పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ప్రధాన ఆస్పత్రి శాంటా మారియాలో నియోనాటాలజీ సేవలు లేవు. దీంతో మరొక ఆస్పత్రికి అంబులెన్స్‌లో గర్భిణిని తరలిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ ఘటన పోర్చుగల్ ఆరోగ్యమంత్రి మార్టా టెమిడో రాజీనామ చేసే పరిస్థితికి దారితీసింది. అత్యవసర ప్రసూతి ఆస్పత్రులను తాత్కలికంగా మూసివేయాలని ఆమె తీసుకున్న నిర్ణయమే రాజీనామ చేసేవరకు తీసుకువచ్చింది.
వాస్తవానికి గత వేసవి సెలవుల్లో పలు ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు లేకపోవడంతో వారంతాల్లో ఉండే అ‍్యతవసర ప్రసూతి సేవలను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే ప్రతిపక్షాలు, మున్సిపాలిటీలు గర్భిణులు ఎమర్జెన్సీ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లలేరని, ఇది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ దుమ్మెత్తిపోశాయి. సిబ్బంది కొరత కారణంగా గత్యంతరం లేని స్థితిలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
టెమిడో 2018లో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. అంతేకాదు కోవిడ్-19కి వ్యతిరేకంగా విజయవంతమైన వ్యాక్సిన్ ప్రచారాన్ని నిర్వహించింది కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన మంత్రుల్లో ఆమె ఒకరు. ఐతే ఆమె ప్రసూతి వైద్యానికి సంబంధించిన విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం తోపాటు తాజాగా సదరు గర్భిణి మహిళ కూడా చనిపోవడం ప్రతిపక్షాల విమర్శలకు ఆజ్యం పోసినట్లయింది.
ఈ మేరకు టెమిడో ఆరోగ్య మంత్రిత్వ శాఖ్య ప్రకటనలో తాను ఇక పదవిలో కొనసాగే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని, అందువల్ల తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణియించుకున్నట్లు వెల్లడించింది. ఐతే దీన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియాఓ కోస్టా.. టెమిడో రాజీనామను ఆమోదించడమే కాకుండా ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల ధన్యావాదాలు కూడా తెలిపారు.
(చదవండి: వాషింగ్టన్‌లో కాల్పులు కలకలం...ఇద్దరికి గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment