్లో షాహిద్ గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా నటించాడు. పెప్సీ యాడ్‌లో కూడా షారుక్ ఖాన్‌తో మెరిశాడు. చదువు మీద ఎలాగూ దృష్టి లేదు. అలాగని సినిమాల్లో హీరో అవుదామంటే ఎదిగే వయసు. బక్క పలుచగా నూనూగు మీసాలతో ఉన్న షాహిద్‌ను చూసిన ఏ నిర్మాత అయినా ‘ఇప్పుడు కాదు కొన్నాళ్లు ఆగు’ అంటున్నారు. ఆ రోజుల్లో షాహిద్‌కు తినడానికి తిండి లేదు. ఉండటానికి సరైన రూమ్ కూడా లేదు. ఫ్రస్ట్రేషన్. మందు తాగొచ్చు. బీరు తాగొచ్చు. కాని షాహిద్ కేవలం టీ మాత్రమే తాగాడు. చాలామంది ఏమనుకుంటారంటే నటీనటులు తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలకు అవకాశాలు ఈజీగా వస్తాయి అని. నటీనటుల కొడుకు అయినా సరే బాలీవుడ్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్‌లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. షాహిద్ తనుకు తెలిసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌లకూ వెళ్లేవాడు. ఆడిషన్స్ ఇచ్చేవాడు. కాని అందరూ రిజక్టే చేశారు. రిజక్ట్ చేసేకొద్దీ షాహిద్ పట్టుదల పెంచుకున్నాడు. సులభంగా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. కష్టపడి సాధిద్దాం.. అందాక వేచి చూద్దాం అని షాహిద్ అనుకున్నాడు. ‘తేజాబ్’ తీసిన ఎన్.చంద్ర ఆ సమయంలోనే ‘సై్టల్’ అనే సెక్స్ కామెడీ తీస్తూ షాహిద్‌కు హీరో వేషం ఇచ్చాడు. అంత పెద్ద డైరెక్టర్. కాని తీస్తున్నది బూతు సినిమా. ఇంకోడు వేరొకడు అయితే ఎగిరి గంతేసేవాడు. షాహిద్ మాత్రం బయటి వ్యక్తిత్వం మాత్రమే కాదు తెర మీద వ్యక్తిత్వం కూడా బాగుండాలి అని ఆగాడు. ఏ అవకాశమూ లేని యువకుడు అలా సంయమనం పాటించడం మామూలు విషయం కాదు. చాలా అరుదు. బాలీవుడ్లో ‘టిప్స్’ చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ అధిపతి రమేశ్ తౌరానీ దృష్టి షాహిద్ మీద పడింది. ఈ కుర్రాడు పనికొస్తాడు అని ‘ఇష్క్ విష్క్’ అనే సినిమా తీశాడు. 2003లో రిలీజైంది. స్లీపర్ హిట్. షాహిద్ లోకానికి తెలిశాడు. అయితే ఆ వెంట వెంటనే అతడికి హిట్స్ పడలేదు. ఫిదా (2004), దిల్ మాంగే మోర్ (2004), శిఖర్ (2005) సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. షాహిద్ స్థితప్రజ్ఞుడు. నాలుగు పోతే ఐదోది హిట్ అవుతుంది అనుకున్నాడు. దాని కోసం ఒక ఆపద్బాంధవుడికై ఎదురు చూశాడు. తుదకు అతడు వచ్చాడు. పేరు– సూరజ్ భరజాత్యా. సల్మాన్‌ఖాన్‌ను ‘మైనే ప్యార్ కియా’తో జీవితానికి సరిపడ స్టార్డమ్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ భరజాత్యా షాహిద్‌తో సినిమా తీయబోతున్నానని ప్రకటించేసరికి ఇండస్ట్రీలో ఒకటే కుతూహలం. ఎందుకంటే సూరజ్ అంతకు ముందు తీసిన ‘హమ్ సాత్ సాత్ హై’, ‘మే ప్రేమ్ కీ దీవానీ హూ’... సో సోగా వెళ్లాయి. షాహిద్ చూస్తే ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు విఫల బాటసారులు ఒక సఫల సినిమాను ఎలా తీస్తారా అని కుతూహలం. కాని సూరజ్ తనకు బాగా తెలిసిన సాంస్కృతిక పరంపరను, వివాహాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వివాహ్’ సినిమా తీసి విడుదల చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్. షాహిద్ కపూర్ తన జీవితంలో చూసిన మొదటి పెద్ద హిట్– ‘వివాహ్’. కాని మాటలనే లోకం మాటలు అంటూనే ఉంటుంది. నలుగురిలో కలవడానికి ఇష్టపడని షాహిద్‌ను పొగరుబోతనీ అహంభావి అని అంటూ ఉంటుంది. కాని జీవితంలో తాను చూసిన కష్టనష్టాల వల్లే తాను రిజర్వ్‌గా మారానని, నలుగురినీ కలవడానికి ఇష్టపడననీ షాహిద్ అంటూ ఉంటాడు. కరీనాతో ప్రేమ కథ ముగిసింది. షాహిద్‌ను వీలైన ప్రతి హీరోయిన్‌తోనూ బాలీవుడ్ ముడిపెట్టింది. ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్ కూడా షాహిద్ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. చివరకు స్వయంవర ఘట్టం ముగిసింది. షాహిద్ తాను ఆధ్యాత్మికంగా ఫాలో అయ్యే ఒక గ్రూప్‌లో కాలేజీ స్టూడెంట్‌గా పరిచయమైన మీరా రాజ్పుట్ అనే అమ్మాయిని వయసు రీత్యా 12 ఏళ్ల ఎడం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకో పాప. పేరు మీషా. షాహిద్ నటించిన ‘రంగూన్’ సినిమా ఇవాళ రిలీజైంది. దీనికి ముందు అతడికి ‘హైదర్’, ‘ఉడ్తా పంజాబ్’ల వల్ల మంచి విజయం లభించింది. ‘రంగూన్’ విజయం సాధిస్తే మరిన్ని మంచి సినిమాల్లో షాహిద్ మనకు కనిపించే అవకాశం ఉంది. హిట్ హీరో అంటే స్క్రీన్ మీద విజయం సాధించేవాడు మాత్రమే కాదు. నిజ జీవిత బాధ్యతల్లో కూడా విజయం సాధించేవాడని అర్థం. ఆ విధంగా అతడు నిజంగానే– షాహిట్ కపూర్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
టీటీఎఫ్ మహాసభలకు తరలిన ఉపాధ్యాయులు
ముస్తాబాద్: సిరిసిల్లలో జరుగుతున్న టీటీఎఫ్ విద్యా మహాసభలకు ముస్తాబాద్ నుంచి ఉపాధ్యాయులు ఆది వారం తరలివెళ్లారు. రెండు రోజు లపాటు సిరిసిల్లలో నిర్వహిస్తున్న విద్యా మహాసభల్లో విద్యారంగ అభివృద్ధిపై చర్చిస్తామని టీటీఎఫ్ నాయకులు వి.చంద్రం, హన్మంతరెడ్డి తెలిపారు. మసీదు కమిటీ అధ్యక్షుడిగా హైదర్ సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండల కేంద్ర మదీన మసీదు కమి టీ అధ్యక్షుడిగా ఎండీ హైదర్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా హైదర్బాబా ఎన్నికయ్యారు. ఇరువురిని మసీదు కమిటీ ప్రముఖులు అభినందించారు. -
బేగమ్ హజ్రత్... భేష్!
వంకీలు తిరిగిన ఎర్రటి రంగు జుత్తుతో గమ్మత్తుగా కనిపిస్తున్న టబు లుక్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. కథానాయికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించిన టబు ‘హైదర్’ సినిమా పుణ్యమా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా హిందీ దర్శక-నిర్మాతలకు కొత్త ఛాయిస్ అయ్యారు. కథలో ప్రాధాన్యం ఉన్న సహాయ నటి పాత్రలంటే టబూనే చేయాలని అక్కడివారు ఫిక్స్ అయిపోయారు. చివరికి ‘ఫితూర్’లో అందాల అభినేత్రి రేఖని తీసుకున్న పాత్రకు టబూని రీప్లేస్ చేశారంటే.. ఈ పొడుగు కాళ్ల సుందరికి హిందీలో ఉన్న డిమాండ్ ఏంటో ఊహించుకోవచ్చు. అదే ‘బేగమ్ హజ్రత్’ పాత్ర. ఈ పాత్రను రేఖ వదులుకోవడం టబు అదృష్టం అని హిందీ రంగంలో అందరూ అంటున్నారు. ముఖ్యంగా టబు లుక్ విడుదలయ్యాక మంచి పాత్ర కొట్టేశారనీ, ‘బేగమ్ హజ్రత్’గా ఆమె లుక్ భే్ష్ అని కితాబులిచ్చేస్తున్నారు. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఆదిత్యా రాయ్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రఖ్యాత ఆంగ్ల నవల ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ ఆధారంగా తెరకెక్కుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. -
హైదర్ చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు
-
జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!
కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్ ఉత్తమ తెలుగు చిత్రంగా చందమామ కథలు న్యూఢిల్లీ: అరవై రెండో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెంగాలీ చిత్రాలకు పంట పండింది. ఏడుకు పైగా బెంగాలీ సినిమాలు అవార్డుకు ఎంపికయ్యాయి. షేక్స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా హైదర్‌కు ఐదు అవార్డులు లభించాయి. - హిందీ సినిమా క్వీన్‌లో అద్భుతంగా నటించిన కంగనా రనౌత్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. నాను అవనాళ్ల అవలు(నేను అతడు కాదు, ఆమెను) సినిమాలో హిజ్రాపాత్రలో ఒదిగిపోయిన కన్నడ నటుడు సంచారి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందారు. న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ చైతన్య తమానే రూపొందించిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రియాంక చోప్రా నటించిన హిందీ సినిమా ‘మేరీ కోమ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ‘62వ జాతీయ చలన చిత్ర అవార్డులు-2014’ను మంగళవారం ఢిల్లీలో అవార్డుల జ్యూరీ చైర్మన్ జి. భారతీరాజా ప్రకటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగుచిత్రంగా ‘చందమామ కథలు’, సినీ రచయిత పసుపులేటి పూర్ణచంద్రారావు ‘సెలైంట్ సిని మా (1895-1930)’గ్రంథానికి గాను ఉత్తమ సినీగ్రంథ అవార్డు, ఉత్తమ ప్రచురణ సంస్థగా ‘ఎమెస్కో’ బుక్స్, అలాగే, నల్లమూతు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఫోర్స్- ఇండియాస్ వెస్టర్న్ ఘాట్స్’ సినిమా ఉత్తమ పరిశోధనాత్మక చిత్రంగా ఎంపికైంది. -
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు : క్వీన్.. నిజంగానే క్వీన్!
ముంబై: సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్న అవార్డులు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు. దక్షిణ భారతదేశ చిత్రాలకు, బాలీవుడ్ చిత్రాలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. బాలీవుడ్‌కు సంబంధించి, 2014లో విడుదలైన సినిమాలకు గానూ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో విమర్శకుల ప్రశంసల పరంగానూ, బాక్సాఫీస్ పరంగానూ ఘన విజయం సాధించిన 'క్వీన్', 'హైదర్' సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో అవార్డులతో పాటు మొత్తం 6 అవార్డులను సొంతం చేసుకొని, క్వీన్ నిజంగానే క్వీన్‌గా నిలబడింది. ఇక హైదర్ విషయానికి వస్తే.. ఉత్తమ నటుడి విభాగంలో అవార్డుతో పాటు మొత్తం 5 అవార్డులను సొంతం చేసుకుందీ సినిమా. ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీల తాజా సంచలనం పీకే.. ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సంభాషణల విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకొంది. ఇక గతేడాది విడుదలైన చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి వరుసలో ఉన్న హైవే సినిమాకు గానూ, ఆలియాభట్, ఉత్తమ నటి (క్రిటిక్స్ క్యాటగిరీ) అవార్డును సొంతం చేసుకున్నారు. అలనాటి మేటి నటి కామిని కౌషల్.. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ముంబైలో అంగరంగ వైభవంగా సాగిన 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వివరాలిలా ఉన్నాయి... ఉత్తమ చిత్రం : క్వీన్ ఉత్తమ దర్శకుడు : వికాస్ భాల్ (క్వీన్) ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (హైదర్) ఉత్తమ నటి : కంగనా రనౌత్ (క్వీన్) ఉత్తమ సంగీతం : శంకర్-ఏషాన్-లాయ్ (2 స్టేట్స్) ఉత్తమ నేపథ్య సంగీతం : అమిత్ త్రివేది (క్వీన్) ఉత్తమ సినిమాటోగ్రఫీ : బాబీ సింగ్, సిద్ధార్థ్ దివన్ (క్వీన్) ఉత్తమ ఎడిటింగ్ : అభిజిత్ కొకాటే, అనురాగ్ కష్యప్ (క్వీన్) ఉత్తమ సంభాషణలు, ఉత్తమ స్క్రీన్‌ప్లే : అభిజిత్ జోషీ, రాజ్‌కుమార్ హిరాణీ (పీకే) ఉత్తమ కథ : రజత్ కపూర్ (ఆంఖో దేఖీ) -
ఆ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలి: సీఎం
అద్భుతమైన ఫిక్షన్ వార్త రాసినందుకు ఓ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. విశాల్ భరద్వాజ్ తీసిన 'హైదర్' సినిమాపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఫిర్యాదు చేశానంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అసలు తాను ఇంతవరకు ఆ సినిమాయే చూడలేదన్నారు. ఆ సినిమాలో కాశ్మీర్‌ను చెడ్డగా చూపించారంటూ తాను విశాల్ భరద్వాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాలన్నీ గాలివార్తలేనని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఇంత అద్భుతమైన ఫిక్షన్ చేసినందుకు ఆ వెబ్‌సైట్‌కు అవార్డు ఇవ్వాలి' అని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే ఆ కథనానికి సవరణ వేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అసలు తాను సినిమా చూసినట్లు, ఫిర్యాదు చేసినట్లు వాళ్లు ఎక్కడ విన్నారో తనకు తెలియదని, వాళ్ల నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నానని కూడా అన్నారు. అలనాటి హేమ్లెట్ నాటకం స్ఫూర్తితో విశాల్ భరద్వాజ్ తన 'హైదర్' చిత్రం ద్వారా కాశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలను చూపించారు. దీనికి కాశ్మీరీ రచయిత బషరత్ పీర్ కథా సహకారం అందించారు. (ఇంగ్లీషు కథనం) So this website has to be awarded for the most amazing work of fiction I've seen in a very long time. http://t.co/ZxflGLHBiD 1/n — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 Lets be very clear I haven't seen Haider, I don't know when & even if I'll get down to seeing it much less writing to Vishal about it 2/n — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 So where oneindia.in heard that I'd seen the movie & proceeded to complain to Vishal about it I'll never know. I expect a retraction 3/3 — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 -
హైదర్ ను బహిష్కరించాలా? నిషేధించాలా?
ప్రముఖ రచయిత షేక్ స్పియర్ నవల 'హ్యామ్లెట్' ఆధారంగా రూపొందించిన 'హైదర్' చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. 'హైదర్' పాత్రలో కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ టెర్రిరిజం నేపథ్యంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన హైదర్ చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ, బహిష్కరించాలంటూ సంప్రదాయవాదులు పిలుపినిస్తున్నారు. హైదర్ చిత్రం పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా ఉంది. భారతీయ సైన్యాన్ని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధం విధించాలంటూ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. -
చాక్లెట్ బాయ్‌ని డిఫరెంట్‌గా చేసిన విశాల్
-
కెరీర్లో కొత్త అధ్యాయం
‘హైదర్’ ’సినిమాతో తన నవజాత కెరీర్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమర్శకుల మెప్పుపొందిన దర్శకుల్లో ఒకరైన విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఆషిఖి-2’, ‘ఏక్ విలన్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ ఈ రెండు ప్రేక్షకుల మెప్పు పొందడంపట్ల సంతోషం వ్యక్త ం చేసింది.‘హైదర్’ కూడా హిట్ సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆశిస్తోంది. ‘ఈ సిని మా నా కెరీర్‌కు కచ్చితంగా మరో శుభసూచిక అవుతుంది.నా కెరీర్లో ఇది కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’ అని అంది. ‘విశాల్... ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమా లు బాగా ఆడాయి. అందువల్ల ఇప్పుడు కూడా అటువంటిదే మరోసారి జరుగుతుందని భావిస్తున్నా’ అంది. షేక్స్పియర్ రచించిన ఓ విషాద నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రద్ధతోపాటు షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ పాత్ర పేరు హైదర్. ‘ఈ సినిమాలో నా పాత్ర అత్యంత క్లిష్టమైనది. సవాళ్లతో కూడుకున్నది. అయినప్పటికీ దర్శకుడి చొరవ కారణంగా తేలికగా చేయగలిగాను. ఇది నా ఐదో సినిమా. ఈ సినిమాలో ప్రేమికురాలిగానే కాకుండా మంచి స్నేహితురాలిగా కూడా కనిపిస్తా. ఆయన అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు’ అని అంది. కాశ్మీర్లో ఈ సినిమా షూటింగ్ అత్యంత క్లిష్టంగా సాగిం దంది. ‘అత్యంత శీతల వాతావరణం, ప్రతి క్షణ మూ ఆస్వాదించగలిగిందిగా ఉంటుంది. అయి తే చలి విపరీతంగా ఉండడం వల్ల షూటి ంగ్‌లో పాల్గొనడం బాగా కష్టంగా ఉంటుంది. ’అని అంది. -
ఆ సినిమాతో సరికొత్త అధ్యాయం
బెంగళూర్: ‘హైదర్’ ’సినిమాతో తన కెరీర్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమర్శకుల మెప్పుపొందిన దర్శకుల్లో ఒకరైన విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఆషిఖి-2’, ‘ఏక్ విలన్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ ఈ రెండు ప్రేక్షకుల మెప్పు పొందడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది.‘హైదర్’ కూడా హిట్ సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆశిస్తోంది. ‘ఈ సినిమా నా కెరీర్‌కు కచ్చితంగా మరో శుభసూచిక అవుతుంది.నా కెరీర్లో ఇది కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’ అని అంది. ‘విశాల్... ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాల్లో ప్రముఖ తారల అభిన యం ఎన్నటికీ మరువలేనిది. ఇప్పుడు కూడా అటువంటిదే మరోసారి జరుగుతుందని భావిస్తున్నా’ అంది. షేక్స్పియర్ రచించిన ఓ విషాద నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. -
జీవితాన్ని మార్చేసే సినిమా
విశాల్ భరద్వాజ్ సారథ్యంలో రూపొందుతున్న ‘హైదర్’ సినిమా తన జీవితాన్ని మార్చేస్తుందనే భావన కలుగుతోందని బాలీవుడ్ న టి శ్రద్ధాకపూర్ పేర్కొంది. విలియం షేక్స్పియర్ రచించిన ఓ నాటికను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారు. ‘ఓ విభిన్నమైన సినిమా ప్రపంచంలో ఉన్నట్టుగా తొలి సారి అనిపించింది. నన్ను నేను చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. వాస్తవానికి ప్రేక్షకులు కూడా వైవిధ్యాన్ని కోరుకుంటారు. పలు రకాల పాత్రల్లో చూడాలని ఆకాంక్షిస్తారు. ఈ సినిమాలో చేసే అవకాశం లభించడమే ఓ గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. జీవితం మారిపోవచ్చనే భావన కలుగుతోంది’ అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధ.. తన మనసులోని భావాలను వెల్లడించింది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌తోపాటు టబు, ఇర్ఫాన్‌ఖాన్, కేకే మీనన్, షాహిద్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ‘షాహిద్‌కపూర్ నటన అద్భుతం. అటువంటి నటులతో కలసి పనిచేయడం అసాధారణమనిపిస్తోంది’ అని తెలిపింది. ఈ సినిమా కోసం కాశ్మీర్లో సెట్టింగ్ వేశారు. అక్కడ చాలారోజులుగా జరుగుతున్న షూటింగ్లో శ్రద్ధాకపూర్ పాల్గొం టోంది. ‘షూటింగ్‌కు నాలుగురోజుల ముందే కాశ్మీర్‌కు వెళ్లా. కాశ్మీరీ యాస, భాషను అర్థం చేసుకోవడం కోసం, అనుకరించడం కోసమే ముందుగా వెళ్లా. అవసరం లేకపోయినా గొప్ప గొప్ప నటులు షూటింగ్లో పాల్గొంటుండడంతో సెట్స్ వద్దకు వెళుతుండేదాన్ని’ అని అంది. కాగా ‘హైదర్’ సినిమా ట్రయలర్స్కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా బాగా ఆడుతుందని శ్రద్ధాకపూర్ భావిస్తోంది. -
ఆ రెండు విభిన్నమైన సినిమాలు
అక్టోబర్ రెండో తేదీన విడుదల కానున్న ‘హైదర్’, బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలు విభిన్నమైనవని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ రెండు బాగానే ఆడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయంటూ హృతిక్‌కి గుడ్‌లక్ చెప్పాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా ప్రోమో చూశాను. అది ఎంతో బాగుంది. నేను కచ్చితంగా థియేటర్‌కి వెళ్లి ఆ సినిమా కూడా చూస్తా’ అని అన్నాడు. ఈ రెండు పెద్దసినిమాలేనని, ఒకేరోజు విడుదల అవనున్నప్పటికీ ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నాడు. ‘హైదర్’ సినిమాపై ఎంతో విశ్వాసంతో ఉన్నానని, ఇది భారీ బడ్జెట్ సినిమా కాదని, అందువల్ల పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని అన్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నందువల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురికావాల్సిన అవసరమేమీ లేదన్నాడు. విభిన్నమైన సినిమాని చూడాలంటే ‘హైదర్’కు వెళ్లాలని సూచించాడు. వినోదాత్మక సినిమా కావాలనుకుంటే ‘బ్యాంగ్ బ్యాంగ్’కు వెళ్లొచ్చన్నాడు. ఈ రెండు ఒకే రకమైన సినిమాలైతే ప్రేక్షకులు ఇబ్బందిగా భావించొచ్చని, అయితే విభిన్నమైనవి అయినందువల్ల వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదన్నాడు. కాగా ‘హైదర్’లో షాహిద్ హీరో కాగా, ‘బ్యాంగ్ బ్యాంగ్’ కథానాయకుడు హృతిక్ రోషన్. హైదర్ సినిమాకి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో షాహిద్‌తోపాటు టబు, ఇర్ఫాన్‌ఖాన్, కేకే మీనన్, శ్రద్ధాకపూర్‌లు నటిస్తున్నారు. ఇక బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు సిద్ధార్థ్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, కథానాయికగా కత్రినా కైఫ్ నటిస్తోంది. -
‘హైదర్’ బాగా భయపెట్టాడు
షాహిద్, విశాల్ భరద్వాజ్ మరోసారి జోడీ కట్టారు. గతంలో విశాల్ తీసిన కమీనేలో షాహిద్ హీరోగా నటించడం తెలిసిందే. ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ రాసిన హామ్లెట్ ఆధారంగా ఇతడు రూపొందించిన హైదర్లోనూ మనోడే హీరో. ఇందులో నటించేటప్పుడు ఎంతో భయంగా, కంగారుగా అనిపించిందని షాహిద్ చెప్పాడు. షేక్స్పియర్ మూడు విషాదాంతాలు మాక్బెత్ (మక్బూల్), ఒథెల్లో (ఓంకార), హామ్లెట్ (హైదర్)ను విశాల్ సినిమాలుగా మలిచాడు. ‘నా కెరీర్లో అన్నింటికంటే గొప్పపాత్ర కమీనే సినిమాలోనిది. మళ్లీ విశాల్‌తో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. హామ్లెట్ వంటి కథలతో తీసే సినిమాల్లో నటించే అవకాశం అతికొద్ది మందికే వస్తుంది. ఇలాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇంకా సాధించాల్సింది చాలా ఉందనిపిస్తుంది. షూటింగ్ సమయంలో భయం వేసినప్పుడల్లా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి ధైర్యం తెచ్చుకునేవాడిని. ‘బాగా చేశానా ?’ అంటూ విశాల్‌తోపాటు ఇతరులనూ అడిగేవాణ్ని’ ఈ సినిమా ట్రయలర్ విడుదల సందర్భంగా మీడియాకు షాహిద్ వివరించాడు. హైదర్ అక్టోబర్ రెండున థియేటర్లకు వస్తున్నాడు. తరువాత విశాల్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని అనుకోలేదని చెప్పాడు. హామ్లెట్‌కు క థ నేపథ్యంగా బాగా నప్పుతుందని చిత్రీకరణకు కాశ్మీర్‌ను ఎంచుకున్నామని, ఇది కుటుంబ కథాచిత్రమని తెలిపాడు. కమీనే వంటి యాక్షన్ సినిమాలు తీసిన విశాల్.. మక్డీ, ది బ్లూ అంబ్రెల్లా వంటి చక్కని బాలల చిత్రాలూ రూపొందించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ‘నాకు అన్ని రకాల కథలూ ఇష్టమే. మానవ సంఘర్షణపై ఎక్కువ ఆసక్తి’ అని విశాల్ వివరించాడు. టబూ, కేకే మీనన్, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. -
వివాదాస్పదమైన పాత్రలో...
నటనను అమితంగా ఆరాధించే నటి టబు. కెరీర్‌కి ఇబ్బంది అనుకున్నారో ఏమో... 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసు ఎత్తరామె. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలే ఓ వివాదాస్పదమైన పాత్రకు పచ్చజెండా ఊపారు టబు. సినిమా పేరు ‘హైదర్’. విశాల్ భరద్వాజ్ దర్శకుడు. షాహిద్ కపూర్ కథానాయకుడు. కథ రీత్యా ఇందులో షాహిద్ తల్లి పాత్ర చనిపోతుంది. దాంతో అతని తండ్రి టబుని రెండో వివాహం చేసుకుంటాడు. అలా షాహిద్ పిన్నిగా ఇంట్లోకి అడుగుపెట్టిన టబు.. కొడుకు వరుసయ్యే షాహిద్‌పై మనసు పారేసుకుంటుంది. ఈ పాత్ర తీరు తెన్నులు విశాల్ చెప్పగానే... మరో ఆలోచన లేకుండా అంగీకారం తెలిపారట టబు. ‘‘ఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం అవసరం. అందుకే సవాలుగా తీసుకొని ఈ పాత్ర చేస్తున్నా. ఇందులో గ్లామర్‌గా కనిపిస్తా. అదే సమయంలో అభినయానికి అద్భుతమైన అవకాశం ఉన్న పాత్ర. తప్పకుండా నా కెరీర్లో గుర్తుండి పోయే సినిమా అవుతుంది’’ అని చెప్పారు టబు. అయితే... టబు ఈ పాత్రకు ‘ఓకే’ చెప్పగానే... పలు విమర్శలు కూడా ఆమెను చుట్టుముట్టడం గమనార్హం. -
చలి కాచుకుందామని వెళ్లి...!
‘సినిమావాళ్లు సుకుమారంగా ఉంటారు. కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. నిరంతరం లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంటారు’... చాలామంది అభిప్రాయం ఇదే. కానీ.. వారి జీవితం సుఖాలకు ఆలవాలం ఎంతమాత్రం కాదని, వారిక్కూడా లెక్కలేనన్ని కష్టాలుంటాయని, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంటుందని బయటి వారికి తెలీదు. షూటింగుల్లో గాయాలపాలై చావు దరిదాపుల్లోకెళ్లి వచ్చిన కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టబు కూడా చేరారు. వివరాల్లోకెళితే... ప్రస్తుతం టబు ‘హైదర్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్‌లోని ఓ భయంకరమైన కొండ ప్రాంతంలో జరుగుతోంది. శనివారం తెల్లారు జామున మైనస్ డిగ్రీల చలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విశాల్భరద్వాజ్. షాట్ గ్యాప్‌లో ఓ పక్కకెళ్లి కూర్చున్నారు టబు. ఉన్నట్లుండి చలి తీవ్రత ఎక్కువైంది. దాంతో పక్కనే ఏర్పాటు చేసిన చలిమంటను ఆశ్రయించారు. ఆ మంటలోంచి పొగరావడం మొదలైంది. ఆ పొగను పీల్చి ఉక్కిబిక్కిరైపోయారు టబు. ఒకానొక దశలో శ్వాస సరిగ్గా అందలేదు. అక్కడిక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు. అయితే.. హాస్పిటల్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఉదయం 9 గంటలకల్లా టబుని హాస్పిటల్లో చేర్చారు. సమయానికి హాస్పిటల్‌కి చేర్చడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. చికిత్స పూర్తి చేసి, ఆ రోజు సాయంత్రం టబుని డిశ్చార్చ్ చేశారు. దీన్ని బట్టి సినిమా వాళ్ల కష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.