చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి? | Store essentials commodities says chaina warns | Sakshi
Sakshi News home page

China: చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటనకు కారణం కోవిడా? ఆహార కొరతా?

Published Wed, Nov 3 2021 6:16 AM | Last Updated on Wed, Nov 3 2021 10:49 AM

Store essentials commodities says chaina warns - Sakshi

వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్‌ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం

బీజింగ్‌: చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.

దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్‌ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్‌ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. 
(చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement