గాంధీభవన్‌లో ఉద్రిక్తత | there was tension at gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో ఉద్రిక్తత

Published Mon, Oct 30 2023 4:02 AM | Last Updated on Mon, Oct 30 2023 4:02 AM

there was tension at gandhi bhavan - Sakshi

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటున్న వ్యక్తిని అడ్డుకుంటున్న కార్యకర్తలు

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్‌ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్‌ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు.

బచావో కాంగ్రెస్‌ హటావో పారాచూట్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement