Jharkhand Love Story: Polish Woman Reached Jharkhand Across Seven Seas Crowd Of People At Lover House - Sakshi
Sakshi News home page

భర్తతో విడాకులు, ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా..

Published Wed, Jul 19 2023 3:15 PM | Last Updated on Wed, Jul 19 2023 7:07 PM

Polish Woman Reached Jharkhand Like Seema Haider From Pakistan - Sakshi

రాంచీ: పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా బాటలోనే పోలాండ్‌కు చెందిన ఓ మహిళ కూడా తన ప్రియుని కోసం జార్ఖండ్‌కు వచ్చింది. హజారీబాగ్ జిల్లాలోని కటకంసంది మండలం ఖుత్రా గ్రామానికి చేరుకుని ప్రియుడు షాబాద్‌ మాలిక్‌ను కలుసుకుంది. ఐదేళ్ల కూతురుతో కలిసి 45 ఏళ్ల విదేశీ మహిళ చేరుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. 

ఆమె పేరు బార్బరా పొలాక్‌ (45) పొలాండ్‌కు చెందిన మహిళ. తమ భర్తతో విడాకులు తీసుకుంది. అక్కడ సొంతంగా ఓ కంపెనీలో 50 శాతం షేర్‌తో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు షాబాద్ మాలిక్‌(27). వారిమధ్య కొన్నాళ్ల పరిచయం కాస్త ప్రేమగా పరిణమించింది. అనంతరం ఇరువురూ ముంబయిలో పలుమార్లు కలుసుకున్నారు. ఇక షాబాద్‌ను కలవడానికి ఖుత్రా గ్రామానికి బార్బరా రావడం ఇదే మొదటిసారి. 

వీసా కారణాల వల్ల బార్బరా.. షాబాద్‌తో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక పూర్తి స్థాయిలో వీసా రావడంతో ఏకంగా ఖుత్రా గ్రామానికి చేరుకుంది. ఖుత్రా గ్రామానికి చేరుకున్న బార్బరా.. షాబాద్ ఇంట్లోనే పోలాండ్ వంటకాలను తయారు చేస్తోంది. ఇంట్లో ఏసీ పెట్టించింది. బార్బరా కూతురు అనియా పోలాక్‌.. షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. కాగా.. బార్బరా మొదటి భర్త విడాకుల అనంతరం న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. 

పోలాండ్ మహిళ గ్రామానికి వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఖుత్రా గ్రామానికి చేరుకున్నారు. బార్బరాకు 2028 వరకు వీసా ఉన్నట్లు స్థానికి డీఎస్‌పీ తెలిపారు. దర్యాప్తు ముగిసేవరకు హోటల్‌లో బస చేయాల్సిందిగా బార్బరాకు చెప్పారు. అయితే.. షాబాద్‌ను తనతోపాటే పోలాండ్‌కు తీసుకువెళతానని బార్బరా తెలిపారు. 
ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement