Polish Woman
-
పరిచయం కాస్త ప్రేమగా.. పలుమార్లు కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా..
రాంచీ: పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా బాటలోనే పోలాండ్‌కు చెందిన ఓ మహిళ కూడా తన ప్రియుని కోసం జార్ఖండ్‌కు వచ్చింది. హజారీబాగ్ జిల్లాలోని కటకంసంది మండలం ఖుత్రా గ్రామానికి చేరుకుని ప్రియుడు షాబాద్ మాలిక్‌ను కలుసుకుంది. ఐదేళ్ల కూతురుతో కలిసి 45 ఏళ్ల విదేశీ మహిళ చేరుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. ఆమె పేరు బార్బరా పొలాక్ (45) పొలాండ్‌కు చెందిన మహిళ. తమ భర్తతో విడాకులు తీసుకుంది. అక్కడ సొంతంగా ఓ కంపెనీలో 50 శాతం షేర్‌తో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు షాబాద్ మాలిక్(27). వారిమధ్య కొన్నాళ్ల పరిచయం కాస్త ప్రేమగా పరిణమించింది. అనంతరం ఇరువురూ ముంబయిలో పలుమార్లు కలుసుకున్నారు. ఇక షాబాద్‌ను కలవడానికి ఖుత్రా గ్రామానికి బార్బరా రావడం ఇదే మొదటిసారి. వీసా కారణాల వల్ల బార్బరా.. షాబాద్‌తో ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఇక పూర్తి స్థాయిలో వీసా రావడంతో ఏకంగా ఖుత్రా గ్రామానికి చేరుకుంది. ఖుత్రా గ్రామానికి చేరుకున్న బార్బరా.. షాబాద్ ఇంట్లోనే పోలాండ్ వంటకాలను తయారు చేస్తోంది. ఇంట్లో ఏసీ పెట్టించింది. బార్బరా కూతురు అనియా పోలాక్.. షాబాద్‌ను డాడీ అని పిలుస్తోంది. కాగా.. బార్బరా మొదటి భర్త విడాకుల అనంతరం న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. పోలాండ్ మహిళ గ్రామానికి వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఖుత్రా గ్రామానికి చేరుకున్నారు. బార్బరాకు 2028 వరకు వీసా ఉన్నట్లు స్థానికి డీఎస్పీ తెలిపారు. దర్యాప్తు ముగిసేవరకు హోటల్లో బస చేయాల్సిందిగా బార్బరాకు చెప్పారు. అయితే.. షాబాద్‌ను తనతోపాటే పోలాండ్‌కు తీసుకువెళతానని బార్బరా తెలిపారు. ఇదీ చదవండి: Pakistan PUBG Love Story Case: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! -
బాయ్ ఫ్రెండ్ పై యువతి ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన తన బాయ్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అత్యాచారం చేశాడని పోలండ్ దేశానికి చెందిన ఓ యువతి(31) వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేటు ముందు వినిపించింది. నిందితుడిని 2014లో ఒక ఓడలో కలుసుకున్నానని, ఇద్దరం కలసి పనిచేస్తున్న క్రమంలో స్నేహితులమయ్యామని పేర్కొంది. అనంతరం వారి దేశాలకు తిరిగి వెళ్లిపోయాక కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో అతడు ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తన ఆమోదం తెలిపింది. అనంతరం ఆమె 2015లో భారతదేశాన్ని సందర్శించింది. అప్పుడు ఆమె వద్ద నుంచి నిందితుడు కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా కూడా లోబరుచుకున్నాడు. అతడు తన కుటుంబసభ్యులను తరచుగా పరిచయం చేస్తూ ఉండటం ద్వారా ఆమె నమ్మకాన్ని పొందాడు. ఆమె భారతదేశం నుంచి వెళ్లిన అనంతరం తనతో మాట్లాడటం పూర్తిగా తగ్గించేశాడని బాధితురాలు తెలిపింది. నిందితుడికి అంతకుముందే ఓ ప్రియురాలు కూడా ఉందని, ఆమెను తనకు బంధువుగా పరిచయం చేశాడని కూడాపోలండ్ యువతి తెలిపింది.