
సాక్షి,విశాఖపట్నం: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి వందేళ్లు పూర్తైన సందర్భంగా అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించారు. ఆదివారం విశాఖపట్నం పోస్టుమాష్టరు జనరల్ కార్యలాయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోస్టుమాష్టరు జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.