ఏ పదవి ఆశించి పార్టీ మారడం లేదని కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తన అభిలాష అని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాష్ట్ర సాధనలో ఎక్కువ కృషి కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.
Published Thu, Jul 2 2015 1:19 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement