బాక్సైట్ జోలికి వస్తే కత్తులు దూస్తాం కబర్దార్ అని విశాఖ ఏజెన్సీలో మన్యం ప్రాంతానికి చెందిన చిన్నబ్బాయ్ అనే వ్యక్తి అన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ జోలికి వస్తే ఏమాత్రం సహించేది లేదని చెప్పాడు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో చిన్నబ్బాయ్ తో సహా పలువురు మన్యం పౌరులు మాట్లాడారు.