అయోధ్యకు సీమా హైదర్‌ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన! | Seema Haider Will Visit Ayodhya for Ramlala Darshan | Sakshi
Sakshi News home page

Seema Haider: అయోధ్యకు సీమా హైదర్‌ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన!

Published Thu, Feb 15 2024 1:04 PM | Last Updated on Thu, Feb 15 2024 1:09 PM

Seema Haider Will Visit Ayodhya for Ramlala Darshan - Sakshi

అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు సీమా హైదర్  పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి నుంచి  అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది.

సీమా హైదర్‌  తాను కృష్ణ భక్తురాలిని చెప్పుకుంటుంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అమె వెల్లడించింది. 

సోషల్ మీడియాలో సీమాహైదర్‌కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్‌తో కలిసి ఉంటోంది. కాలినడకన  అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్‌ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్‌ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

కుటుంబ సభ్యులందరితో కలిసి రామ్‌లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సీమా మీడియాకు తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement