కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో యవ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశమంతటినీ కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు.
మంగళవారం రెండవ రోజున కూడా నిరసన చేపట్టిన వైద్య విద్యార్థులు లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. దీనిలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సోమవారం రాత్రంతా విద్యార్థులు బీబీ గంగూలీ వీధిలో నిరసన చేపట్టారు. ఈ నేపధ్యంలో బీబీ గంగూలీ స్ట్రీట్‌లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
జూనియర్ డాక్టర్లు వెన్నెముక అస్థిపంజరం, ఎర్ర గులాబీలను చూపుతూ ర్యాలీలో నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ‘కోల్‌కతా పోలీసులు మమ్మల్ని చూసి భయపడిపోయారు. వారు మమ్మల్ని ఆపడానికి తొమ్మిది అడుగుల ఎత్తయిన అడ్డంకులు పెట్టారు. లాల్‌బజార్‌కు వెళ్లి పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు అనుమతించే వరకు మా నిరసన కొనసాగుతుంది. అప్పటి వరకు మేం ఇక్కడే ధర్నా చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment