చింతపల్లి (నల్లగొండ): బైకు, ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్ వద్ద హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. హైదరాబాద్ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా.. చింతపల్లి వైపు నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.