'చంద్రబాబు కుటుంబం కూడా లబ్ధి పొందింది' | vijayasaireddy told chandrababu also got benfits from ysr | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు కుటుంబం కూడా లబ్ధి పొందింది'

Published Thu, Dec 10 2015 2:37 PM | Last Updated on Thu, Aug 9 2018 2:44 PM

'చంద్రబాబు కుటుంబం కూడా లబ్ధి పొందింది' - Sakshi

'చంద్రబాబు కుటుంబం కూడా లబ్ధి పొందింది'

చింతపల్లి: ఆదివాసీలకు, గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకోసం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.

ఆదివాసీలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఊరుకోరని, ఆయన ఎప్పటికీ అండగా ప్రభుత్వ చర్యలు ఎండగడతారని అన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎంతో చేశారని, సమైక్య రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకమైన మేలు జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబం కూడా వైఎస్ పాలన ద్వారా లబ్ధి పొందిందని అన్నారు. ఆదివాసీల, గిరిజనుల డిమాండ్ ఏమిటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పడంతోపాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా దిశానిర్దేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement