న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం జిల్లాల్లో తీవ్ర వరద ప్రభావానికి గురయ్యే జిల్లాలు ఏకంగా 72 శాతం ఉన్నాయి. కానీ, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ వీటిలో కేవలం 25 శాతం జిల్లాల్లోనే ఉంది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈబ్ల్యూ) అనే స్వతంత్ర విధాన పరిశోధనా సంస్థ ఒక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఇక వరదల ముప్పు అధికంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అంతంతేనని తేలి్చంది. దేశంలో 66 శాతం మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
కానీ, వీరిలో సగం మంది.. అంటే 33 శాతం మంది మాత్రమే ముందస్తు హెచ్చరికల వ్యవస్థ పరిధిలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 25 శాతం జనాభా తుఫాన్ల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉండగా, వారందరూ సైక్లోన్ వారి్నంగ్ వ్యవస్థ పరిధిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, కర్ణాటక, కేరళ, పశి్చమ బెంగాల్ రాష్ట్రాలు సైక్లోన్ హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో ముందంజలో ఉన్నాయని నివేదిక తెలియజేసింది. తీవ్ర వరద ప్రభావిత రాష్ట్రాలు ఏవంటే.. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా, పశి్చమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాకట, గోవా, బిహార్.
Comments
Please login to add a commentAdd a comment