
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్‌కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment