తడిసిముద్దయిన జిల్లా
తడిసిముద్దయిన జిల్లా
Published Wed, Sep 21 2016 9:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరులో స్వల్ప వర్షపాతం నమోదు కాగా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 48 మండలాల్లో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా తాడేపల్లిగూడెం 132.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తాళ్లపూడిలో 0.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. పెంటపాడులో 117.2 మి.మీ., తణుకులో 94.2, ఉంగుటూరులో 51.6, పెరవలిలో 47.8, ఇరగవరంలో 45.2, ఉండ్రాజవరంలో 41.8, ఆచంటలో 38.0, అత్తిలిలో 37.4, పోడూరులో 35.4, గణపవరంలో 35, ద్వారకాతిరుమలలో 34.2 మి.మీ వర్షం కురిసింది. పెనుగొండలో 31.8, నల్లజర్లలో 29.2, భీమవరంలో 25.8, కామవరపుకోటలో 22.8, ఏలూరులో 22.2, నిడమర్రులో 22.2, టి.నర్సాపురంలో 21.2, మొగల్తూరులో 20.4, దేవరపల్లిలో 18.8, నరసాపురంలో 18.6 మి.మీ వర్షంపాతం నమోదైంది. పాలకోడేరులో 18.2, ఆకివీడులో 18, పెనుమంట్రలో 17.2, వేలేరుపాడులో 15.2, పాలకొల్లులో 14.6, లింగపాలెంలో 13.6, ఉండిలో 13.2, వీరవాసరంలో 13.2, కుకునూరులో 12.2, బుట్టాయగూడెంలో 11.8, గోపాలపురంలో 10.4, జీలుగుమిల్లిలో 9.8, కొయ్యలగూడెంలో 8.2, కాళ్లలో 8 మి.మీ వర్షం కురిసింది. యలమంచిలిలో 7.2, నిడదవోలులో 6.2, పెదవేగిలో 5.4, దెందులూరులో 4.2, జంగారెడ్డిగూడెంలో 3.6, పోలవరంలో 2.6, చింతలపూడిలో 2.6, చాగల్లులో 1.2, పెదపాడులో 1.2, కొవ్వూరులో 1 మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 1172.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Advertisement