హైదర్ ను బహిష్కరించాలా? నిషేధించాలా?
హైదర్ ను బహిష్కరించాలా? నిషేధించాలా?
Published Wed, Oct 8 2014 3:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ప్రముఖ రచయిత షేక్ స్పియర్ నవల 'హ్యామ్లెట్' ఆధారంగా రూపొందించిన 'హైదర్' చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. 'హైదర్' పాత్రలో కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ టెర్రిరిజం నేపథ్యంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన హైదర్ చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ, బహిష్కరించాలంటూ సంప్రదాయవాదులు పిలుపినిస్తున్నారు. హైదర్ చిత్రం పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా ఉంది. భారతీయ సైన్యాన్ని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధం విధించాలంటూ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
Advertisement