సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల మైనర్ బాలికను దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన సంఘటన నగర శివారు గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు చిన్నారిని అపహరించి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడు ఎత్తుకెళ్లడానికి ముందే సదరు బాలిక (6) అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు మద్యం సేవించినట్టు పోలీసులు చెప్పారు.
హత్యకు గురైన చిన్నారిది హైదరాబాద్ సమీపంలోని తుర్కపల్లి గ్రామం. తండ్రి రోజువారీ కూలీ. గురువారం స్వగ్రామంలో హోలీ ఆడుతున్న చిన్నారిని నిందితుడు ఎత్తుకెళ్లగా.. బాలిక మాయమైనట్టు గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే దగ్గరలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ శివార్లలో చనిపోయి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు అతడిది బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాగా నిర్ధారించారు. నిందితుడిపై ఐపీసీలోని పోక్సో సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబరాబాద్ పోలీసులు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment