అక్టోబర్ రెండో తేదీన విడుదల కానున్న ‘హైదర్’, బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలు విభిన్నమైనవని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ రెండు బాగానే ఆడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయంటూ హృతిక్‌కి గుడ్‌లక్ చెప్పాడు. ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా ప్రోమో చూశాను. అది ఎంతో బాగుంది. నేను కచ్చితంగా థియేటర్‌కి వెళ్లి ఆ సినిమా కూడా చూస్తా’ అని అన్నాడు.
ఈ రెండు పెద్దసినిమాలేనని, ఒకేరోజు విడుదల అవనున్నప్పటికీ ఎటువంటి ఇబ్బందీ లేదని అన్నాడు. ‘హైదర్’ సినిమాపై ఎంతో విశ్వాసంతో ఉన్నానని, ఇది భారీ బడ్జెట్ సినిమా కాదని, అందువల్ల పెద్దగా నష్టపోయేదేమీ ఉండదని అన్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నందువల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురికావాల్సిన అవసరమేమీ లేదన్నాడు. విభిన్నమైన సినిమాని చూడాలంటే ‘హైదర్’కు వెళ్లాలని సూచించాడు.
వినోదాత్మక సినిమా కావాలనుకుంటే ‘బ్యాంగ్ బ్యాంగ్’కు వెళ్లొచ్చన్నాడు. ఈ రెండు ఒకే రకమైన సినిమాలైతే ప్రేక్షకులు ఇబ్బందిగా భావించొచ్చని, అయితే విభిన్నమైనవి అయినందువల్ల వారికి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదన్నాడు. కాగా ‘హైదర్’లో షాహిద్ హీరో కాగా, ‘బ్యాంగ్ బ్యాంగ్’ కథానాయకుడు హృతిక్ రోషన్. హైదర్ సినిమాకి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో షాహిద్‌తోపాటు టబు, ఇర్ఫాన్‌ఖాన్, కేకే మీనన్, శ్రద్ధాకపూర్‌లు నటిస్తున్నారు. ఇక బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు సిద్ధార్థ్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా, కథానాయికగా కత్రినా కైఫ్ నటిస్తోంది.
ఆ రెండు విభిన్నమైన సినిమాలు
Published Sun, Aug 17 2014 10:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement