బాయ్‌ ఫ్రెండ్‌ పై యువతి ఫిర్యాదు | Polish Woman Alleges Rape By Indian Boyfriend | Sakshi
Sakshi News home page

బాయ్‌ ఫ్రెండ్‌ పై యువతి ఫిర్యాదు

Published Wed, Feb 15 2017 4:37 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

బాయ్‌ ఫ్రెండ్‌ పై యువతి ఫిర్యాదు - Sakshi

బాయ్‌ ఫ్రెండ్‌ పై యువతి ఫిర్యాదు

న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అత్యాచారం చేశాడని పోలండ్‌ దేశానికి చెందిన ఓ యువతి(31) వసంత్‌ కుంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేటు ముందు వినిపించింది. నిందితుడిని 2014లో ఒక ఓడలో కలుసుకున్నానని, ఇద్దరం కలసి పనిచేస్తున్న క్రమంలో స్నేహితులమయ్యామని పేర్కొంది. అనంతరం వారి దేశాలకు తిరిగి వెళ్లిపోయాక కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ మాట్లాడుకుంటూనే ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో అతడు ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తన ఆమోదం తెలిపింది.

అనంతరం ఆమె 2015లో భారతదేశాన్ని సందర్శించింది. అప్పుడు ఆమె వద్ద నుంచి నిందితుడు కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా కూడా లోబరుచుకున్నాడు. అతడు తన కుటుంబసభ్యులను తరచుగా పరిచయం చేస్తూ ఉండటం ద్వారా ఆమె నమ్మకాన్ని పొందాడు. ఆమె భారతదేశం నుంచి వెళ్లిన అనంతరం తనతో మాట్లాడటం పూర్తిగా తగ్గించేశాడని బాధితురాలు తెలిపింది. నిందితుడికి అంతకుముందే ఓ ప్రియురాలు కూడా ఉందని, ఆమెను తనకు బంధువుగా పరిచయం చేశాడని కూడాపోలండ్‌ యువతి తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement