వంద శాతం పోలింగ్‌కు కృషి చేయాలి  | KTR reference to the press | Sakshi
Sakshi News home page

వంద శాతం పోలింగ్‌కు కృషి చేయాలి 

Published Mon, Oct 15 2018 2:37 AM | Last Updated on Mon, Oct 15 2018 2:37 AM

KTR reference to the press - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కల్పించి వంద శాతం పోలింగ్‌ జరిగేలా పత్రికలు కృషి చేయాలని మంత్రి కె.తారకరామారావు సూచించారు. ఆదివారం బేగంపేట క్యాంప్‌ కార్యాలయంలో ‘ముద్ర’ దిన పత్రికను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో  నెలకొన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి, సమస్యల్ని వెలుగులోకి తెచ్చినప్పుడే పత్రికలకు సార్థకత చేకూరుతుందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంపాదకుడు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖరరెడ్డి, శ్రీనివాసగౌడ్, ఆప్కాబ్‌ చైర్మన్‌ కె.రవీందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement