chinthapalli
-
అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
సాక్షి,విశాఖపట్నం: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి వందేళ్లు పూర్తైన సందర్భంగా అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించారు. ఆదివారం విశాఖపట్నం పోస్టుమాష్టరు జనరల్ కార్యలాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోస్టుమాష్టరు జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చదవండి:జగనన్న కాలనీ పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
చింతపల్లిలో రోడ్డు ప్రమాదం ఐదుగురు సజీవదహనం
-
చింతపల్లిలో ఐదుగురు సజీవదహనం
చింతపల్లి: విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలో దారుణం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వస్తోన్న ఓ ఆటో చెరువూరు గ్రామంలో ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాణికులు చింతపల్లి సంతకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు గిన్నెల కోట, చెరువూరు గ్రామాలకు చెందిన చిట్టిబాబు, గంగరాజు, బొంజి బాబు, కృష్ణారావు, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో జానుబాబు, దావీదు, వివేక్ అనే చిన్నారులతో పాటు చిన్నబ్బాయి, రామ్మూర్తి, వరలక్ష్మీలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చింతపల్లి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు. విద్యుత్ వైర్లు తెగిపడి మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : చింతపల్లిలో రోడ్డు ప్రమాదం ఐదుగురు సజీవదహనం -
మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గడప దాటాలంటే వణుకు
సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీ నేతలందరిలోనూ ఒక్కటే భయం.. ఇళ్ల నుంచి బయటకు వెళితే ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన. మావోయిస్టులు ఇన్నాళ్లూ మన్యంలో ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఏజెన్సీ ప్రాంతంలోని నాయకుల్లోనే ఆందోళన రేకెత్తేది. ఈనెల 23న జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టిన నాటి నుంచి మైదాన ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మన్యంలో నేతలతో పాటు మైదానంలో ఉంటున్న ప్రజాప్రతినిధులు విశాఖ నగరంలోని సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని సూచించారు. కానీ పోలీసుల సూచనల మేరకు ఇప్పటిదాకా విశాఖలోకి అధికార పార్టీ ముఖ్య నేతలు రాలేదు. ఏజెన్సీలో ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను కల్పించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద మరో ఆరుగురు అదనపు సాయుధ పోలీసులను, మాజీ మంత్రి మణికుమారికి కూడా భద్రతను పెంచారు. బుధవారం గిడ్డి ఈశ్వరి ఇంటికి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ సంచరించి మాయమైనట్టు గుర్తించారు. ఆమె మావోయిస్టా? మిలీషియా సభ్యురాలా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ వ్యవహారం వెలుగు చూడడంతో అక్కడ ఏదైనా పథక రచనకు వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీలో మిగిలిన అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లను వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మావోయిస్టుల హిట్‌లిస్టులో దాదాపు 200 మంది వరకు చిన్నా, పెద్ద నాయకులున్నట్టు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల నాయకులు ఆడుగు బయట పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. కొద్దిమంది మాత్రం రహస్య ప్రదేశాలకు వెళ్లిపోయారు. మన్యంలో నిన్న మొన్నటి వరకు హడావుడి చేస్తూ కనిపించిన వారెవరూ ఇప్పుడు జనావాసాల్లో కనిపించడం లేదు. రోడ్లపై వారితో పాటు వారి వాహనాల జాడా లేకుండా పోయింది. ఏజెన్సీలో ఏ గ్రామంలో చూసినా బితుకుబితుకుమంటూ ఉన్న వారే కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో సాయుధులైన పోలీసు బలగాలు దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా పహరా కాస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పోలీసు దళాలు లేకపోయినా అక్కడ కూడా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు భయంతో వణుకుతున్నారు. నర్సీపట్నానికి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నారు. దీంతో ఆయన చాలా సంవత్సరాలుగా విశాఖలోనే కుటుంబంతో ఉంటున్నారు. ఆయనకు ప్రభుత్వం బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చింది. తాజాగా మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఆయన తన నియోజకవర్గానికి , మరో ప్రాంతంలో పర్యటనకు వెళ్లడం లేదు. మరోమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా కిడారి, సివేరిల హత్య అనంతరం భద్రతను పెంచారు. వీరు జిల్లాలో మరెక్కడా అధికార, అనధికార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో యలమంచిలి, పాయకరావుపేట ఎమ్మెల్యేలు విశాఖలోనే ఉంటున్నారు. చోడవరం, అనకాపల్లి శాసనసభ్యులు వారి గ్రామాల్లో మకాం ఉంటున్నారు. ఈ కిడారి, సివేరిల హత్య, పోలీసుల హెచ్చరికలు నేపథ్యంలో శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. మరోవైపు బుధవారం జిల్లాకు వచ్చిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం కూడా ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్‌కు వెళ్లి అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సెక్యూరిటీ ఆడిట్ రెవ్యూ నిర్వహించారు. ఆ డివిజన్లోని జీకేవీధి, అన్నవరం, సీలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఆయా స్టేషన్ల సీఐ, ఎస్ఐలతో భేటీ అయ్యారు. డీఐజీ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
చింతపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి నీటిసంపులో పడి మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియగౌరారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జక్కుల జంగయ్య, సరిత మూడవ కుమార్తె జక్కుల భవాని (3) గ్రామంలోని పాఠశాలలో యూకేజీ చదువుతోంది. గురువారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న సంపులో నీటిని బాటిల్‌తో ముంచేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఈ విషయాన్ని సరిత గమనించకపోవడంతో అక్కడికక్కడే మృతిచెంది నీటిపై తేలడంతో విషయం బయటపడింది. కొంత సేపటికి నీటిపై తేలుతున్న శవాన్ని చూసిన సరిత కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి భవానిని సంపులో నుంచి బయటకు తీశారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చింతపల్లి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఆనంద నిలయం హాస్టళ్లలో విద్యార్థులకు దుప్పట్లు, పెట్టెలు తదితర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నాగభూషణ్‌రావు, హాస్టల్ వార్డెన్లు బలరాం, శ్రీనివాస్, రుణాదేవి, మాజీ ఎంపీపీ బోరిగం భూపాల్, నాయకులు నట్వ గిరిధర్, ఎల్లెంకి అశోక్, చంద్రశేఖర్, బిచ్యానాయక్, కుకుడాల శేఖర్, సత్యనారాయణశర్మ, అక్రమ్యాదవ్, సలీం, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక ♦ తక్షణం జీవో 97 రద్దు చేయాలి ♦ గిరిజన సలహా మండలిని నియమించాలి ♦ బాక్సైట్‌ను అంగుళం కూడా కదలనివ్వం ♦ చంద్రబాబు మోసాలను సాగనివ్వం ♦ గిరిజనులకు అండగా ఉండి పోరాడతాం ♦ ప్రతిపక్షంలో ఉండగా ఓమాట.. ♦ సీఎం అయ్యాక మరోమాట గతంలో సీఎంగా ఉండగా దుబాయ్ కంపెనీతో బేరాలు ♦ బాబుకన్నా మోసగాడు దేశంలోనే లేడు ♦ గిరిజనుల మనోభావాలు గమనించి మైనింగ్ యత్నాలు ఆపేసిన వైఎస్ఆర్ ♦ వాస్తవాలను వక్రీకరిస్తూ బాబు శ్వేతపత్రం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు పూనుకుంటే ఊరుకునేది లేదని విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. బాక్సైట్ మైనింగ్‌పై ఇచ్చిన జీవో 97ను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గనులు తవ్వడానికి ప్రయత్నిస్తే ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి బాక్సైట్‌ను బైటకు పోనిచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, కలసికట్టుగా పోరాడతామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును మించిన మోసగాడు దేశంలోనే లేడని జగన్ విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో ‘విశాఖ బాక్సైట్ గిరిజనుల హక్కు’ అనే నినాదంతో గురువారం సదస్సును నిర్వహించింది. సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన జగన్ అనకాపల్లి, తంగేడుల మీదగా చింతపల్లి చేరుకున్నారు. అశేష గిరిజనులతో క్రిక్కిరిసిన ఈ సదస్సులో అల్లూరి సీతారామరాజు వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలన్న ప్రభుత్వ కుట్రను అడ్డుకుని తీరుతామన్నారు. బాక్సైట్ మైనింగ్ వద్దు అని లక్షల గొంతులు ఒక్కటై చెబుతున్నా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావడం లేదని విమర్శించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే.... ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట... సీఎం అయ్యాక మరో మాట చంద్రబాబు మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడే బాక్సైట్ మైనింగ్ కోసం ప్రయత్నించారు. మైనింగ్ చట్టాలు సవరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. తరువాత ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ మైనింగ్ జరగనివ్వనని మాటలు చెప్పారు. గ్రామసభలు కూడా జరగలేదు అని 2011లో గవర్నర్‌కు లేఖ రాశారు. అదే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో మాటమార్చేశారు. గ్రామసభలు జరిగాయట. బాక్సైట్ మైనింగ్ కావాలని జెర్రెల గ్రామసభ తీర్మానించిందని శ్వేతపత్రంలో చెప్పారు. ఇప్పుడు విజయకుమారమ్మ జెర్రెల సర్పంచ్‌గా ఉన్నారు. ఇప్పుడు విజయకుమారమ్మను అడుగుతున్నా... గతంలో బాక్సైట్ మైనింగ్ కోసం తీర్మానం చేశారా ( విజయకుమారమ్మ తమ గ్రామసభలో ఎలాంటి తీర్మానం చేయలేదని చెప్పారు. తాను రికార్డులు పరిశీలించానని తీర్మానం చేసినట్లు ఎక్కడా లేదని అన్నారు). గతంలో టీడీపీకి చెందిన వెంకటరమణ సర్పంచ్‌గా ఉండేవారు. ఆయన ప్రస్తుతం చింతపల్లి మార్కెట్‌కమిటీ డెరైక్టర్ కూడా. ఆయన కూడా బాక్సైట్ మైనింగ్ కోసం ఆనాడు గ్రామసభ తీర్మానం చేయలేదని చెబుతున్నారు. గ్రామసభలు జరిగి ఉంటే పుస్తకాల్లో రాసి ఉండాలి. కానీ ఆ పుస్తకాల్లో గ్రామసభలు జరిగినట్లు లేదని సర్పంచ్ చెబుతున్నారు. దుబాయోళ్లకు ఇచ్చేందుకు ఆనాడే బాబు కుట్ర చంద్రబాబు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్‌గనులను తవ్వడానికి ప్రయత్నించారు. అప్పట్లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకునేట్లు చేశారు. గనుల తవ్వకాలు జరపాలంటే రాష్ట్రప్రభుత్వానికి, గిరిజనులకు మాత్రమే హక్కు ఉందని యాక్ట్ చెబుతోంది. కానీ చంద్రబాబు 24-5-2000లో ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అందులోని తన ఎమ్మెల్యేల చేత బలవంతంగా ఓ తీర్మానం చేయించారు. గనులు గిరిజనులే కాదు.. ఎవ్వరైనా తవ్వుకోవచ్చనేదే ఆ తీర్మానం. అలా బాక్సైట్ గనులను దుబాయోళ్లకు ఇచ్చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అంతేకాదు మైనింగ్ చట్టాలను మార్చాలని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో వెనుకడుగు వేయబట్టి సరిపోయింది. ఆ తరువాత బాబు పాలన పోయింది కాబట్టి బాక్సైట్ మైనింగ్ జరగలేదు. గిరిజనుల మనోభావాలు గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం మైనింగ్ జరపడం వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. ఇక్కడ ఒక్కటి చెప్పాలి చంద్రబాబు చేసినా... రాజశేఖరరెడ్డి చేసినా జగన్మోహన్రెడ్డి చేసినా తప్పు తప్పే అవుతుంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడచుకోవాలి. ఆ రోజు వైఎస్సార్ కాస్తో కూ స్తో ముందుకు వెళ్లినా ప్రజల మనోభావాలు గుర్తించిన తరువాత బాక్సైట్ మైనింగ్ ఆపించేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాను చెప్పినట్లు చేస్తుందని తెలిసినా కూడా బాక్సైట్ గనుల సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ కోసం ప్రయత్నించ లేదు. గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఆయన బాక్సైట్ మైనింగ్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. వైఎ స్సార్ చేయాలనుకుని ఉంటే ఆ రోజే బాక్సైట్ మైనింగ్ జరి గేది. గిరిజనుల మనోభావాలను గౌరవించారు కాబట్టే ఆయన ముందడుగు వేయలేదు. అందుకే ఆయన హయాంలో బాక్సైట్ మైనింగ్ జరగలేదు. కేంద్రంపై ఒత్తిడిచేసి అనుమతి సాధించిన బాబు వైఎస్సార్ చనిపోయిన ఆరేళ్ల తరువాత చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇవాళ బాక్సైట్ మైనింగ్ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ గనులకు వ్యతిరేకంగా తానే పోరాటం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. 2011లో గిరిజన ప్రాంతానికి ‘జేసీ కాలా’ చైర్మన్‌గా నలుగురు సభ్యుల హైలెవెల్ కమిటీ వేసిన మాట వాస్తవం కాదా? అపుడు చంద్రబాబు గవర్నర్‌కు లేఖరాయడం నిజం కాదా? ఆ జేసీ కాలా కమిషన్ ఇక్కడకు వచ్చి నివేదిక ఇస్తే ఆ నివేదికను కేంద్రం పక్కన పెట్టింది. సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఇపుడు మళ్లీ బాక్సైట్ మైనింగ్ అంశాన్ని తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాలుగుసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. 10-5-2014, 23-02-15, 21-07-15, 5-8-15తేదీల్లో లేఖలు రాశారు. చంద్రబాబు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినందునే 17-8-15న కేంద్రప్రభుత్వం బాక్సైట్ మైనింగ్‌కు అనుమతి ఇచ్చింది. జీవో అబయన్స్‌లో పెట్టామంటూ మోసం బాక్సైట్ మైనింగ్ కోసం జీవో 97 జారీచేసింది చంద్రబాబే. గిరిజనులు ఆందోళనలు చేస్తుంటే తనకు తెలియకుండానే జీవో వచ్చిందని అంటారు. ఆ జీవోను పెండింగ్‌లో పెట్టాను, అబయన్స్‌లో పెట్టాను అంటారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా చేయాలంటే జీవో ఇస్తుంది. వద్దు అనుకుంటే ఆ జీవోను ఉపసంహరించుకుని రద్దు చేస్తుంది. కానీ ఇలా పెండింగ్‌లో పెట్టాను... అబయన్స్‌లో పెట్టాను అని ఏ ప్రభుత్వమూ చెప్పదు. అబద్దాలు మోసాలతో బతికే ఈ మనిషి చివరికి ఈ జీవో కూడా అబయన్స్‌లో పెట్టాను అని ప్రజలను మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ జీవోను ఉపసంహరించుకుని బాక్సైట్‌మైనింగ్‌ను రద్దు చేస్తున్నాను అని ఎందుకు చెప్పడం లేదు. చంద్రబాబు జీవితమంతా మోసం ‘చంద్రబాబు జీవితమంతా మోసం... మోసం ... మోసం అనే మూడు పదాల మీదే జరుగుతోంది. ఎన్నికల ముందుకు వెళితే... ఇంటికి వెళ్లి టీవీ ఆన్‌చేయగానే మనకు కనిపించిందేమిటి?... వినిపించిందేమిటి?... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నారా లేదా... డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని అన్నారా లేదా... జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారా లేదా... జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారా లేదా... తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే బాక్సైట్‌మైనింగ్‌ను తీసేస్తానని అన్నారా లేదా.... (సభకు హాజరైన వేలాదిమంది గిరిజనులు రెండు చేతులు ఎత్తి అవును అవును అని నినదించారు). చంద్రబాబు నాయుడు ఇంతవరకు చెప్పింది ఒక్కటైనా చేశారా? (గిరిజనులు అంతా లేదు లేదు అని గట్టిగా చెప్పారు). ఇంతకన్నా మోసగాడు దేశంలో ఎవరూ ఉండరు. డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాదైంది. తల్లిదండ్రులు తమ ఆస్తులు అమ్మి మరీ ఫీజులు కట్టారు. పిల్లలు నగరాలకు వచ్చి హాస్టళ్లలో ఉండి ట్యూషన్లు చదువుతూ పరీక్షలు రాశారు. కానీ ఏడాదైనా వారికి ఉద్యోగాలు ఇవ్వనేలేదు. సరికదా క్లస్టర్‌విధానమని ఉన్న స్కూళ్లను కూడా మూసివేస్తున్నారు. ఇప్పుడు 7వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నారని ఆ పోస్టులు తీసేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థుల తరపున గట్టిగా పోరాడతాం’. గిరిజన సలహా మండలిని ఎందుకు నియమించలేదు గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్) ఎందుకు వేయలేదని చంద్రబాబును నిలదీస్తున్నా. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5ఏ ప్రకారం గిరిజన సలహామండలి ఏర్పాటు చేయడం గిరిజనుల రాజ్యాంగ హక్కు. ఆ కౌన్సిల్లో మూడొంతుల మంది సభ్యులుగా గిరిజన ఎమ్మెల్యేలే ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో 7 గిరిజన శాసనసభ స్థానాలు ఉంటే అందులో ఆరింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. గిరిజన సలహా మండలి వేస్తే అందులో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉంటారు. బాక్సైట్ మైనింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తారు. అదే జరిగితే బాక్సైట్ గనులు తవ్వుకోవాలన్న బాబు కుట్ర సాగదు. కాబట్టే అసలు గిరిజన సలహామండలినే వేయకుండా చంద్రబాబు వాయిదా వేస్తున్నారు. అయితే అది ఎక్కువ రోజులు సాగదు. గట్టిగా ఒత్తిడి తెస్తాం.ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ వేయిస్తాం. అందులో బాక్సైట్ మైనింగ్‌ను గట్టిగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తాం. -
'బాక్సైట్ జోలికి వస్తే కత్తులు దూస్తాం'
-
'చంద్రబాబు కుటుంబం కూడా లబ్ధి పొందింది'
చింతపల్లి: ఆదివాసీలకు, గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఆదివాసీలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఊరుకోరని, ఆయన ఎప్పటికీ అండగా ప్రభుత్వ చర్యలు ఎండగడతారని అన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎంతో చేశారని, సమైక్య రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకమైన మేలు జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం కూడా వైఎస్ పాలన ద్వారా లబ్ధి పొందిందని అన్నారు. ఆదివాసీల, గిరిజనుల డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా దిశానిర్దేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తారని తెలిపారు. -
కాళ్లు, చేతులు కట్టేసి వ్యక్తి హత్య!
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని గమనించిన ప్రయాణీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతుడిని రాజోలు మండలం చింతపల్లికి చెందిన యనముల దుర్గాప్రసాద్ (30)గా గుర్తించారు. దుర్గాప్రసాద్ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గమనిస్తే ఇది హత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు వారు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
బైకు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
చింతపల్లి (నల్లగొండ): బైకు, ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్ వద్ద హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. హైదరాబాద్ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా.. చింతపల్లి వైపు నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆర్టీసీ బస్సు.. డీసీఎం వ్యాను ఢీ
చింతపల్లి: ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. దేవరకొండ నుంచి ఆర్టీసీ బస్సులో నల్లగొండ వైపు వెళ్తోంది. ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను, బస్సు ఢీ కొన్నాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డీసీఎం వ్యాను డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
లంబ సింగారం
నర్సీపట్నానికి 29 కి.మీ దూరంలో లంబసింగి ఉంది. విశాఖపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ప్రతి బస్సు ఈ గ్రామంలో ఆగుతుంది. గ్రామంలో ఫలహారశాలలున్నాయి. భోజన, బస వసతుల్లేవు. వేసవి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెం. ఆ ప్రాంతంలో మంచు జల్లేనా? వణికించే చలేనా? అంతకు మించి ఇంకేం లేవా? ఉన్నాయి... చాలా ఉన్నాయి... కరిగించే మంచు ఉంది... కదిలించే జీవితం ఉంది... మనసు పెట్టి చూస్తే మనోహరమైన అందా లున్నాయి. ఆసక్తి కలిగించే గిరిపుత్రుల జీవనం ఉంది... ఇవన్నీ చూడాలంటే... లంబసింగి ఆత్మను దర్శించుకోవాలి... కొండకోనల్లోకి ప్రయాణించాలి... పుట్టల్నీ, పిట్టల్నీ పలకరించాలి... ప్రకృతి మౌనంగా వినిపించే రాగాలను మనసారా వినాలి... ‘ఆ నలుగురూ’ అదే చేశారు... అద్భుత అనుభవాలను మూటగట్టుకున్నారు... మంచు పల్లకీలో ఊరేగుతూ లంబ‘సింగారాన్ని’ చూసి, మైమరచారు. ‘చలికాలం కరిగిపోతున్న ఓ ఉషోదయాన... సెల్ మోగింది... గిరిపుత్రుడు గాసి నాయుడు కాలింగ్... ‘మంచు తగ్గిపోతోంది సార్! లంబసింగి ఎప్పుడొస్తారు?’ అని పిలుపు. వెళ్లాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం. ఈసారి లంబసింగి చూడాలి. మంచుపూల వానలో ముద్దయిపోవాలి. పొగ మంచు దుప్పట్లో దూరిపోవాలి... అనుకుని ‘వచ్చేస్తా’నన్నా. ఎలాగైతేనేం ముహూర్తం ఖరారైంది. విశాఖ నుంచి నేను, సీనియర్ ఫొటోగ్రాఫర్, నేషనల్ హిమాలయన్ ట్రెక్కర్ సత్యనారాయణ, సీనియర్ నేషనల్ హిమాలయన్ ట్రెక్కర్ కృష్ణవేణి ప్రయాణానికి సిద్ధమయ్యాం. ఒకరోజు ఉదయాన్నే బయల్దేరాం. నర్సీపట్నం చేరుకుని, అక్కడ చింతపల్లి వెళ్లే బస్సు ఎక్కాం. ఘాట్ రోడ్డులో 29 కిలోమీటర్లు కొండలెక్కుతూ, భారంగా ప్రయాణం చేసి, మధ్యాహ్నం ఒంటిగంటకు లంబసింగి జంక్షన్ చేరాం. బస్సు చివరి మెట్టు దిగుతుండగానే జివ్వుమని కొండగాలి ముఖాన్ని ముద్దాడింది. ‘వెల్కమ్ సార్!’ అంటూ మా కోసం వచ్చిన గాసినాయుడు పలకరించి, ‘ముందు తాజంగి జలాశయం చూద్దాం సార్!’ అన్నాడు. ఆటోలో బయల్దేరాం. ఎండ కాస్తున్నా ‘పగలే వెన్నెల’ అన్నట్టుంది మాకు. సన్నని తారు రోడ్డుపై ఆటో దూసుకుపోతోంది. రోడ్డుకిరువైపులా విసిరేసినట్టున్న గిరిపుత్రుల ఇళ్లు, ఇళ్ల ముందు పందిళ్లు, విరగకాసిన గుమ్మడికాయలు, పొలాల్లో పసుపు దుంపల్ని పెకలిస్తున్న రైతులు... ఇవన్నీ చూస్తూ, రెండు కిలోమీటర్లు ప్రయాణించాక, కొండల మధ్య విశాలమైన తాజంగి జలాశయం కనిపించింది. సేదతీరి, మళ్లీ బయలుదేరి ఆరు కిలోమీటర్ల ప్రయాణించేసరికి, పడమటి సూరీడు కనుమరుగయ్యాడు. అందమైన ఆశ్రమంలో అద్భుత రాత్రి చీకటి పడుతుండగా ఎత్తయిన కొండలపై ఉన్న కిటుముల అనే ఓ గిరిజన కుగ్రామం చేరాం. గ్రామ శివార్లలో కుడి వైపున ఉన్న సిమెంటు రోడ్లోంచి ఒక ఆటో కొండపైకి వచ్చి ఆగింది. కళ్లెదురుగా శ్రీదామరాజు వేంకటరామ గురుదేవులు ఆశ్రమం. అప్పుడర్ధమైంది ఆ రాత్రి మా బస అక్కడేనని! ఆశ్రమ నిర్వాహకులు మమ్మల్ని సాదరంగా లోపలకు ఆహ్వానించారు. అది ఏడెకరాల సువిశాల స్థలం. ఆశ్రమానికి ఎడమ వైపు యాగశాల, ఆ వెనుక వంటశాల, ధ్యానమందిరం ఉన్నాయి. ఫొటోల కోసం మళ్లీ గ్రామంలోకి బయల్దేరాం. చీకటి ముసురుకుంటోంది. కొండలపై సన్నగా మంచు కురుస్తోంది. ఇళ్ల ముందు చలిమంట వెలుగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ ఆశ్రమం చేరాం. రాత్రి తొమ్మిదవుతుండగా, పొగలు కక్కుతున్న అన్నం, కూర, పప్పు, చారుతో భోజనం వచ్చేసింది. వంట మనిషి మత్స్యమ్మ అద్భుతంగా వండి, అమ్మలా ఆప్యాయంగా ఆకలి తీర్చింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాం. వేకువజామున నాలుగు గంటలకు లేచి చూస్తే దట్టమైన పొగమంచుతో కనుచూపు మేరలో పరిసరాలు కనిపించలేదు. కాలకృత్యాలు పూర్తి చేసుకుని, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపి బయట పడ్డాం. ఉదయం ఐదు గంటలకు మా నడక మొదలైంది. జలపాతానికో పలకరింపు... ఏడు కిలోమీటర్ల దూరం నడిచాక భీమనపల్లి గ్రామం చేరాం. అక్కడ ఏడుకొండలు అనే ఒక గిరిజన మెకానిక్ యువకుడు, ‘‘ఎక్కడినుంచి వస్తున్నార్ సార్?’’ అని ఆప్యాయంగా పలకరించాడు. జవాబు చెప్పేలోగా... ‘సార్... మా గ్రామానికి సమీపంలో అందమైన జలపాతం ఉంది. అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతమవుతుంది. నాతో వస్తే తీసుకెళ్తాను...’ అంటూ మేం వింటున్నామో లేదో పట్టించుకోకుండా చెప్పుకుపోతున్నాడు. లంబసింగి సమీపంలో జలపాతం ఉన్నట్టు ఎప్పుడూ వినలేదు. ఏదైతేనేం గుట్టలు, కొండలెక్కి కిలోమీటర్ దూరం నడిచాం. కొంత దూరం వెళ్లాక చిన్న వాగు, పంట పొలాలు, విశాలమైన రాయి, దాని అంచుల వరకూ వెళ్లి చూస్తే ఒక లోయ కనిపించాయి. కాలుజారితే కైలాసానికే. అక్కడ సన్నగా కిందకు దూకుతున్న జలపాతం కనిపించింది. ఎగువన ప్రవహిస్తున్న వాగును దారి మళ్లించారని... అందుకే జలపాతం చిక్కిపోయిందని ఏడుకొండలు ఆవేదనగా అన్నాడు. నిజమే ఆ ప్రాంతం అరకు దగ్గరి చాపరాయి జలపాతాన్ని తలపిస్తోంది. జలపాతాన్ని దారి మళ్లించడంతో చిక్కిపోయింది. కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని బయల్దేరాం. ఉదయం తొమ్మిది గంటలైనా సందడి లేదు. తూర్పు తలుపు తోసుకుని సూరీడు... లంబసింగి పల్లెను నిద్ర లేపాడు. మేం లంబసింగి సెంటర్‌కు చేరుకున్నాం. నర్సీపట్నం వెళ్లాల్సిన బస్సొచ్చింది. అయిష్టంగానే బస్సెక్కాం. ఆనందానుభూతుల్ని వెంట మోసుకొచ్చాం.’ - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి ప్రతినిధి ఫొటోలు: గాడు సత్యనారాయణ, విశాఖపట్నం -
విచ్చలవిడిగా
విచ్చలవిడిగా బెల్టుషాపులు చింతపల్లి : పల్లొల్లో మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో మద్యం అమ్మకాలు బహిరంగమయ్యాయి. దీం తో పల్లె జనం మద్యం మత్తులో జోగుతున్నారు. యువకులు మద్యానికి బానిసలవుతున్నారు. ప్రధానంగా చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీలు వాటి పరిధిలో ఆవాస గ్రామాల్లో గల్లీకో మద్యం షాపు ఉందంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం మండలంలోని ఏ గ్రా మంలో చూసినా సారా కంటే మద్యమే ఏరులై పారుతోంది. ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని వైన్‌షాపుల యజ మానులే ఇలా అమ్మిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇటు పోలీసులు, అటు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో బెల్టుషాపుల నిర్వహణ మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. రోజుకు రూ.5లక్షల వ్యాపారం ! మండలంలో అడ్డూ అదుపులేని బెల్టుషాపుల నిర్వహణతో రోజుకు సుమారు రూ.5 లక్షల వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నా చర్యలు మాత్రం నామమాత్రమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలో పలు కిరాణ దుకాణాల్లో మద్యం బాటిళ్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల నిర్వాహకులకు రోజూ పండగే పండగ. అయితే బెల్టుషాపులను నియంత్రించాల్సిన అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటు పడి పరోక్షంగా సహకరిస్తున్నట్టు పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు కూ తవేటు దూరంలో బెల్టు షాపులు కొనసాగుతున్నా పోలీసులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. దీంతో తమ కుటుం బాలు ఆగమవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ, సారా తయారీ, విక్రయాలని అరికట్టాలని మండల మహిళలు కోరుతున్నారు.