
విచ్చలవిడిగా
విచ్చలవిడిగా బెల్టుషాపులు
చింతపల్లి : పల్లొల్లో మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో మద్యం అమ్మకాలు బహిరంగమయ్యాయి. దీం తో పల్లె జనం మద్యం మత్తులో జోగుతున్నారు. యువకులు మద్యానికి బానిసలవుతున్నారు. ప్రధానంగా చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీలు వాటి పరిధిలో ఆవాస గ్రామాల్లో గల్లీకో మద్యం షాపు ఉందంటే నమ్మశక్యం కాదు. ప్రస్తుతం మండలంలోని ఏ గ్రా మంలో చూసినా సారా కంటే మద్యమే ఏరులై పారుతోంది.
ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని వైన్‌షాపుల యజ మానులే ఇలా అమ్మిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇటు పోలీసులు, అటు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో బెల్టుషాపుల నిర్వహణ మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
రోజుకు రూ.5లక్షల వ్యాపారం !
మండలంలో అడ్డూ అదుపులేని బెల్టుషాపుల నిర్వహణతో రోజుకు సుమారు రూ.5 లక్షల వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నా చర్యలు మాత్రం నామమాత్రమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలో పలు కిరాణ దుకాణాల్లో మద్యం బాటిళ్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్న బెల్టుషాపుల నిర్వాహకులకు రోజూ పండగే పండగ. అయితే బెల్టుషాపులను నియంత్రించాల్సిన అధికారులే నెలవారీ మామూళ్లకు అలవాటు పడి పరోక్షంగా సహకరిస్తున్నట్టు పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు కూ తవేటు దూరంలో బెల్టు షాపులు కొనసాగుతున్నా పోలీసులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. దీంతో తమ కుటుం బాలు ఆగమవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణ, సారా తయారీ, విక్రయాలని అరికట్టాలని మండల మహిళలు కోరుతున్నారు.