నల్గొండ జిల్లాలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ సమీపంలో గత అర్థరాత్రి కెమికల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది.
నల్గొండ జిల్లాలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ సమీపంలో గత అర్థరాత్రి కెమికల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో డీసీఎం వ్యాన్లోని కెమికల్ ట్యాంకర్లు భారీ శబ్దాలతో పేలాయి. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ఆ ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలనార్పుతున్నారు. ఆ ఘటనతో హైదరాబాద్ - విజయవాడల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
దాంతో వాహనాలను నల్గొండ మీదుగా మళ్లిస్తున్న హైదరాబాద్కు తరలిస్తున్నారు. డీసీఎం వ్యాన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గురైన డీసీఎం వ్యాన్ డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.