‘హైదర్’ ’సినిమాతో తన నవజాత కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందని బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమర్శకుల మెప్పుపొందిన దర్శకుల్లో ఒకరైన విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఆషిఖి-2’, ‘ఏక్ విలన్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ ఈ రెండు ప్రేక్షకుల మెప్పు పొందడంపట్ల సంతోషం వ్యక్త ం చేసింది.‘హైదర్’ కూడా హిట్ సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆశిస్తోంది. ‘ఈ సిని మా నా కెరీర్‌కు కచ్చితంగా మరో శుభసూచిక అవుతుంది.నా కెరీర్‌లో ఇది కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’ అని అంది. ‘విశాల్... ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమా లు బాగా ఆడాయి. అందువల్ల ఇప్పుడు కూడా అటువంటిదే మరోసారి జరుగుతుందని భావిస్తున్నా’ అంది.
షేక్‌స్పియర్ రచించిన ఓ విషాద నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రద్ధతోపాటు షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ పాత్ర పేరు హైదర్. ‘ఈ సినిమాలో నా పాత్ర అత్యంత క్లిష్టమైనది. సవాళ్లతో కూడుకున్నది. అయినప్పటికీ దర్శకుడి చొరవ కారణంగా తేలికగా చేయగలిగాను. ఇది నా ఐదో సినిమా. ఈ సినిమాలో ప్రేమికురాలిగానే కాకుండా మంచి స్నేహితురాలిగా కూడా కనిపిస్తా. ఆయన అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎంతో ఆప్యాయంగా ఉంటారు’ అని అంది. కాశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్ అత్యంత క్లిష్టంగా సాగిం దంది. ‘అత్యంత శీతల వాతావరణం, ప్రతి క్షణ మూ ఆస్వాదించగలిగిందిగా ఉంటుంది. అయి తే చలి విపరీతంగా ఉండడం వల్ల షూటి ంగ్‌లో పాల్గొనడం బాగా కష్టంగా ఉంటుంది. ’అని అంది.
కెరీర్‌లో కొత్త అధ్యాయం
Published Sat, Sep 27 2014 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement
Advertisement