చింతపల్లి: ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. దేవరకొండ నుంచి ఆర్టీసీ బస్సులో నల్లగొండ వైపు వెళ్తోంది. ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను, బస్సు ఢీ కొన్నాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డీసీఎం వ్యాను డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.