
ప్రియుని కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రియుడు సచిన్ మీనా కూడా వార్తల్లో కనిపిస్తున్నాడు. పాకిస్తానీ భాబీగా పేరొందిన సీమా హైదర్, ఆమె భారతీయ భర్త సచిన్ మీనాల సరిహద్దు ప్రేమ కథ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సీమా, సచిన్‌లు పిల్లలతో పాటు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.
తాజాగా సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ సన్నిహితుడొకరు సీమా హైదర్ గురించి మీడియాకు పలు సంచలన విషయాలు తెలిపారు. ఈ వివరాలు అందించిన వ్యక్తికి సీమాహైదర్‌తోనూ పరిచయం ఉంది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సీమా హైదర్ తరచూ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్లేది. ఆమె కుటుంబ సభ్యులు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆమె మేనమామ గులాం అక్బర్ పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నాడు.
సీమా హైదర్ తన మామను కలవడానికి ఆర్మీ క్యాంపుకు ఒంటరిగా వెళ్లేది. అటువంటి సందర్భంలో చాలా రోజులు అక్కడే ఉండేది. సీమాకు కంప్యూటర్‌కు పరిజ్ఞానం ఉంది. దీంతో ఆమె ఆర్మీ క్యాంపులో గూఢచర్యానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఉండవచ్చని గులాం హైదర్ సన్నిహితుడు అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ వివరాలు వెల్లడించిన వ్యక్తి భారత్‌కు చెందిన గులాం హైదర్ లాయర్ మోమిమ్ మాలిక్‌తో టచ్‌లో ఉన్నాడని సమాచారం. కాగా ఈ ఇన్‌ఫార్మర్ ఎవరనే విషయాన్ని మోమిమ్ వెల్లడించనప్పటికీ ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ తన వద్ద ఉందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.
సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ తన పిల్లలను తన దగ్గరకు తెచ్చుకునేందుకు సీమాపై కేసు పెట్టారు. సచిన్‌తో సీమా వివాహం చట్టవిరుద్ధమని, వారి పిల్లలపై సీమాకు ఎలాంటి హక్కు లేదని గులాం తరపు న్యాయవాది మోమిమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment