
పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్ ప్రతిరోజూ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తుంటుంది.
ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది.
సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్‌కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది.
సచిన్, సీమా హైదర్‌లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్‌ల వీడియో వైరల్‌గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది.
తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీమా హైదర్ ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment