essential commodities
-
ధర దడ
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి. ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.బియ్యం ధరలూ పైపైకి..బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి. హోల్‌సేల్‌లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్‌లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్‌తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరదలే కారణమట..మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు. -
నిత్యావసరాల ధరలు స్థిరం: కేంద్రం
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో చక్కెర, వంట నూనెలు సహా నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా భరోసా ఇచ్చారు. గోదుమలు, బియ్యం, పంచదార, వంట నూనెల వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల దేశీయ సరఫరాలు, ధరలపై ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో ధరల స్థిరత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మే 22 నుండి గోధుమల ఎగుమతిపై నిషేధం, పార్బాయిల్డ్ బియ్యంపై మార్చి 2024 వరకు 20 శాతం ఎగుమతి సుంకం పొడిగింపు, పప్పుధాన్యాలపై స్టాక్ పరిమితులు, ‘నియంత్రిత’ కేటగిరీ కింద చక్కెర ఎగుమతుల పొడిగింపు వంటి అనేక ఆంక్షలు ధరల పెరుగుదలను నిరోధించడానికి దోహదపడతాయని తెలిపారు. దేశంలో వినియోగానికి తగిన చక్కెర నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. వంట నూనెల విషయంలో వేరుశెనగ నూనె మినహా మిగిలిన ఉత్పత్తులు రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో బియ్యం ద్రవ్యోల్బణం 11 నుంచి 12 శాతం స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మార్కెట్లోకి కొత్త పంట ఉత్పత్తులు వస్తున్న నేపథ్యంలో, ధరలు మున్ముందు మరింత తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోధుమల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో దాదాపు 3.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. -
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదో విప్లవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో తెచ్చిన మార్పులు అందరికీ ఆహారం, ఇతర నిత్యావసరాలు అందాలన్న ప్రభుత్వ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నాయి. ఇప్పటికే ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ విధానం ప్రజా మన్ననలు పొందింది. వలంటీరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం, సచివాలయాల పాలన ప్రజలకు అతి దగ్గరగా కొనసాగుతుండటం వల్ల ప్రజాపంపిణీ మరింత ప్రయోజకత్వాన్ని సంతరించుకొంది. దీంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే చౌక డిపోల నుంచి ఇంటిముందుకు ప్రత్యేక సంచార వాహనాలు సరుకులు తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి. కుటుంబంలో ఏ ఒక్క లబ్ధిదారుడయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. పెద్దలు కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి పని చేసే ప్రదేశాలకు వెళ్ళిన సమయాల్లో పిల్లలు సైతం ఈ సంచార వాహనాల నుంచి సరుకులు తీసుకోవచ్చు. చిన్నా చితకా కూలి పనులు చేసుకు బతికే పేదల చెంతకు సత్వర సేవలు అందాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా ఇక్కడ నెరవేరుతుంది. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం 2013’ పోషకాహార భద్రతను అందించడం లక్ష్యంగా సాగుతోంది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. సరస మైన ధరలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలసిన బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ బియ్యం, గోధుమలను భారత ఆహార సంస్థ నుంచీ, చక్కెరను పరిశ్రమల నుంచీ సేకరించి ప్రజలకు చేరుస్తోంది. చౌక ధరల దుకాణాలు ప్రజాపంపిణీ ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మిల్లుల నుంచి మండల స్థాయి నిల్వ కేంద్రాలకు ‘భారత ఆహారసంస్థ’ సరకు రవాణా చేస్తుంది. ఆ సరుకు నిల్వ కేంద్రాల నుంచి లబ్ధి దారుల ఇంటి మెట్ల వరకు సరుకులు చేర్చడం ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నూతన అధ్యాయం సృష్టించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ, విపత్తులలోనూ ఆహారం, వస్తువుల పంపిణీ చౌకధరల దుకాణాల నుంచే జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఈ దుకాణాలు ప్రజలకు ఆహారాన్ని అందించడంలో అవిశ్రాంతంగా కృషి చేశాయి. కొన్ని జిల్లాల్లో 25 కిలోమీటర్ల పరిధిలోని భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి చౌకధరల దుకాణాలకు నేరుగా ఆహార ధాన్యాల తరలింపు కూడా జరుగుతోంది. తొలిదశ రవాణా, నిర్వహణ ఛార్జీలను నివారించడం ద్వారా విజయ వాడ, విశాఖపట్నంలలో చౌక ధరల దుకాణాల డీలర్లు నేరుగా మండల స్థాయి సరుకు నిల్వ కేంద్రాల నుంచి సరుకు తీసుకెళ్తున్నారు. ఇలా భారత ఆహారసంస్థ ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఒక కారణం. గ్రామ స్థాయి నుంచి ఆంధ్ర ప్రదేశ్ పాలనా యంత్రాంగంలో చోటు చేసుకున్న మార్పులు ఉద్యోగుల్నీ, అధికారులనూ పజలపక్షం నిలబెట్టాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాపంపిణీ వ్యవస్థలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ సరుకు పంపిణీ మొదలయిన తర్వాత లబ్ధిదారులు పదిశాతం మంది పెరిగారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సంచార వాహ నాల ద్వారా ప్రజాపంపిణీ జనామోదం పొందిందని అర్థమ వుతుంది. ప్రజాపంపిణీ వ్యవస్థను ‘సమగ్ర శిశు అభివృద్ధి పథకం’, ‘మధ్యాహ్న భోజన పథకా’లకు కూడా విస్తరించారు. దీనితో సకాలంలో లబ్ధిదారులకు ఆహారపదార్థాలు అందించ గలుగుతున్నారు. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో ఆహార, పౌర సరఫరాల శాఖకు రూ. 3,725 కోట్లు కేటాయించారు. ఇటువంటి పథకాలు, ప్రభుత్వ విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆహార భద్రత’ స్థాయి పెరిగింది. గతంలో కంటే పేదలకు ప్రభుత్వం పట్ల మనస్సులో విశ్వాసం నిండింది. భారత ప్రభుత్వ ‘వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ’ మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రకటన ద్వారా రాష్ట్ర ఆహార కమిషన్ ‘జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013’లోని సెక్షన్ 16 అమలును సమీక్షిస్తుంది. నేటి ‘ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్’ దాని పరిధిలో శక్తి మంతంగా పనిచేస్తోంది. ఆహార భద్రత, హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. అధికారులు, ఉద్యో గులు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షిస్తోంది. ప్రజా ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కరిస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల్నీ, ప్రభుత్వ గురుకులాల్నీ, వసతి గృహాలనూ తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు పెడుతున్న ఆహారం, వసతుల్ని పర్యవేక్షిస్తోంది. ఈ విద్యాలయాలు, హాస్టళ్లకు నాణ్యమైన ఆహార పదార్థాలు సక్రమంగా సరఫరా జరుగుతుందో లేదో తనిఖీ చేస్తోంది. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో భారత ఆహార భద్రతాచట్టం పటిష్టంగా అమలు జరుగుతుందని చెప్పొచ్చు. దీని కోసం స్థానిక ఏపీ ఆహార కమిషన్ అన్ని విధాలా సమర్థంగా పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘వలంటీర్’ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా ‘ఇంటిదగ్గరకే ప్రభుత్వ పాలన’ అనే లక్ష్యాన్ని అక్షరాలా సాధించిందని చెప్పడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చిన మార్పులే నిదర్శనం. ప్రభుత్వ సేవలు భౌతిక రూపంలో ఇంటిముందుకు నడిచి రావడం కన్నా ఏ ప్రజా పంపిణీ వ్యవస్థ అయినా సాధించగల విజయం ఏముంది? కాట్రగడ్డ సురేష్ వ్యాసకర్త ఆల్ ఇండియా కన్సూ్యమర్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఏపీ అధ్యక్షులు ‘ 94412 64249 -
నిత్యావసర మార్కెట్లోకి మార్క్‌ఫెడ్!
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన మార్క్‌ఫెడ్ నిత్యావసర సరుకుల మార్కెట్లోకి అడుగుపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ఉనికిని కాపాడుకోవాలని, సంస్థను లాభాల బాట పట్టించాలని యోచిస్తోంది. అందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. అలాగే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆదాయం తగ్గి.. నష్టాలు పెరిగి.. వాస్తవానికి మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజొన్న, కంది, పెసర, శనగ తదితర పంటలను కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేయడం ద్వారా కమీషన్ వస్తుంది. అలాగే యూరియా, డీఏపీ వంటి ఎరువులనూ రైతులకు విక్రయిస్తుంది. ఇలా రెండు మార్గాల్లో వచ్చే కమీషనే దీనికి ప్రధాన ఆదాయ వనరు. అయితే కొన్నేళ్లుగా పంటలు మద్దతు ధర కంటే ఎక్కువే పలుకుతుండటంతో మార్క్‌ఫెడ్‌కు ప్రధాన పంటలను కొనే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆదాయ వనరులు తగ్గాయి. మరోవైపు గతంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న వంటి పంటలను తిరిగి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికితోడు 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు పేరుకుపోయాయి. దీంతో సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా లాభాలబాట పట్టాలని సంస్థ భావిస్తోంది. మార్క్‌ఫెడ్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. ► వంట నూనెలు, అన్ని రకాల బియ్యం, డ్రైఫ్రూట్స్, పప్పులు, గోధుమ పిండి, పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల నిత్యావసరాలను ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, కాలేజీలు, మహిళా శిశుసంక్షేమ, క్రీడ, వైద్య ఆరోగ్య, జైళ్లకు సరఫరా (నాణ్యమైన నిత్యావసరాలను టెండర్ల ద్వారా సేకరించి విక్రయించడం ద్వారా రెండు శాతం కమీషన్ పొందాలని మార్క్‌ఫెడ్ యోచన) ► చిన్న, మధ్యస్థాయి శుద్ది కర్మాగారాల ఏర్పాటు. ప్రధానంగా పసుపు, పప్పు నూర్పిడి, చిల్లీ శుద్ధి ప్లాంట్లు. ► పురుగుమందులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్స్ విక్రయాలు. ► పైలట్ ప్రాజెక్టుగా ఒకట్రెండు జిల్లాల్లో సేకరణ. ► వర్మీ కంపోస్టు విక్రయించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ► సేంద్రియ తేనె, మామిడి పండ్ల విక్రయంపై దృష్టి. ► పసుపు, మిరప పౌడర్‌ను వినియోగదారులకు అందజేయడం. ► కేంద్రం ప్రవేశపెట్టిన శ్రీ అన్న పథకం సాయంతో మిల్లెట్ల మార్కెటింగ్. ► ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటుæ భాగస్వామ్యం (పీపీపీ)తో మార్క్‌ఫెడ్ స్థలాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం. ► ఆదిలాబాద్‌లో 10 వేల మెట్రిక్ టన్నులు, నిర్మల్‌లో 20 వేల మెట్రిక్ టన్నులు, కొత్తగూడెం జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాముల నిర్మాణం. ► బ్యాంకు రుణాలతో మిర్యాలగూడ, నిర్మల్‌లలో రైస్ ఫోర్టిఫికేషన్ ప్రాజెక్టులు, తాగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు. -
అన్నీ ఉండీ ధరలు పెరగడమా?
దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్నప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్ –సరఫరా సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం వల్ల వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, కొరతలను సృష్టిస్తూ, ధరలను పెంచే వీలు ఏర్పడుతోంది. పైగా ప్రభుత్వమే తన వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతోంది. ఈ లాభాపేక్ష లేకుండా... నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తే ధరల పెరుగుదల నుంచి ప్రజలను కాపాడవచ్చు. గత సంవత్సర కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గోధుమల ధర ఈ కాలంలో సుమారు 22 శాతం పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి 2.5 మిలియన్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అనంతర వారంలోనే వాటి ధర 10 శాతం మేరకు తగ్గింది. ఇది సాధారణ మార్కెట్ సూత్రం. సరఫరా పెరిగితే డిమాండ్ తగ్గడం ఈ ధర తగ్గుదల వెనుకన పనిచేస్తోంది. గత సంవత్సర కాలంగా ఇతరత్రా నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగిపోతోంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఎందుకు ఉండిపోయింది? 2022 ఆగస్టు నాటికే అంతకు ముందరి సంవత్సర కాలంతో పోలిస్తే గోధుమల ధర 14 శాతం మేరన పెరిగి ఉంది. అయినా ప్రస్తుతం చేస్తున్నట్లుగా బహిరంగ మార్కెట్లోకి ధాన్యాన్ని విడుదల చేయలేదు. ఫలితంగా ధరల పెరుగుదల అలాగే కొనసాగింది. దీనికి కారణం, అప్పట్లో ప్రభుత్వం గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను విదేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ ధాన్యం కొరతలు, ముఖ్యంగా గోధుమల కొరత, విదేశీ మారక ద్రవ్య సముపార్జనకు బాగా కలిసి వచ్చింది. కానీ, ఇదే భారత ఆహార సంస్థ వద్ద గోధుమల కొరతకు దారి తీసింది. ఫలితమే అప్పుడు మార్కెట్లో ధర పెరిగినా గోధుమ గింజల సరఫరాను పెంచి, ధరలను తగ్గించలేని స్థితి. నేడు నడుస్తున్నది ఎన్నికల సంవత్సరం. ప్రజలను పెరిగే ధరల పాలు చేసి, వారిలో అసంతృప్తి పెరిగి అది తన ఎన్నికల పరాజయానికి దారి తీయకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గత సంవత్సరం జరిగిన భారీ ఎగుమతుల నేపథ్యంలో అది నిల్వల కొరతకు దారి తీసిన తర్వాత... ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని మార్పు చేయించేందుకు, అమెరికా నుంచి ఒత్తిడులు కూడా వచ్చాయి. చైనా మాత్రమే దేశీయ కొరతల నేపథ్యంలో, ఎగుమతులను నిషేధించాలన్న మన నిర్ణయాన్ని సమర్థించింది. 2022 సంవత్సర కాలంలో మన దేశం బియ్యాన్ని కూడా రికార్డు స్థాయిలో ఎగుమతి చేసింది. వాస్తవానికి నాడు దేశంలో బియ్యం నిల్వలు తగినంత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ బియ్యం ఎగుమతుల నిర్ణయం దేశీయంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమయ్యింది. గత సంవత్సర కాలం పైబడి నిత్యావసరాల ధరలు తీవ్ర స్థాయిలో పెరిగిన స్థితి మనకు తెలిసిందే. దీనికి కొంత మేరకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకొనే వంటనూనెలు, చమురు వంటి వాటి ధరలు అంతర్జాతీయంగానే పెరగడం కారణం కావచ్చును. అయితే, ఇది పాక్షిక సత్యం మాత్రమే. దేశీయంగా వివిధ సరుకుల ధరలను ప్రధానంగా నిర్ణయించే మార్కెట్ శక్తులయిన ‘డిమాండ్ – సరఫరా’ల యాజమాన్యంలో జరుగుతోన్న లోపాలు ధరల పెరుగుదలకు ముఖ్య కారణం. దీనికి, యూపీఏ హయాం నుంచి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు యూపీఏ పాలనా కాలంలో దేశంలో ధరలు పెరుగుతోన్న తరుణంలోనే... భారత ఆహార సంస్థ గోడౌన్లలోని ధాన్యాన్ని ఎలుకలు తినేయడం, లేదా అవి ముక్కిపోవడం జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఆ ప్రభుత్వం ‘ఉచిత భోజనం లేదు’ అంటూ గోడౌన్ల లోని ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు తిరస్కరించింది. మరో పక్కన అదే ధాన్యాన్ని విదేశాలకు... అక్కడ జంతువుల దాణాగా వాడకానికి ఎగుమతి చేసింది. దేశీయ ప్రజలను పెరుగుతోన్న ధరల నుంచి ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదా వారి క్షుద్భాదకు పరిష్కారం చూపడం ప్రభుత్వానికి లక్ష్యాలుగా లేవు. దాని ప్రధాన లక్ష్యం విదేశీ మారక ద్రవ్య సముపార్జన మాత్రమే! యూపీఏ అయినా, ఎన్డీయే అయినా అమలు జరుగుతోన్న విధానాలు ఒకటే. కాకుంటే యూపీఏలో సంస్కరణల పేరిట ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడంలో కొంత వెనుకా ముందు, లేదా మొహమాటాలు ఉన్నాయి. అలాగే, యూపీఏ ప్రభుత్వం కాస్తలో కాస్త నయంగా కొన్ని ప్రజానుకూల సంక్షేమ పథకాలను తెచ్చింది. దానిలో భాగమే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టాల వంటివి. ప్రస్తుతం ఎటువంటి మొహమాటం లేకుండా... కార్పొరేట్, ధనవంతులు, వ్యాపార వర్గాల అనుకూల విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనంతటి ఫలితమే నేడు దేశంలో మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల! ప్రభుత్వం ధరల నియంత్రణకు చిత్తశుద్ధితో పూనుకొని తగిన విధానాలను అనుసరిస్తే ఇంత స్థాయిలో పెరిగి ఉండేవే కాదు. ప్రస్తుతం జరిగిన విధంగా మార్కెట్లోకి గోధుమల నిల్వలను విడుదల చేసి ప్రైవేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధర పెంచగల అవకాశాన్ని కట్టడి చేయగలగడం ఒక ఉదాహరణ. మరింత ప్రాధాన్యత గల మరో ఉదాహరణ కేరళ వంటి రాష్ట్రాలది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన సందర్భాలలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇది అతి తక్కువ స్థాయిలో ఉంటూ రావడం గమనార్హం. దీనికి కారణం ఆ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలు అమలు జరుగుతోన్న తీరు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, దరిదాపు కుటుంబాలకు అవసరమైన అన్ని నిత్యావసరాలు పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లోని వ్యాపారులకు, ప్రజా పంపిణీ వ్యవస్థతో పోటీ ఏర్పడి, వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, వాటి కొరతలను సృష్టిస్తూ, తద్వారా ధరలను పెంచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా పోయింది. అత్యంత సాధారణంగా కనపడే ఈ ఇంగితాన్ని ఆచరణలో అమలులో పెట్టి అటు రైతాంగానికీ, ఇటు వినియోగదారుడికీ ప్రయోజనాన్ని చేకూర్చే విధానాల అమలు సాధ్యమేనని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తూ పోతే ధరల పెరుగుదల బెడద నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడడం సాధ్యమే. ఎన్నికల సంవత్సరంలో మాత్రమే ధరల తగ్గింపును సవాలుగా తీసుకుంటూ, మిగతా నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజానీకాన్ని... వ్యాపారస్తులకూ, దొంగ నిల్వలకూ, కొరతలకూ బలిచేస్తూ పోవడం అత్యంత అసహజమైనది. అది కనీసం డిమాండ్ సరఫరాల తాలూకూ మార్కెట్ సూత్రం పరిధిలో కూడా ఇమడదు. నిజానికి మన దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు (పాలకుల నిర్లక్ష్యంతో ఉత్పత్తి పెరుగుదల లేని వంటనూనె గింజల వంటి కొద్దిపాటివి మినహా) మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్న స్థితిలో కూడా నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్– సరఫరాను సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం... పైగా, స్వయంగా తానే ఒక వ్యాపారిగా తయారై భారత ఆహార సంస్థ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతూ పోవడం... ఫలితంగా అధిక ధరల పరిస్థితి ఏర్పడింది. ఆహార పదార్థాల నిల్వలపై పరిమితులు విధించే చట్టాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ పోవడం వంటి చర్యలు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు, మొబైల్: 98661 79615 -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్‌గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్‌గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్‌లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు
సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది. ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముందుగానే అంచనా.. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్‌ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది.. ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్ మెసేజ్‌లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు. క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’ పోలవరం రూరల్ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్‌పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. -
వంట నూనెల బ్లాక్ దందాపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార, పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసుల నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న వైనంపై ‘ధరల దాడి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పామాయిల్‌తోపాటు పెరుగుతున్న ఇతర వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలను నియంత్రించడానికి విజిలెన్స్ అధికారులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 126 చోట్ల తనిఖీలు నిర్వహించగా.. 16 చోట్ల పరిమితిని మించి నిల్వలు కలిగి ఉండటాన్ని గుర్తించి కేసులు నమోదు చేశారు. నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న వంటనూనెల హోల్‌సేల్ వ్యాపార గోడౌన్లో అధికారుల తనిఖీలు అధిక ధరలకు విక్రయిస్తున్న 15 మందిపై లీగల్ మెట్రాలజీ యాక్ట్–2009 ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిచోట్ల వంట నూనెల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో పాటు సూపర్ మార్కెట్లు, తయారీ యూనిట్లు పరిమితిని మించి నిల్వలు కలిగి ఉన్నా, అధిక ధరలకు విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరించింది. -
నిత్యావసరాలపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
కల్తీలపై కొనసాగుతున్న దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గత సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న ఆహార కల్తీ వ్యాపారాలపై కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మూడోరోజు వరుసగా గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయిస్, ఫుడ్ సేఫ్టీ, రెవెన్యూ, కార్పొరేషన్, మునిసిపల్, లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి, సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. పలు షాపులు సీజ్.. జరిమానాల విధింపు జిల్లా వ్యాప్తంగా కారం మిల్లులు, హోటళ్లు, పచ్చళ్ల తయారీ దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లు, సూపర్ బజార్లు, ఆయిల్ మిల్లులు, కిరాణా మాన్యుఫ్యాక్చరింగ్ షాపులు, పెట్రోలు బంకులు, చికెన్ సెంటర్లు, బిర్యాని పాయింట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, బేకరీలు, రైస్ మిల్లులు, స్వీట్, కూల్‌డ్రింక్ షాపులు, హోల్‌సేల్ మార్కెట్లు, మెస్‌లు మొత్తం 124 వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్, డీఎస్వో పద్మశ్రీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్, తూనికలు, కొలతలశాఖ అధికారి షాలెంరాజు, నగరపాలకసంస్థ సిబ్బంది, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేశాయి. మిర్చియార్డు రోడ్డులో ఐదు కారం మిల్లులు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ఉల్లఘించి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ మిల్లులను, రూ.1,47,90,000 విలువైన కారంపొడిని సీజ్ చేశారు. వేగస్ ట్రేడర్స్‌లో రూ.44,80,000 విలువైన 28,400 కిలోల కారంపొడి, వీరాంజనేయ ట్రేడర్స్‌లో రూ.14 లక్షల విలువైన 7 వేల కిలోలు, సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.27,80,000 విలువైన 13,900 కిలోలు, తులసి స్పైసెస్‌లో రూ.61,30,000 విలువైన 30,650 కిలోల కారాన్ని సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న సత్యసాయి ఎంటర్ప్రైజెస్, మహాలక్ష్మి, వీరాంజనేయ ట్రేడర్స్ వ్యాపార సంస్థలను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపారసంస్థల్లో కొలతల్లో తేడాలు, ఆహార పదార్థాల నాణ్యతలో తేడాలు, ఆయిల్లో కల్తీ, రెస్టారెంట్లో పాడై కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కల్తీకి పాల్పడిన వ్యాపారసంస్థలను సీజ్ చేయడంతో పాటు ఆహారభద్రత చట్టం, తూనికలు కొలతలశాఖ యాక్ట్, సివిల్ సప్లయిస్ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వారి సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 1902కి ఫోన్ చేసి చెబితే వెంటనే దాడులు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి
-
పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీ
సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): నాణ్యమైన నిత్యావసరాలను పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, సీహెచ్ రంగనాథరాజు చెప్పారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేసే మొబైల్ వాహనాలపై డెమో ప్రదర్శించారు. ఈ వాహనాల్లో ఏర్పాట్లు, సదుపాయాలను ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ మంత్రులకు వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ సంక్షేమ రాజ్య స్థాపనకు వెన్నెముకగా నిలుస్తుందనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. వాహనాలను క్షేత్రస్థాయిలో డెమోగా నడిపి లోటుపాట్లు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఎం.కాంతారావు, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
సినీ కార్మికులకు మంత్రి తలసాని చేయూత
-
మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000
కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 నుంచి 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, దీనిని ఉల్లంఘించిన ప్రతిసారీ రూ.1000 జరిమా నా విధిస్తారని స్పష్టంచేశారు. వీటికి రాష్ట్రమంతటా అనుమతి... నిత్యావసర వస్తువులైన ఆహార పదార్థాల క్రయ విక్రయాలు, ఉత్పత్తి, రవాణా, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వస్తువుల విక్రయాలు, వ్యవసాయ కార్యకలాపాలు, అంతర్రాష్ట్ర, రాష్ట్రం అంతర్భాగంలో వస్తువుల రవాణా, ఆస్పత్రులు, క్లినిక్స్, మందుల దుకాణాలు, వైద్య పరీక్షల కేంద్రాల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికం, ఇంటర్నెట్, పోస్టల్ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, అత్యవసర వస్తువుల సప్లై చైన్ కొనసాగింపు, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ– వీటి నిల్వలు, రవాణా సంబంధిత కార్యకలాపాలు రాష్ట్రమంతా కొనసాగుతాయి. ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో అన్ని నిర్మాణ పనులకు అనుమతి. జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ ప్రాంతాల్లో వర్క్ సైట్ల వద్ద కార్మికుల లభ్యత ఉంటేనే పనులకు అనుమతి ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన జోన్ల పరిధిలో అన్ని రకాల పరిశ్రమలకు అనుమతి. స్టోన్ క్రషర్స్, ఇటుకల బట్టీలు, చేనేత, రిపేర్ పనులు, బీడీల తయారీ, ఇసుక ఇతరత్రా మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్స్, ఐరన్, స్టీల్ పరిశ్రమలు, ప్లాస్టిక్, శానిటరీ పైపులు, పేపర్ పరిశ్రమలు, కాటన్ పరుపులు, ప్లాస్టిక్, రబ్బర్ పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఈ–కామర్స్‌కు అనుమతి. జీహెచ్ఎంసీలో నిత్యావసర వస్తువుల ఈ–కామర్స్‌కు మాత్రమే అనుమతి. ♦ గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాల్స్ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి. రెడ్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని పురపాలికల్లో ఒక రోజు విడిచి ఒక రోజు దుకాణాలను తెరవాలి. ఒకే రోజు పక్క పక్క షాపులు తెరవరాదు. రెడ్‌జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో నిత్యావసర వస్తువుల షాపులతో పాటు కేవలం నిర్మాణ సామాగ్రి, హార్డ్‌వేర్, వ్యవసాయ పరికరాలు/యంత్రాలకు అనుమతి. ♦ రెడ్ జోన్ పట్టణ ప్రాంతాల్లోని సెజ్‌లు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు, ఔషధాలు, వైద్య పరికరాలు, వైద్య, ఔషధ సంబంధ ముడిసరుకులు తదితర నిత్యావసర, అత్యవసర వస్తువుల ఉత్పత్తి యూ నిట్లు, నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి, ప్యాక్డ్ వస్తువుల తయారీకి అనుమతి. ♦ జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ పరిధిలోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర ప్రైవేటు కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలి. మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పని చేయవచ్చు. అయితే, రెడ్జోన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం మంది డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులతో పని చేయాలి. అవసరాన్ని బట్టి మిగిలిన సిబ్బందిలో 33 శాతం మంది విధులకు హాజరు కావచ్చు. రక్షణ, భద్రత, వైద్య, కుటుంబ సంక్షేమ, పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ స్టాంపులు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, ఎన్ఐసీ, కస్టమ్స్, ఎఫ్‌సీఐ, ఎన్సీసీ, ఎన్‌వైకే, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అత్యవసర సేవలు కొనసాగాలి. ఆ మేరకు సిబ్బందిని వినియోగించుకోవాలి. ♦ రెడ్ జోన్ల పరిధిలో రెస్టారెంట్లు, బార్బర్ షాపులు, స్పా, సెలూన్స్‌కు అనుమతి లేదు. ట్యాక్సీలు, క్యాబ్, ఆటోరిక్షాలకు సైతం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి. ఆరెంజ్ జోన్లలో మాత్రమే కేవలం ఇద్దరు ప్రయాణికులతో ట్యాక్సీలకు అనుమతి. జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం.. ♦ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ♦ రైలు ప్రయాణాలు (చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లకు మినహాయింపు) ♦ అంతర్రాష్ట్ర బస్సులతో ప్రజారవాణా. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు (ప్రత్యేకంగా అనుమతి పొందినవారికి మినహాయింపు) ♦ అంతర్ జిల్లాతో పాటు జిల్లా లోపల బస్సు సేవలు ♦ మెట్రో రైళ్లు ♦ పాఠశాలలు, కళాశాలలు, విద్యా/శిక్షణ సంస్థలు ♦ హోటళ్లు, లాడ్జీల వంటి ఆతిథ్య సేవలు (వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు బస కల్పించే వాటికి మినహాయింపు) ♦ బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, అమ్యూజ్మెంట్, జూ పార్కులు, మ్యూజియంలు, ఆడిటోరియంలు ♦ సామూహికంగా నిర్వహించే అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక కార్యకలాపాలు ♦ అన్ని ప్రార్థన స్థలాలు, మతపరమైన స్థలాలు ♦ అన్ని సామూహిక మతపర కార్యక్రమాలు ♦ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి లేదు. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు/వ్యాపార సంస్థలను సాయంత్రం 6 తర్వాత మూసేయాలి. -
రేషన్ కార్డు లేకుంటే..?
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్లో చిక్కుకున్న వారికి రేషన్ కార్డులు లేకపోయినా ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల రేష న్ కార్డులు జారీ అయినా వాటిలో మూడొంతులు తిరస్కరణకు గురయ్యాయని, రేషన్ కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెప్పడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలిపింది. హైదరాబాద్‌లో 20.6 లక్షల తెల్ల రేషన్ కార్డులు జారీ అయినా వాటిలో 17.6 లక్షల కార్డులను అధికారులు తిరస్కరించారని, దీంతో రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర వస్తువులు అందట్లేదంటూ సా మాజిక కార్యకర్త ఎస్క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు ప్ర జాహిత వ్యాజ్యం (పిల్)గా పరి గణించింది. ప్రభుత్వ వివరణ కోసం విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గత నెల ప్రభుత్వ నివేదికలో హైదరాబాద్‌లోనే భారీ స్థాయిలో కార్డులు తిరస్కరించారని, లాక్డౌన్ వేళ వలస కార్మికులు, ఇతరులు రేషన్ కార్డులు ఎలా చూపించగలరని ప్రశ్నించింది. ని త్యావసరాలు ఇవ్వాలంటే రేషన్ కార్డు చూపాలని అధికారులు ఒత్తిడి చేయడం తగదంది. లాక్డౌన్ వేళ అంద రినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన ని స్పష్టం చేసింది. వలస కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. -
జేబుకు చిల్లే..
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ఇప్పుడు ప్రపంచ ప్రజలను ఆరోగ్యపరంగా హైరానా పెడుతోన్న పేరిది. ఈ వైరస్ ఎక్కడి నుంచి ఎలా వ్యాపిస్తుందో తెలియక, ‘ఐసోలేషన్, క్వారంటైన్’లను తలచుకుని అంతా హడలిపోతున్నారు. అందుకే ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. అయితే, ఈ మహమ్మారి ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ జనజీవనాన్ని కకావిలకం చేయనుందనే గుబులు పట్టిపీడిస్తోంది. ఇదే విషయాన్ని వెల్లడించింది లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వే. ఈ సర్వే ప్రకారం 87శాతం మంది ఏదో స్థాయిలో తమ ఆదాయంపై ప్రభావం చూపనుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా 17వేల మందితో ఈ సర్వే నిర్వహించారు. 45 రోజుల క్రితం నిర్వహించిన ఇదే సర్వేలో 28 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందగా, ఇప్పుడు ఏకంగా 87 శాతం మంది భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నట్టు తేలింది. సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలివీ.. 26 శాతం మంది: తమ ఆదాయం కరోనా కారణంగా 50 శాతం కన్నా ఎక్కువ తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చారు. 25–50 శాతం మంది: తమ ఆదాయం 25–50 శాతం వరకు తగ్గిపోతుందని చెప్పారు. 12 శాతం మంది: 25 శాతం ఆదాయం తగ్గుతుందని చెప్పారు. 24 శాతం మంది: ఆదాయం తగ్గుతుంది కానీ, ఏ మేరకు తగ్గుతుందో చెప్పలేమన్నారు. 11 శాతం మంది: తమ ఆదాయం ఏ మాత్రం తగ్గదనే ధీమా వ్యక్తం చేశారు. 2 శాతం మంది: ఆదాయం తగ్గకపోగా, పెరుగుతుందని చెప్పారు. ► సర్వేలో పాల్గొన్న వారిలో 31 శాతం మంది తమ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అంశాలపై ఆందోళన వెలిబుచ్చారు. ► 24 శాతం మంది తమకు కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళనతో ఉన్నారు. ► 11 శాతం మంది కుటుంబ అవసరాల కోసం నిత్యావసరాలు దొరకవేమోనని భయపడుతున్నారు. ► 26 శాతం మంది మీడియాలో కరోనా వైరస్ గురించి వస్తున్న నెగెటివ్ వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. -
పేదలకు సరుకులు పంపిణీ చేసిన జోగిరమేష్
-
వలస కూలీల కోసం నిత్యావసరాలు పంపిణీ
-
నెలకు సరిపడా నిత్యావసర సరుకులు: మార్గాని భరత్
-
ఆశావర్కర్లు,108,104 సిబ్బందికి సరుకుల పంపిణీ
-
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రోజా
-
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ
-
జర్నలిస్టుల సేవలు అభినందనీయం
-
74 లక్షల ఖాతాల్లో రూ.1,111 కోట్లు జమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు అందిస్తున్న సాయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 74 లక్షల లబ్ధిదారుల కుటుంబాలకు రూ.1,500 చొప్పున రూ.1,111 కోట్లు జమ చేసింది. మిగతా కుటుంబాలకు ఈ సాయాన్ని అందించే ప్రక్రియను కొనసాగిస్తోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండు కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల కొనుగోలుకై అందిస్తున్న సాయంతో కలిపి మొత్తంగా రూ.2,214 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 87.54 లక్షల కుటుంబాల్లోని 2.80 కోట్ల లబ్దిదారులకుగాను 2.40 కోట్ల మంది లబ్ధిదారులకు ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేసింది. దీనికోసం 3.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. గడిచిన మార్చ్ నెలలో 83శాతం మంది రేషన్ తీసుకోగా, ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితులు, 12 కిలోల ఉచిత బియ్యం నేపథ్యంలో ఈ ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు 88.11శాతం మంది రేషన్ తీసుకున్నారు. గత నెలకంటే దాదాపు 5శాతం మంది అధికంగా రేషన్ తీసుకున్నారని వివరించారు. ఇక బియ్యంతోపాటు పప్పు, ఉప్పులాంటి సరుకుల కోసం ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున 74 లక్షల కుటుంబాలకు రూ. 1,111 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన కుటుంబాలకు సాంకేతిక కారణాలతో సమస్యలు ఎదురవడంతో జమ చేయలేదు. త్వరలో వీరికి కూడా నగదు జమ చేయనున్నారు. ఈ నగదు జమ చేయడం కోసం గడిచిన మూడు రోజులుగా పౌరసరఫరాల ఐటీ, సీజీజీ సిబ్బంది నిరంతరాయంగా పనిచేశారు. మాట నిలబెట్టుకున్నాం: మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్రంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరుపేద ప్రజలెవరూ ఆకలితో అలమటించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ 12 కిలోల ఉచిత బియ్యం, రూ. 1,500 సాయం అందించారని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే 88శాతం మందికి రేషన్ పంపిణీ పూర్తి చేశామని, 74 లక్షల కుటుంబాలకు నగదు జమ చేశామని వెల్లడించారు. సాంకేతిక కారణాలు కొలిక్కివచ్చిన వెంటనే మిగతా కుటుంబాలకు నగదు జమ చేస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని తెలిపారు. ఇక ధాన్యం సేకరణకు గన్నీ సంచుల కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే హమాలీల కొరతను అధిగమించేందుకు బిహార్ రాష్ట్రం నుంచి హమాలీలను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. -
రెడ్జోన్లలో ఇళ్ల వద్దకే సరుకులు పంపిణీ
-
నిత్యావసరాలను పంపిణీ చేసిన కొడాలి నాని
-
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి
-
దారుణ పరిస్ధితిలో మున్సిపల్ సిబ్బంది
-
కష్టకాలంలో పేదలకు వైఎస్సార్సీపీ అండ
-
విశాఖలో నిత్యవసర వస్తువులు పంపిణీ
-
వీటి రవాణాపై ఆంక్షల్లేవు
సాక్షి, అమరావతి: ఆహారం, నిత్యావసర సరుకులన్నిటికీ లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేసింది. వీటి రవాణాకు ఎక్కడా, ఎలాంటి ఆంక్షలు లేవని కూడా పేర్కొంది. అంతర్ రాష్ట్ర రవాణా మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత స్పష్టతతో చర్యలు తీసుకోవాల్సి ఉందని, లేదంటే నిత్యావసర సరకుల సరఫరా చైన్ దేశ వ్యాప్తంగా దెబ్బతింటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలివీ ► నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్‌లు, వాటికి సంబంధించి ముడి పదార్థాలు, హ్యాండ్ వాష్, సబ్బులు, టూత్ పేస్ట్, దంత సంరక్షణ వస్తువులు, షాంపూ, సర్ఫేస్ క్లీనర్స్, డిటర్జెంట్స్, శానిటరీ పాడ్స్, చార్జర్స్, బ్యాటరీల రవాణాకు ఆంక్షల నుంచి సడలింపు ఉంది. ► ల్యాబొరేటరీలకు, ఇ–కామర్స్ విక్రయాలు, నిత్యావసర సరకుల ఉత్పత్తి, సరుకుల రవాణాకు మినహాయంపు ఉంది. ► నిత్యావసర సరకుల రవాణా, ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలకు జిల్లాల అధికారలు వ్యక్తిగత పాస్‌లు ఇవ్వాలి. ► లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన వస్తువుల కంపెనీలు, ఆర్గనైజేషన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వాలి. ► రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టుల్లో కార్గో సర్వీసులను అనుమతించాలని స్పష్టం చేసినా కొన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం పాస్‌లు ఇవ్వడం లేదు. వీటికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంది. ► నిత్యావసర సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పాస్‌లు జారీ చేయాలి. ► అంతర్ రాష్ట్ర రవాణా వాహనాల్లో ఒక డ్రైవర్, మరో వ్యక్తిని అనుమతించాలి. నిత్యావసర సరుకులు తీసుకు రావడానికి వెళ్లే ఖాళీ వాహనాల్లో ఒక డ్రైవర్, అదనంగా ఒక వ్యక్తిని స్థానిక అథారిటీలు అనుమతించాలి. ► కోవిడ్–19 టెస్టింగ్ ప్రైవేట్ ల్యాబ్‌లకు, టెస్టింగ్ నమూనాల సేకరణ కేంద్రాలు, వాటిని రవాణాకు మినహాయింపు ఉంది. -
నిత్యావసరాలకు ‘కరోనా’ సెగ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నిత్యావసర సరుకులకు కరోనా వైరస్ సెగ తగిలింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ పదిరోజుల్లో వివిధ సరుకుల ధరలు ఒక్కసారిగా పెరగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే విలవిల్లాడుతున్నారు. ఆయా సరుకుల ధరలు సగటున కిలోకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగాయి. లాక్‌డౌన్‌తో సరుకు రవాణా ఖర్చులు పెరిగాయని, అందుకే నిత్యావసరాల ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎండుమిర్చిపై చైనా ప్రభావం.. సూర్యాపేట, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలనుంచి ఎండు మిర్చి ఏటా చైనాకు ఎగుమతి అవుతుంది. కరోనా వైరస్ ప్రబలడంతో ఆ దేశంలోకి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు, రైతులనుంచి కొనుగోలు చేసిన మిర్చిని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయగా, మిగిలినది కోల్డ్ స్టోరేజీల్లో పెట్టారు. చైనాలో పరిస్థితులు చక్కబడ్డాక ఎగుమతి చేస్తే అధిక ధర వస్తుందన్న ఆలోచనలో వ్యాపారులున్నారు. ఈ కారణంగా బహిరంగ మార్కెట్లో మిర్చి నిల్వలు తగ్గాయి. దీంతో ఒక్కసారిగా ఎండుమిర్చి ధర బాగా పెరిగింది. ఈ పది రోజుల్లోనే కేజీ ధర సాధారణం కంటే అదనంగా రూ.70 వరకు పెరిగింది. వచ్చేది మామిడి పచ్చళ్ల సీజన్ కావడంతో ఇంకెంత పెరుగుతుందోనని పేదలు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రవాణా తగ్గి ఘాటెక్కిన అల్లం, వెల్లుల్లి ధరలు.. లాక్‌డౌన్‌తో అల్లం, వెల్లుల్లి ధరలు ఘాటెక్కాయి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ హోల్‌సేల్ మార్కెట్లకు కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి అల్లం, వెల్లుల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. అలాగే మెదక్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు పండించింది కూడా ఈ మార్కెట్లకు వస్తుంది. అయితే లాక్‌డౌన్‌తో కర్ణాటక, కేరళ రాష్ట్రాలనుంచి ఉభయ రాష్ట్రాలకు అల్లం, వెల్లుల్లి దిగమతి భారీగా తగ్గింది. కరోనా వైరస్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్ల నుంచి ట్రక్కుల్లోకి సరుకు ఎత్తడానికి కూలీలు బయపడుతుండడంతో మన రాష్ట్రానికి తగినంతగా రావడం లేదని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి అల్లం, వెల్లుల్లిని ఎక్కువగా వాడాలని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కూడా ధర పెరగడానికి ఒక కారణమైందని అంటున్నారు. దీంతో అల్లం, వెల్లుల్లి ధర సగటున కేజీకి రూ.60 నుంచి 100 వరకు పెరిగింది. చింత‘పండ’లేదని.. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతాలనుంచి రాష్ట్రానికి చింతపండు దిగుమతి అవుతుంది. ఆయా ప్రాంతాల్లో ఈసారి చింతకాయ పంట దిగుబడి సరిగా లేనందున దీని ధర పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక కంది పప్పు, పెసరపప్పు, పేదలు వాడే మైసూర్ పప్పు (ఎర్రపప్పు)ల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో కంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన దాంట్లో చాలావరకు మార్క్‌ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉండడంతో కంది పప్పు ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. రిటైల్ దుకాణాల్లో నిత్యావసరాల ధరలు (కిలో.. రూపాయల్లో) ఇలా.. -
డయల్ 1902
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే ప్రభుత్వం పరిష్కరిస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1902 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రజలు ఈ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. సరుకుల విక్రయంలో మోసాలకు పాల్పడితే కేసులు లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల విక్రయాల్లో మోసాలకు తావు లేకుండా తనిఖీలు నిర్వహించాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర వస్తువులు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు అమ్మినా వాటిని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. – పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► వాహనాలు, వ్యక్తులకు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి 650 పాస్‌లు ఇచ్చాం. ► ఇప్పటివరకు విద్యుత్, నీటిసరఫరాకు ఎటువంటి ఆటంకం కలగలేదు, పారిశుధ్య సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. ► 1,060 ఎల్పీజీ సరఫరాదారులు వంట గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ► బుధవారం నాటికి రాష్ట్రంలో 101 రైతుబజార్లు, 385 వికేంద్రీకరణ రైతుబజార్లు, 277 మొబైల్ రైతుబజార్లు, 868 డోల్ డెలివరీ సర్వీసులు, 34,324 రిటైల్ దుకాణాలు, 11,131 మెడికల్ షాపులు పనిచేస్తున్నాయి. ► రోజుకు 20 వేల క్వింటాళ్ల కూరగాయలు, 22.03 లక్షల లీటర్ల పాలు, 71.57 లక్షల గుడ్లు, 15.09 మెట్రిక్ టన్నుల బియ్యం, 2,300 టన్నుల పప్పుధాన్యాలు, 4,800 మెట్రిక్ టన్నుల పంచదార అందుబాటులో ఉన్నాయి. -
అందరికీ అందుబాటులో నిత్యావసరాలు
-
ఉ.11 గంటల తర్వాత బయటకు రావద్దు
సాక్షి, అమరావతి: కరోనా విస్తరణ నివారణ చర్యల్లో భాగంగా పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 గంటల వరకే అనుమతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆదివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా బయటకు రావద్దు - నిపుణుల సూచనల మేరకు నిత్యావసరాల విక్రయాల సమయం కుదించాం. ఉదయం 11 గంటల తర్వాత పట్టణాలు, నగరాల్లో ప్రజలు బయటకు రాకూడదు. గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతిస్తున్నాం. ప్రజలు ఒక్కసారిగా బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. - నిత్యావసరాలకు కొరత లేకుండా చర్యలు చేపట్టాం. నిత్యావసర సరుకులు సహా ఏ సమస్య ఉన్నా ప్రజలు 1902 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. - అనాథలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి భోజన సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. - ప్రతి జిల్లాలో మంత్రులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటారు. పట్టణ ప్రాంతాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. - లాక్‌డౌన్‌కు ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు. ఇకపై కూడా ఇదే విధంగా సహకరించాలి - రాష్ట్రానికి అత్యవసరంగా వచ్చేవారిని క్వారంటైన్లో ఉంచుతాం. మరోసారి రీ సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించాలని సీఎం ఆదేశించారు. పొలం పనులకు ఇబ్బంది లేదు.. - రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగవు తున్న చేపలు, రొయ్యలను ఎంపెడాతో కలసి కొనుగోలు చేయడంపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు - వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని, మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం సూచించారు. – వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 104కి ఫోన్ చేయండి - ఎవరైనా జ్వరం, పొడిదగ్గు, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదు ర్కొంటే వెంటనే 104 నంబర్‌కు తెలియజేయాలి. వలంటీర్లకు సమాచారం ఇవ్వాలి. - కరోనా విస్తరించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు ఇళ్లలోనూ వ్యక్తిగత దూరం, పరిశుభ్రత పాటించాలి. – పీవీ రమేష్ (సీఎంవో అదనపు చీఫ్ సెక్రటరీ) -
జనమంతా ఇంట్లోనే..
రాష్ట్రమంతటా లాక్ డౌన్ పటిష్టంగా.. ప్రశాంతంగా అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిబంధనల్ని అతిక్రమించిన వారిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. హోమ్ క్వారంటైన్ నుంచి ఎవరైనా బయటకు వస్తే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసేవిధంగా కరోనా ట్రాకింగ్ యాప్‌ను రూపొందించారు. ఎక్కడికక్కడ జిల్లా సరిహద్దులను మూసివేసి పొరుగు జిల్లాల వారెవరినీ అనుమతించటం లేదు. తాజాగా మరికొన్ని పట్టణాల్లోనూ నిత్యావసర సరుకుల డోర్ డెలివరీ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. – సాక్షి నెట్వర్క్ - కర్నూలు జిల్లా నంద్యాల, కర్నూలు పట్టణాల్లో నిత్యావసర సరకులను మాల్స్ ద్వారా డోర్ డెలివరీ చేసే విధానాన్ని శనివారం అమల్లోకి తెచ్చారు. లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించిన 47 మందిపై కేసులు నమోదు చేశారు. 164 మందిని అదుపులోకి తీసుకుని ఎంవీ యాక్ట్ కింద రూ.7 లక్షల జరిమానా విధించారు. - గుంటూరులో రెండు కరోనా కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళదాస్ నగర్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయల డోర్ డెలివరీ విధానం అమల్లోకి వచ్చింది. గుంటూరు అర్బన్ జిల్లాలోకి విజయవాడ సహా ఇతర జిల్లాల నుంచి రాకపోకలు నిలిపివేశారు. - విశాఖ జిల్లాలో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సడలింపు ఉన్నప్పటికీ ప్రజలు 11 గంటలకే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఏ ఒక్క వాహనాన్ని అనుమతించకుండా సరిహద్దులన్నీ మూసివేశారు. - తూర్పుగోదావరి జిల్లా అంతటా పారిశుద్ధ్య కార్మికులు వీధులు, డ్రైన్లను శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు కరోనా వైరస్, సమస్త విషరోగ నివారణార్థం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్ఛర) స్వామి క్షేత్రంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. - విజయనగరం సమీపంలోని మిమ్స్ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్పు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 200 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. - వేరే ప్రాంతాల నుంచి వచ్చి శ్రీకాకుళంలో చిక్కుకుపోయిన వారి కోసం వైఎస్సార్ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు. - చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 25 పడకలతో ఐసోలేషన్ కేంద్రం, ఆలయ వసతి సముదాయం గంగాసదన్‌లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరానికి ఇటలీ నుంచి ఓ వ్యక్తి రావడంతో అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. - పశ్చిమగోదావరి జిల్లాలో నిత్యావసర సరకుల అమ్మకాలను మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘కరోనా నుంచి ప్రజల్ని కాపాడటానికి మా నాన్న పోలీసుగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. మాతో గడిపేందుకు కూడా సమయం ఉండటం లేదు. దయచేసి మీరు ఇళ్లలో ఉండి మా నాన్నకు విశ్రాంతి దొరికేలా చూడండి’’ అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా బాలిక. -
నిత్యావసరాల నిరంతర సరఫరాకు చర్యలు..
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువులు ప్రజలకు సౌకర్యవంతంగా, సురక్షితంగా అందేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. కోవిడ్ -19 లాక్ డౌన్ నేపథ్యంలో ఈకామర్స్, లాజిస్టిక్ రంగాలవారు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత వర్గాలతో చర్చించేందుకు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యంత సురక్షితంగా అందేలా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫెర్స్ , నెట్ మెడ్స్, ఫార్మ్ ఈజీ, ఐఎంజి టెక్, ఉడాన్, అమెజాన్ ఇండియా, బిగ్ బాస్కెట్, జొమాటో, వంటి ఈ కామర్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. పెద్ద రీటైల్ ఆపరేటర్ల తరఫున మెట్రో క్యాష్ అండ్ క్యారీ, వాల్‌మార్ట్, ఆర్పిజి ప్రతినిధులు హాజరుకాగా లాజిస్టిక్ ఆపరేటర్ల తరఫున ఎక్స్‌ప్రెస్ ఇండస్ట్రీ కౌన్సిల్, డెలిహివెరి, సేఫ్ ఎక్స్‌ప్రెస్, పేటిఎం, స్విగ్గీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక నిత్యావసర వస్తువుల నిరంతర సరఫరాకు సంబంధించి వివిధ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు హోం మంత్రిత్వ శాఖ నిర్ధిష్ట మార్గదర్శకాలు జారీచేసింది. లాక్డౌన్ సమయంలో సరకు రవాణా, తయారీ, సామాన్యుడికి చేరవేత వంటి వాటి్కి సంబంధించి ఆయా సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందులను పరిశీలించేందుకు ఈ డిపార్టమెంట్ ఒక కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇండియన్ పేటెంట్స్ కార్యాలయం సమాధానాలు దాఖలు చేయడం, ఫీజుల చెల్లింపు వంటి వాటి గడువును పొడిగించింది. చదవండి : మహమ్మారి కలకలం: హాలీవుడ్ నటుడు మృతి -
నిత్యావసరాలకు మాత్రమే ఓకే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నిత్యావసర ఉత్పత్తులే సరఫరా చేయాలని ఈ–కామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోరాదని నిర్ణయించుకున్నాయి. ‘నిత్యావసరాలు, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నాం. ఫ్యాషన్, మొబైల్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ తదితర నిత్యావసరయేతర ఉత్పత్తులకు తాత్కాలికంగా కొత్త ఆర్డర్లు తీసుకోబోము‘ అని పేటీఎం మాల్ ఒక ప్రకటనలో తెలిపింది. డెలివరీలు సత్వరం చేసేందుకు వెసులుబాటు లభించేలా ప్రభుత్వ వర్గాలు, లాజిస్టిక్స్ సంస్థలతో సంప్రతింపులు జరుపుతున్నట్లు వివరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాలు, హ్యాండ్ శానిటైజర్లు మొదలైనవి తక్షణం సరఫరా చేయగలిగే విక్రేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఆర్డర్ల డెలివరీల్లో జాప్యం: అమెజాన్ లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల కారణంగా ఆర్డర్ల డెలివరీల్లో మరికాస్త జాప్యం జరిగే అవకాశం ఉందని అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ‘ప్రీపెయిడ్ పేమెంట్ విధానంలో అత్యవసర ఉత్పత్తులకు మాత్రమే కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటూ, సాధ్యమైనంత త్వరగా డెలివరీ సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని వివరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం..: ఫ్లిప్‌కార్ట్.. నిత్యావసర సరుకుల డెలివరీ సేవలను ప్రారంభించింది. ‘ఆర్డర్ల ప్రాధాన్యాన్ని బట్టి సాధ్యమైనంత త్వరగా మీకు డెలివర్ చేస్తాము. ఇతర ఉత్పత్తులకు ఆర్డర్లు తాత్కాలికంగా తీసుకోవడం లేదు. కానీ వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాము‘ అని తమ వెబ్సైట్లో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. స్థానిక అధికారుల తోడ్పాటుతో కార్యకలాపాలన్నీ యథావిధిగా ప్రారంభించినట్లు ఆన్లైన్ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్ వెల్లడించింది. అయితే, గ్రోఫర్స్ పోటీ సంస్థ అయిన బిగ్‌బాస్కెట్ వెబ్సైట్ మాత్రం కొత్త కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం లేదు. -
నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చే సరుకుల విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం, రాష్ట్రాల సరిహద్దుల వద్ద అడ్డుకోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై గురువారం హోల్‌సేల్ వ్యాపారులు పౌర సరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. నిత్యావసరాల ధరలు పెంచవద్దని ప్రభుత్వం విన్నవిస్తోందని, అయితే సరుకు రవాణా జరుగకుండా ధరల పెరుగుదలను అడ్డుకోవడం సాధ్యం కాదని వ్యాపారులు ఆయన దృష్టికి తెచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వీటిని అనుమతిస్తేనే ధరల పెరుగుదలను అడ్డుకోవచ్చని తెలిపారు. స్పందించిన కమిషనర్, ఎక్కడైనా చెక్‌పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తే డ్రైవర్ పేరు, నంబర్ తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధిక ధరలకు విక్రయిస్తే పీడీ కేసులు లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యావసరాలను విక్రయించాలని పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. అధిక ధరలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచాయని, అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ
-
సీఎం ఆదేశాలు ఇలా..
-
ధరలు పెంచితే పీడీ యాక్టు
గుడివాడ: కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించినట్లు తెలిస్తే వర్తకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
అందుబాటులో నిత్యావసరాలు
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల్లో నిత్యావసరాలు దొరకడం లేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల కోసం వస్తున్న ప్రజలు ఒకే సమయంలో గుమిగూడటం వల్ల సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశం దెబ్బ తింటుందనే విషయంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాలు ఇలా.. ► నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలి. ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలి. ► కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. అంత వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతించాలి. ► సప్లై చెయిన్ దెబ్బ తినకుండా గూడ్స్ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలి. ► నిత్యావసరాల షాపుల వద్ద ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్ ఉండాలి. ► ప్రజలు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలి. ఎవరూ కూడా 2 లేదా 3 కి.మీ పరిధి దాటి రాకూడదు. ఆ మేరకు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం చూసుకోవాలి. పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి. ► ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి ► కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే 1902కు కాల్ చేయాలి. ► కాల్ సెంటర్లో ఒక సీనియర్ అధికారిని పెట్టండి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోండి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ప్రకటించండి. ► నిల్వ చేయలేని పంట ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
నిత్యావసరాలపై బెంగవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: 21 రోజుల పాటు దేశం లాక్ డౌన్ ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటన చేసిన అనంతరం కేంద్ర హోం శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. 1.లాక్ డౌన్ వర్తించేవి: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ కార్పొరేషన్ సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు వర్తించేవి: రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ట్రెజరీ, పబ్లిక్ యుటిలిటీస్(పెట్రోలియం, సీఎన్జీ, ఎల్పీజీ, పీఎన్జీ), డిజాస్టర్ మేనేజ్మెంట్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ యూనిట్స్, పోస్ట్ ఆఫీసులు, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ 2. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యాలయాలు, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు మూసి ఉంటాయి. వీటిలో మినహాయింపు వర్తించేవి: ఎ) పోలీస్, హోం గార్డు, సివిల్ డిఫెన్స్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసులు, జైళ్ల విభాగం బి) జిల్లా పరిపాలన కార్యాలయాలు, ట్రెజరీ సి) విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య విభాగాలు డి) పురపాలక సంస్థలు–అత్యవసర సేవలకు సంబంధించిన సిబ్బంది(శానిటేషన్, వాటర్ సప్లయ్) 3. ఆసుపత్రులు, వైద్య సంస్థలు, ఔషధ ఉత్పత్తులు, పంపిణీ సంస్థలు (పబ్లిక్, ప్రయివేటు), డిస్పెన్సరీలు, కెమిస్ట్(ఫార్మసీ), వైద్య పరికరాల షాపులు, వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్స్, అంబులెన్స్ సేవలు 4. అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు వర్తించేవి: ఎ) షాపులు (రేషన్ షాపులు, ఫుడ్, కిరాణం, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా తదితర షాపులు తెరిచి ఉంటాయి. ప్రజలు ఇక్కడికి రావడం కంటే ఇవి హోం డెలివరీ అయ్యేలా జిల్లా యంత్రాంగం చూడాలి. బి) బ్యాంకులు, బీమా సంస్థలు, ఏటీఎంలు సి) ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డి) టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు(సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి పనిచేయాలి) ఇ) ఫుడ్, ఫార్మా, వైద్య పరికరాలు ఈ–కామర్స్ ద్వారా హోం డెలివరీ కొనసాగుతుంది. ఎఫ్) పెట్రోల్ పంపులు, ఎల్పీజీ, పెట్రోలియం, గ్యాస్ రీటైల్, స్టోరేజ్ యూనిట్లు తెరిచి ఉంటాయి. జి) పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ యూనిట్లు, సేవలు కొనసాగుతాయి హెచ్) సెబీ గుర్తింపు పొందిన కాపిటల్ ఐ) కోల్డ్‌స్టోరేజ్ అండ్ వేర్‌హౌజింగ్ సేవలు జె) ప్రయివేటు సెక్యూరిటీ సేవలు (ఇతర అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం చేయొచ్చు) 5. పారిశ్రామిక సంస్థలు మూసి ఉంటాయి. ఇందులో మినహాయింపు: ఎ)అత్యవసర వస్తు ఉత్పత్తుల తయారీ సంస్థలు బి) నిరంతరం ఉత్పత్తి చేయాల్సిన ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొనసాగించవచ్చు. 6. విమానం, రైలు, రోడ్డు రవాణా ఉండదు. మినహాయింపు: ఎ) అత్యవసర వస్తువుల రవాణా బి) అగ్నిమాపక సేవలు, శాంతి భద్రతలు, ఇతర అత్యవసర రవాణా సేవలు 7. ఆతిథ్య సేవలు నిలిపివేయాలి మినహాయింపు: లాక్డౌన్లో చిక్కుకున్నవారు, పర్యాటకుల కోసం, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవలు అందించే సిబ్బంది, విమానయాన సిబ్బంది, నౌకాయాన సిబ్బంది కోసం హోటళ్లు, లాడ్జీలకు మినహాయింపు 8. విద్యా సంస్థలు, పరిశోధన, కోచింగ్ సంస్థలు బంద్ 9. అన్ని ప్రార్థన మందిరాలు మూసి ఉంటాయి. 10. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, విద్య, సాంస్కృతిక, మత వేడుకలు, సమావేశాలపై నిషేధం 11. అంత్యక్రియల విషయంలో 20 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదు. 12. ఫిబ్రవరి 15 తరువాత దేశంలోకి వచ్చిన వారంతా స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు నిర్ధిష్ట కాలం హోం క్వారంటైన్లో లేదా ఆసుపత్రి క్వారంటైన్లో ఉండాలి. లేనిపక్షంలో ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు. 13. ఈ చర్యలన్నీ అమలయ్యేందుకు జిల్లా మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను ఇన్సిడెంట్ కమాండర్‌గా క్షేత్రస్థాయిలోకి పంపి అమలయ్యేలా చూడాలి. ఈ చర్యలు అమలుకావడంలో ఇన్సిడెంట్ కమాండర్లు బాధ్యులుగా ఉంటారు. 14. ఈ ఆంక్షలన్నీ ప్రజల కదలికల నియంత్రణకే తప్ప అత్యవసర వస్తువుల రవాణాకు సంబంధించి కాదని యంత్రాంగం గుర్తుంచుకోవాలి. 15. ఆసుపత్రుల సేవలు కొనసాగడం, వాటికి వనరుల సమీకరణ కొనసాగేలా ఇన్సిడెంట్ కమాండర్స్ చూడాలి. అలాగే ఆసుపత్రుల విస్తరణ, వాటికి అవసరమయ్యే మెటీరియల్, పనివారు లభ్యమయ్యేలా చూడాలి. 16. ఆంక్షలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 వరకు గల సెక్షన్ల కింద శిక్షార్హులు. -
సీఎంఆర్ఎఫ్కు భారీగా ప్రముఖుల విరాళాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు నిత్యావసరాల సర ఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఒకరోజు వేతనం అంటే రూ.48 కోట్లను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కారం రవీందర్‌రెడ్డి, మమత సీఎంకు అందజేశారు. సినీ హీరో నితిన్ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్–టీఎస్ సభ్యులు రూ.16 కోట్ల విరాళం ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి తన ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి కోసం చెక్కు రూపంలో సీఎంకు అందించారు. -
నిత్యావసర వస్తువుల తయారీకి ఆటంకం వద్దు
న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాల్లేకుండా చూడాలని పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కరోనా వైరస్ నియంత్రణ కార్యాచరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. టెక్నాలజీ సాయంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించాలని కోరారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొంత కాలం పాటు ఉంటుంది. వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడే ఈ సమయంలో ఉద్యోగులను తగ్గించుకోకుండా మానవీయంగా వ్యవహరించాలి. ఆర్థిక వృద్ధికి ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కోవిడ్–19 మహమ్మారి ఎదురైంది. ప్రపంచ యుద్ధ సమయాల్లో కంటే ఎంతో పెద్ద ఎత్తున ఇది సవాళ్లను విసురుతోంది’’ అని ప్రధాని పారిశ్రామికవేత్తలతో అన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ మూలస్తంభం విశ్వాసమేనని ప్రధాని వారికి గుర్తు చేశారు. పలు రంగాల్లో ఈ విశ్వాసం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. పర్యాటకం, నిర్మాణం, ఆతిథ్యం, రోజువారీ జీవనంతో ముడిపడిన అసంఘటిత రంగంపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అసోచామ్, ఫిక్కి, సీఐఐ, 18 రాష్ట్రాల నుంచి స్థానిక వాణిజ్య మండళ్ల ప్రతినిధులు ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. ద్రవ్యలోటును సడలించాలి: ఫిక్కి ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందకుండా, లక్ష్యాన్ని 2% పెంచాలని, తద్వారా వ్యవస్థలో రూ.4 లక్షల కోట్లు వస్తాయని ఫిక్కీ ప్రధానికి సూచించింది. కరోనాపై పోరాటంలో నిత్యావసరాలు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఔషధాలను తయారీ పెంచేందుకు తమ ప్లాంట్లను కేటాయిస్తామని, సీఐఐ అభయమిచ్చింది. -
లోకల్ మార్కెట్లోకి స్విగ్గీ
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుడ్ డెలివరీ సేవలకు మాత్రమే పరిమితమైన స్విగ్గీ మరిన్ని విభాగాల్లోకి విస్తరిస్తోంది. నిత్యావసరాలు, ఔషధాలు మొదలైన వాటి డెలివరీ సేవలకు సంబంధించి లోకల్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 15న వీటిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం స్థానిక సూపర్ మార్కెట్ చెయిన్స్, ఫార్మసీలు, మటన్ షాపులు, పెట్ స్టోర్స్, పూల విక్రేతలు మొదలైన వారితో స్విగ్గీ చేతులు కలపనున్నట్లు వివరించాయి. ప్రస్తుతం లోకల్ సర్వీసుల విభాగంలో డన్జో, మిల్క్‌బాస్కెట్, 1ఎంజీ వంటి సంస్థలతో స్విగ్గీ పోటీపడాల్సి రానుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. గూగుల్ తోడ్పాటు ఉన్న డన్జో.. ప్రస్తుతం స్థానిక కేర్‌టేకర్ తరహా కన్సీర్జ్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్, గుర్‌గ్రామ్, పుణే, చెన్నై తదితర నగరాల్లో విస్తరించింది. కొంత భిన్నమైన సర్వీసుల కారణంగా స్విగ్గీ రాక వల్ల డన్జోకి తక్షణం వచ్చిన ముప్పేమీ ఉండబోదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, ఫార్మసీ డెలివరీ స్టార్టప్ 1ఎంజీలాంటి వాటిపై ప్రభావం పడొచ్చని సంబంధిత వివరించాయి. ఖాళీ సమయాల సద్వినియోగం.. ప్రస్తుతం ఫుడ్ టెక్ కంపెనీగా స్విగ్గీ భారీ స్థాయిలో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీకి సంబంధించి చాలామటుకు యూజర్లు వారంలో కనీసం అయిదుసార్లయినా స్విగ్గీ ద్వారా ఆర్డర్లిస్తున్నారు. సగటు ఆర్డరు పరిమాణం రూ. 300 దాకా ఉంటోంది. అయితే, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటి నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి డెలివరీకి మధ్య ఇతరత్రా కార్యకలాపాలేమీ లేక ఖాళీగా ఉంటోంది. ఇప్పటికే దాదాపు ఒకే ప్రాంతం నుంచి వచ్చే బహుళ ఆర్డర్లన్నింటినీ బ్యాచ్‌ల కింద మార్చి డెలివరీ చేయడం ద్వారా సిబ్బంది సేవల సమయాన్ని మెరుగ్గా వినియోగించుకుంటోన్న స్విగ్గీ వ్యూహాలకు మరింత పదును పెట్టడం మొదలెట్టింది. ఇందులో భాగంగానే పుడ్ డెలివరీ మధ్యలో ఖాళీ సమయాన్ని గణనీయంగా సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. కేవలం ఫుడ్ టెక్ కంపెనీగానే మిగిలిపోకుండా ఇతరత్రా విభాగాల్లోకీ విస్తరించాలన్న ఉద్దేశంతోనే తాజాగా లోకల్ కామర్స్‌లోకి ప్రవేశించడానికి కారణంగా సంబంధిత వర్గాలు వివరించాయి. తాజా వ్యాపార వ్యూహంలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉంది. 2–3 శాతం కమీషన్.. ప్రారంభంలో అమ్మకాలు పెరిగేదాకా వెండార్ల నుంచి స్విగ్గీ స్వల్పంగా 2–3% కమీషన్ వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రతీ ఆర్డరు మీద డెలివరీ ఫీజు కూడా విధించవచ్చు. ప్రారంభంలో కొన్ని ఆఫర్లు ఇచ్చినా.. దశలవారీగా వాటిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ల డెలివరీ వ్యయాలను తట్టుకునేందుకు 2–3% కమీషన్ చార్జీలు సరిపోకపోయినప్పటికీ.. వ్యాపారం పెరిగే కొద్దీ చార్జీలను, కమీషన్‌ను కూడా పెంచవచ్చనే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా స్విగ్గీ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది. ప్రస్తుతం అత్యధిక యూసేజీ ఉన్న రెస్టారెంట్ల నుంచి ప్రతి ఆర్డరుపై దాదాపు 15 శాతం దాకా చార్జీ వసూలు చేస్తోంది. -
రాజీ
అస్సామీ మూలం : భాబేంద్రనాథ్ సైకియా అనువాదం: టి.షణ్ముఖరావు ఊతకర్రతో నడుస్తున్న గుడ్డివాడు హఠాత్తుగా తన పక్కనే ఏదైనా గలాటా వినపడగానే ముందుగా తన చేతికర్రని గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాతే అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదేవిధంగా ఆ ప్రాంతంలోని మహిళలు ఏ చిన్న సంఘటకైనా ప్రతిస్పందిస్తారు.సాధారణంగా వీరు తమ పిల్లల ఉనికిని పట్టించుకోరు. ఆకలి వేస్తే చాలు పిలవకుండానే ఇళ్లకు వస్తారని వారికి తెలుసు. కాని ఈరోజు గడబిడ వినగానే మహిళలంతా వారి గుడిసెల నుంచి పరుగులతో బయటకు వచ్చారు. తత్తరపాటుతో అటూ ఇటూ తిరుగుతూ తమ పిల్లలను పేర్లు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ప్రతి స్త్రీ తన పిల్లవాడు ఆ గుంపులో ఉన్నాడో లేడో దూరం నుంచే చూసి గుర్తు పట్టగలదు. కానీ అంతటితో తృప్తి పడదు. వాడి వద్దకు పరుగున వెళ్లి వాడి రెక్క పట్టుకుని గుంజుతుంది. గుంపు నుంచి దూరంగా లాక్కొనిపోయి నిలబెడుతుంది. ఆ తర్వాతనే అక్కడి కోలాహలానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు కూడా అక్కడ ఏదో జరిగింది. కొద్ది నిమిషాల్లోనే తల్లులందరూ తమ పిల్లల్ని పోగేసుకున్నారు. వారి పేర్లతో బిగ్గరగా పిలవడమూ ఆగిపోయింది. ఒక్క చీమోతీచీ అనే పిల్లవాడి తల్లి గొంతు మాత్రమే కీచుగా వినిపిస్తోంది. బిగ్గరగా పైకి లేస్తోంది. అక్కడి జనాల రణగొణ ధ్వనుల మధ్య నుంచి కూడా ఆమె సన్నని గొంతు స్పష్టంగా వినిపిస్తోంది.మొదట ఆమె ‘మోతీ... మోతీ’ అని అరిచింది. ఆందోళనతో పరుగులు పెట్టింది. ‘ఇప్పటి వరకు మోతీ మాతోనే ఇక్కడే ఉన్నాడు’ అని మోతీ తోటి పిల్లలు చెప్పారు. కానీ ఎక్కడ? ఏడీ మరి?అందరూ మోతీ ఇప్పుడే ఇక్కడే ఈ బరువైన బస్తాల పోగు వద్దనే ఉండే వాడని ముక్తకంఠంతో చెప్పారు.అది గౌహతీ పట్టణానికి శివారు ప్రాంతం. అక్కడ వేలాది జనాభాకు సరిపడే తిండిగింజలు, నిత్యావసరాలు నిల్వ చేసే గిడ్డంగులు ఉన్నాయి. అసంఖ్యాకమైన లారీలూ ట్రక్కులూ బస్తాలతో నిండుగా వచ్చి ఖాళీగా వెళతాయి. ఖాళీగా వచ్చి బస్తాలతో నిండుగా వెళతాయి. అక్కడొక ప్రధాన రహదారి ఉంది. దాన్ని ఆనుకుని గిడ్డంగులకు దారితీసే చిన్న సందులున్నాయి. వాటిని రోడ్లనడానికి వీల్లేదు. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. పరిసరాలు క్లీనర్ల అరుపులతో కలుషితమవుతాయి. ఆ ప్రాంతంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. సుమారు సగభాగం నల్లని ఆకుపచ్చని బురద నీటితో నిండి ఉంది. పిల్లలు మురికి పట్టిన వారి శరీరాల్ని ఆ నీటితోనే కడుక్కుంటూ ఉంటారు. ఆ ప్రదేశం చుట్టూ వెదురు, మట్టి, గోనెసంచులు, అట్టపెట్టెలతో నిర్మించిన గుడిసెలున్నాయి. ఒకప్పుడు ఆ గుడిసెల్లో కళాసీలు ఉండేవారు. ఇప్పుడు మాత్రం కొందరు స్త్రీలు వారి పిల్లలతో కలిసి వాటిలో నివసిస్తున్నారు. వారంతా కూలీ నాలీ లేక భిక్షాటన చేస్తుంటారు. మోతీ తల్లి వంటి కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా వయసు మళ్లిన స్త్రీలే. పిల్లలు కూడా రోడ్ల పక్కనే తిరుగుతుంటారు. ఆడుకుంటూ ఉంటారు. జామ్‌లో నిలిచిన ట్రక్కుల అడుగు భాగంలోని గింజలను తుడిచి తల్లులకు ఇస్తారు. లేదా చిన్న ఇనుపరాడ్లతో లారీల్లోని బస్తాలకు రంధ్రాలు చేస్తారు. బియ్యం, చక్కెర, పప్పులు వెలికితీసి సేకరిస్తారు.క్లీనర్లు అదిలించినట్లయితే దూరంగా పారిపోతారు. వారు ఏమరుపాటుగా ఉంటే తిరిగి చేరి తమ పని చేసుకుంటారు. పిల్లలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ జామ్ కావాలనే ప్రార్థిస్తూ ఉంటారు.నిజానికి ఈరోజు జామ్ అంత పెద్దది కాదు. రెండు లారీలూ ఎదురెదురుగా వచ్చి నిలిచిపోయాయి. కొంతసేపు ఇద్దరు డ్రైవర్లూ నీది తప్పంటే నీది తప్పని వాదించుకున్నారు. తన లారీ కదిలించనంటూ భీష్మించుకు కూర్చున్నారు.రెండోవైపు నుంచి బియ్యం బస్తాలతో వస్తున్న మరో లారీ తాలూకా ఎడమ చక్రం బురదలో దిగబడిపోయింది. లారీ కూడా ఒకవైపు ఒరిగిపోయింది. దానిపైనున్న బస్తాలు నేలమీద పడసాగాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న పిల్లలు బురదనీటి మీదుగానే దూరంగా పారిపోయారు. మోతీ చావుకేక మాత్రం దొర్లిపోతున్న బస్తాల శబ్దంలో కలిసిపోయింది. వాడిపైన బస్తాలు ఒకదాని తరువాత ఒకటిగా పడిపోయాయి.ప్రధాన రహదారి నుంచి జనం వచ్చి ఘటనాస్థలం వద్ద గుమిగూడారు. మోతీ తల్లి ఏడుపు విన్న వారంతా పిల్లవాడి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. బస్తాల్ని ఒక్కొక్కటీ తొలగించడం ప్రారంభించారు. మొదట మోతీ పాదాలు కనపడ్డాయి. చివరి బస్తా కూడా తీసేసరికి అక్కడి మనుషులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. ఇక ఆరోజు రవాణా ఆగిపోయింది. అప్పటికే సాయంకాలమైంది. ప్రధాన రహదారి మీద కూడా లారీలు వరుసగా నిలిచిపోయాయి. నుజ్జు నుజ్జయిన మోతీ ఎముకల్నీ మాంసాన్నీ పోగు చేసిన పోలీసులు వాటిని ఒక బస్తాలో వేసి హాస్పిటల్‌కు తరలించారు. మోతీ తల్లి వెర్రిగా రోదిస్తుండగా చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె స్పృహ తప్పిపోయింది. ఎవరూ చాలా రాత్రి వరకు నిద్రపోలేకపోయారు. కొందరైతే నెత్తీ నోరూ కొట్టుకుని రోదిస్తున్న మోతీ తల్లి వద్దనే ఉండిపోయారు. ఆలస్యంగా నిద్రపోయినప్పటికీ ఉదయాన్నే తొందరగా లేచారు. పెద్దవారంతా సూది మొనగల ఇనుప కడ్డీలూ బుట్టలూ పట్టుకొని బస్తాల వద్దకు చేరిపోయారు. వీలైనంత వరకు బియ్యం పప్పులూ చక్కెరా సేకరించుకున్నారు. మోతీ రక్తంతో తడిసిన బస్తాను మాత్రం ఎవరూ ముట్టుకోలేదు.రెండోరోజు కొద్దిమంది దర్జా దుస్తులు ధరించిన వ్యక్తులు ఘటనాస్థలానికి వచ్చారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలీదు. పడి ఉన్న బస్తాల్ని కూలీల చేత ఎత్తించారు. ఇద్దరు కూలీలు మోతీ రక్తపు మరకలున్న బియ్యపు బస్తాని మోసుకొచ్చి మోతీ తల్లి పాకలో పెట్టారు. బహుశా మోతీ ప్రాణం ఖరీదు ఒక బియ్యపు బస్తాగా ఆ పెద్దలు నిర్ధారించారు. ఆమె వెర్రిదానిలా లేచి ఏడుస్తూ ‘వద్దు... వద్దు... నాకీ బస్తా వద్దు’ అని అరవడం మొదలుపెట్టింది. ఆ బస్తా మీద పడి రోదించసాగింది. కూలీలు రక్తపు మరకలున్న భాగాన్ని గోడవైపు పెట్టారు. ఆరోజంతా ఆమె తన నులకమంచం మీదనే కూర్చుని ఏడవసాగింది. ఆ బస్తా వైపు చూడలేకపోయింది. తిండి తినలేదు.నిద్రపోలేదు. చాలారోజుల వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. ‘నాకే బస్తా వద్దు. తీసుకుపొండి... తీసుకుపొండి’ అని అరుస్తూనే ఉంది. మోతీ తల్లికి తన పల్లెలో తల్లిదండ్రులెవరూ లేరు. ఆమె తన పినతండ్రి వద్ద పెరిగింది. అతనికి పప్పుధాన్యాలు పండించడంలో సహాయపడేది. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లేవదీసుకొచ్చాడు. కాని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. మోతీ పుట్టిన ఇన్ని సంవత్సరాలుగానూ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. లారీల వారికి మురీమిక్చర్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటోంది. ఒంటరి స్త్రీ కనుక డ్రైవర్లూ క్లీనర్లూ పరాచికాలాడేవారు. ‘వాడు మరి రాడు. మాలో ఎవర్నైనా ఎంపిక చేసుకో’ అనేవారు. మిగిలినవారు నవ్వేవారు. కానీ మోతీ తల్లి స్పందిచేది కాదు. కోపంగా చూసేది.నిజానికి అలా ఒంటరిగా జీవించడానికి ఆమె దిగులు పడుతూ ఉండేది. చుట్టూ ఉన్న మగవారన్నా భయపడేది. మోతీ తలను గుండెకు హత్తుకుని నిద్రపోయేది. మోతీయే ఆమె ఆశ. ఆమోతీయే ఆమె ప్రాణం.కొడుకు మగనికన్నా విలువైన వాడు. ఆమె చెవికి అమ్మా అనే పిలుపు ఎప్పుడూ వినపడుతూ ఆసరాగా ఉంటుందని భావించింది. ఆ ఆశ ఇప్పుడు అడియాస అయింది.మోతీ దుర్మరణంతో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆ పాకను ఆవరించింది. ఆమెలో ఒక భయానకమైన శూన్యం ఏర్పడింది. పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. మొదట్లో ఆ బస్తా వైపు చూస్తూ నెమ్మదిగా ఏడ్చేది. ఇప్పుడు మౌనంగానే రోదిస్తోంది. ఇరుగు పొరుగువారు బిచ్చమెత్తి తెచ్చిన గింజల్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు ఏదో వండుతుంది. కానీ తినదు. కొన్నిసార్లు వంటే చెయ్యదు. అసలు ఆమెకు ఆకలే లేకుండాపోయింది. ఏ లారీ నుంచి బస్తాలు మోతీ మీద పడ్డాయో ఆ లారీ క్లీనరు తరచుగా ఆమెను చూడటానికి వచ్చేవాడు. తినుబండారాలనూ తెచ్చేవాడు. చనువుగా మాట్లాడబోయేవాడు. కానీ మోతీ తల్లి అతనితో ముభావంగా ఉండేది.ఎక్కువగా మాట్లాడేది కాదు. రోజులు గడుస్తున్నాయి. ఆమె ఎప్పుడూ ఆకలితోనే ఉంటోంది. ఇరుగు పొరుగు వారి సహాయమూ ఆగిపోయింది. ఒక రోజు ఎలుకలు ఆ బస్తాకు రంధ్రం చేసినట్టు ఆమె గుర్తించింది. ప్రతిరోజూ ఉదయం కొంచెం బియ్యం గింజలు బస్తా పరిసరాల్లో పడి ఉంటున్నాయి. ఆ బియ్యాన్ని ఆమె చీపురుతో తుడిచేది. అప్పుడు ఆమె కళ్లు కన్నీళ్లతో తడిసేవి.ఒకరోజు ఆమెకు ఆకలి దహిస్తోంది. మంచం మీద అదే పనిగా అశాంతిగా దొర్లసాగింది. కొంతసేపటి తర్వాత లేచింది. ఒక వెదురు చేటను ఆ బస్తా వద్ద పెట్టింది. ఎలుకలు చేసిన రంధ్రం గుండా తన చూపుడు వేలిని చొప్పించి నెమ్మదిగా కదిలించింది.గుప్పెడు బియ్యం పోగవడానికి చాలాసేపు పట్టింది. ఆ బియ్యంతోనే ఆ పూట గడిచింది. అప్పడప్పుడూ క్లీనరు వస్తూనే ఉన్నాడు. ఏదో తెస్తూనే ఉన్నాడు. కానీ తీసుకోవడానికి ఆమె అంత ఇష్టపడేది కాదు.ఎలుక వల్లనో, ఆమె వేలి వల్లనో బస్తాకున్న రంధ్రం పెద్దదయింది. బియ్యమూ ఎక్కువ మొత్తంలో కింద పడ్డాయి. ఆ విధంగా బియ్యాన్ని వృథా చేయడం ఆమెకు నచ్చలేదు. బస్తాపై ఒక గుడ్డను కప్పి రంధ్రాన్ని మూసివేసింది. కొన్నిసార్లు క్లీనరు అనేవాడు ‘ఒక్క బియ్యంతో ఎలా బతుకుతావు? పప్పులూ కూరగాయలూ కూడా నన్ను తేనివ్వు’. కానీ మోతీ తల్లి ఏమీ జవాబు చెప్పేది కాదు. రోజులు గడుస్తున్నాయి.బస్తాకున్న రంధ్రం అవసరం లేకుండానే బియ్యం చేతికి అందుతున్నాయి. బస్తా చిన్నదైపోయింది. ఒకరోజున ఆమె భుజాల వరకు చేతిని చొప్పించింది. కానీ చాలినన్ని బియ్యం రాలేదు. ఉన్న కొద్దిపాటి బియ్యమూ బస్తా కుట్లలో ఇరుకున్నాయి. అప్పుడామె బస్తా మూతి వద్ద ఉన్న కుట్లను విప్పింది. బస్తాని తిరగేసి దులిపింది. సాయంత్రం తిండికి సరిపడా గింజలు రాలాయి. వాటిని చీపురుతో తుడిచింది. చేటతో చెరిగి చెత్తను తీసేసింది.ఖాళీ గోనె సంచిని ఎండలో పెట్టింది. రక్తపు మరకల భాగాన్ని నేలవైపు ఉంచింది. సాయంత్రం ఆ బస్తాను దులిపి తను పడుకునే నులకమంచం మీద పరుచుకుంది.కొంచెం ఎంగిలిపడి మంచంపైకి చేరింది. వాతావరణంలో చలి గుడిసెలోనికి చొచ్చుకొస్తోంది. గత కొద్దిరోజులుగా చలి మరింత తీవ్రమవుతోంది. గతంలో మోతీ ఆమెను హత్తుకుని పడుకునేవాడు. కాబట్టి ఆమెకు చలి బాధ తెలిసేది కాదు. కింద పరుపుగా ఉన్న గోనెసంచి కూడా చలి నుంచి కొద్దిగానే రక్షిస్తోంది.కానీ ఆమె మనసు వికలమవుతోంది. ఒంటరితనం గుండెల్లో దిగులు పుట్టిస్తోంది. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.అంతలోనే ఒక ఎలుక గతంలో బస్తా ఉన్న చోటికి రావడం ఆమె గమనించింది. ఆ ఎలుకను అదిలించడానికి మోతీ ఆమె పక్కన ఇప్పుడు లేడు. మోతీ లేని లోపం బాధగా మారిఆమెను మరింతగా దహించేస్తోంది. ఆమె ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఏమైనా ఆమెకొక ఓదార్పు కావాలి. ఆమె జీవితానికొక ఆశాజ్యోతి కావాలి. వార్ధక్యానికి ఆసరా కావాలి. ఆ దశలోనే ఆమె ఇలా అనుకుంది.. ‘ఈసారి ఆ క్లీనరు వచ్చి బియ్యం పప్పులూ ఇస్తానంటే వద్దనను. తెచ్చివ్వమనే అంటాను. అది కూడా మరో మోతీ కోసమే... మోతీ కోసమే..’ -
తిత్లీ సాయం.. తమ్ముళ్లు స్వాహా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను వణికించిన ప్రకృతి విపత్తులోనూ ‘పచ్చ’దండు కాసులవేటలో నిమగ్నమైంది. తిత్లీ తుపాన్ బాధితులకు అందించాల్సిన బియ్యం, కందిపప్పు, పంచదార, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపల్లోనూ అధికార పార్టీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆలస్యంగా, అరకొరగా వచ్చే సాయాన్ని సైతం పక్కదారి పట్టిస్తుండటంపై బాధితుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. పంపిణీ చేయాల్సిన మండలాలు 28 శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వల్ల 11 మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. అనంతరం వరదల వల్ల 13 మండలాల్లో నష్టం ఏర్పడింది. మత్స్యకారులు ఉన్న ఎచ్చెర్ల, రణస్థలం మండలాలతో కలిపి మొత్తం 26 మండలాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. వరదలతో దెబ్బతిన్న మెళియాపుట్టి, సారవకోట మండలాలను ప్రభావిత ప్రాంతాల్లో చేర్చకపోవడంతో వైఎస్సార్ సీపీ ఆందోళన నిర్వహించడంతో వీటిని కూడా దెబ్బతిన్న మండలాల జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో జిల్లాలోని మొత్తం 38 మండలాల్లో తుపాను బాధితులకు సరుకులు పంపిణీ చేయాల్సిన మండలాల సంఖ్య 28కి చేరింది. అందాల్సిన సరుకులు ఇవీ... శ్రీకాకుళం జిల్లాలో తుపాను, వరద ప్రభావిత మండలాల్లో 2,81,869 కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం, మిగతావారికి 25 కిలోల చొప్పున బియ్యం, కిలో పామాయిల్, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, అరకేజీ పంచదార ఇవ్వాలి. ఈ లెక్కన బియ్యం 6,720 మెట్రిక్ టన్నులు, పామాయిల్ 2,81,869 కిలోలు, 2,81,869 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు దాదాపు 1.45 లక్షల కిలోల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. కానీ బుధవారం నాటికి బియ్యం 55 శాతం, పంచదార 13 శాతం, కందిపప్పు 9 శాతం, ఉల్లిపాయలు 6 శాతం, పామాయిల్ 5 శాతం, బంగాళాదుంపలు 5 శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ప్రధానంగా వరద బాధిత మండలాలకు సరుకులు చేరలేదు. పంచదార ఇప్పటివరకూ గార, ఎల్ఎన్ పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, కొత్తూరు మండలాల్లో ఒక్క కుటుంబానికీ పంపిణీ కాలేదు. కందిపప్పు శ్రీకాకుళం, గార, సరిబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, కొత్తూరు మండలాల్లో పంపిణీ కాలేదు. వంటనూనె, బంగాళాదుంపలు శ్రీకాకుళం, గార, సరిబుజ్జిలి, ఎల్ఎన్ పేట, నరసన్నపేట, పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, హిరమండలం, కొత్తూరు మండలాల్లో పంపిణీ చేయలేదు. వీటితోపాటు ఆమదాలవలస మండలంలోనూ ఉల్లిపాయలు ఇప్పటివరకూ బాధితులకు పంపిణీ కాలేదు. సగం మందికే సాయం తుపాను సమయంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున ఐదు రోజులపాటు ప్రభుత్వం ఉచితంగా అందజేయాలి. తిత్లీ తుపానుతో సుమారు ఆరు రోజుల పాటు వేట కోల్పోయిన 11 మండలాల్లోని కుటుంబాలకు సరుకులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, నూనె, బంగాళాదుంపలు సగంమందికే అందాయి. ఉచితమే వారికి ఆయాచితం... తుపాను సమయంలో ఇచ్చే ఉచిత సరుకులు టీడీపీ కార్యకర్తలకు ఆయాచిత వరంగా మారాయి. రేషన్ డీలర్లపై ఒత్తిడి తెచ్చి సరుకుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లొంగనివారిపై కేసులు బనాయించి దారికి తెచ్చుకుంటున్నారు. తూకంలోనూ తేడాలు ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అరకొరగా ఇస్తూ మిగిలిన సరుకులు తర్వాత తీసుకోవాలని జన్మభూమి కమిటీ సభ్యులు చెబుతుండటంతో బాధితులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. 25 కిలోలకుగానూ 21 కిలోలే బియ్యం ఉంటున్నాయి. ఈ–పాస్‌తో సంబంధం లేకుండా నేరుగా సరుకులు పంపిణీ చేస్తుండటంతో జన్మభూమి కమిటీలు ఆడింది ఆటగా మారింది. సాయంలోనూ దోచుకుంటున్నారు.... తుపాను వల్ల పూర్తిగా నష్టపోయాం. ఉచిత సరుకుల పంపిణీలోనూ దోచుకుంటున్నారు. పాతిక కిలోలు బియ్యం ఇస్తామన్నా 21 కిలోలే ఇస్తున్నారు. మిగతా సరుకులు కూడా తక్కువగా ఉన్నాయి. – ఎస్.సత్యనారాయణ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా అర కిలో ఇచ్చారు... తుపాను వల్ల గిరిజన గ్రామాల్లో అంతా నష్టపోయాం. బంగాళాదుంపలు, కందిపప్పు, ఉల్లిపాయలు కిలో చొప్పున ఇవ్వాల్సి ఉన్నా మాకు అరకిలో మాత్రమే ఇచ్చారు. అదేమని అడిగితే అంతే ఇస్తామని చెబుతున్నారు. – గంటా ధర్మారావు, భీంపురం, టెక్కలి మండలం కచ్చితంగా పంపిణీ అయ్యేలా చూస్తాం... తుపాను, వరద బాధితులు, మత్స్యకారులకు నిర్దేశించిన ప్రకారం నిత్యావసర సరుకులు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పంపిణీ జరిగేలా చూస్తాం. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవు. – కె.ధనంజయరెడ్డి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ -
ముంపు గ్రామాలు బిక్కుబిక్కు
(శ్రీకాకుళం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గాఢాంధకారంలో ఎప్పుడు ఏ పాములు వచ్చి కాటేస్తాయో? ఏ విష పురుగులు కరుస్తాయోననే భయంతో వారు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులు తుపాను నీటిలో మట్టికొట్టుకుపోయాయి. చుట్టూ వరద నీరున్నా తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకని దుర్భరమైన పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ‘తిత్లీ’ ముంపు బాధిత గ్రామాల ప్రజలు రెండు మూడ్రోజులుగా అనుభవిస్తున్న నరకయాతన ఇది. వర్షం పూర్తిగా ఆగిపోయి రెండ్రోజులైనా.. వరదనీరు కొంత తెరిపిచ్చినా కనీసం మంచినీరుగానీ, నిత్యావసర సరుకులుగానీ.. ఆహార పదార్థాలుగానీ అందని దుర్భర పరిస్థితి వారిది. 12వ తేదీ మధ్యాహ్నానికే వర్షం ఆగిపోయినా వంశధార, నాగావళి ముంపు ప్రాంతాలు, టెక్కలి నియోజకవర్గంలోని చాలా పల్లెల వైపు శనివారం సాయంత్రం వరకూ అధికారులు దృష్టిసారించలేదు. తమ గ్రామాలకు ఇప్పటివరకూ ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ, అధికారిగానీ రాలేదని నందిగామ మండలం ఉయ్యాలపేట, టెక్కలి మండలం గంగాధరపేట తదితర గ్రామాల వారు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు. పొంచి ఉన్న వ్యాధుల ముప్పు తిత్లీ తుపానువల్ల ఎగువ ప్రాంతమైన ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో వంశధార, నాగావళితోపాటు ఉద్దానంలో వాగులు, వంకలు, గెడ్డలు ఉప్పొంగడంతో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, నందిగామ, సురుబుజ్జిలి, కవిటి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర మండలాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంవల్ల రవాణా సౌకర్యం తెగిపోయింది. వరదనీటితో బావులు, బోర్ల నీరు కలుషితమై బుదరమయంగా మారింది. కనీసం క్లోరినేషన్‌కు కూడా దిక్కులేదు. ఈ నీరు తాగితే డయేరియా, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో బాధితులు వాటినే ఆశ్రయిస్తున్నారు. పొలాల్లోనూ, రహదారులపైనా నీరు ఎక్కువ రోజులు నిలిచిపోవడం.. కూలిన చెట్ల ఆకులు, అలములు వాటిలో కుళ్లిపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఫలితంగా దోములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడేం కాటేస్తుందో? కుండపోత వర్షాలతో వంశధార, నాగావళి.. ఇతర వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో అడవుల్లోని పాములు పెద్ద సంఖ్యలో కొట్టుకువచ్చాయి. ఇవి ఇళ్లలోకి వచ్చి ఎక్కడ కాటేస్తాయోనని ముంపు గ్రామాల వారు బెంబేలెత్తిపోతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ ఇంకా జరగకపోవడంతో టెక్కలి లాంటి పట్టణంతోపాటు అనేక గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. అలాగే, విష పురుగులు వణికిస్తున్నా కనీసం తమకు కొవ్వొత్తులు ఇచ్చే నాధుడులేడని బాధితులు చెబుతున్నారు. చీకటి పడ్డాక బయటకు వెళ్లాలంటే ఏ పురుగు, ఏ పాము కాటేస్తాయోనని భయమేస్తోందని గంగాధరపేటకు చెందిన ఒక వృద్ధుడు అన్నాడు. మంచి నీరైనా అందించండి బాబూ.. ఇదిలా ఉంటే.. తమకు కనీసం మంచినీరైనా అందించాలని ముంపు గ్రామాల వారు చేతులెత్తి వేడుకుంటున్నారు. గెడ్డలు, బావుల్లో నీరు తాగాలంటే భయమేస్తోందని.. ఒక్కో ఇంటికి ఒక్కో టిన్ను (రక్షిత) నీరైనా అందించాలంటున్నారు. కొందరు మట్టి నీరు తాగలేక రెండు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి బోరు నీటిని కావడిపై తెచ్చుకుంటున్నారు. ప్రతి ఇంటికీ 25 కిలోల (మత్స్యకారులకు 50 కిలోలు) బియ్యం, కందిపప్పు, వంట నూనె, చింతపండు తదితర నిత్యావసర సరుకులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా అవి ఎక్కడా అందిన దాఖలాల్లేవు. మరోవైపు.. టెక్కలి మండలంలోని గంగాధరపేటకు వెళ్లే రహదారి వరదతో కొట్టుకుపోయింది. దీంతో టెక్కలి–నౌపడ మధ్య రైలు మార్గం కూడా దెబ్బతింది. దీనివల్ల గంగాధరపేటకు రాకపోకలు తెగిపోయాయి. గ్రామస్తులు నిత్యావసర సరుకులు, తాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. నందిగామ మండలంలోని ఉయ్యాలపేట వాసులదీ ఇదే దుస్థితి. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి తదితర మండలాల్లో ఇలాంటి గ్రామాలు అనేకం. ఈ గ్రామాలకు కూడా ఇప్పటివరకూ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ వెళ్లి బాధితులను పరామర్శించి సహాయ చర్యలు చేపట్టలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు తాగునీరు, నిత్యావసరాల కోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. మా గ్రామంలోకి శనివారం రాత్రి వరకూ ఎవ్వరూ రాలేదు. లంచాలు తీసుకుని ప్రభుత్వ భూముల్లో రొయ్యల చెరువుల ఏర్పాటుకు సహకారం అందించి మమ్మల్ని ముంపులో పడేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇప్పుడు మాలాంటి పేదల కష్టాలు కనిపించడంలేదు. – లండ శ్రీకాంత్, నందిగామ మండలం, ఉయ్యాలపేట -
19 నెలల్లో 1,900 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాలశాఖలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 19 నెలల క్రితం ఆ శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలు మొదలయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చేపట్టిన సంస్కరణలు పలువురి ప్రశంసలు పొందాయి. ఆన్లైన్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కమాండ్ కంట్రోల్ సెంటర్, గోదాముల్లో సీసీ కెమెరాలు, టీ–రేషన్ యాప్, రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రేషన్ పోర్టబిలిటీ వంటి చర్యలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ఈ సంస్కరణలతో 19 నెలల్లో ఏకంగా రూ. 1,900 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా జరిగింది. నిఘా బృందాలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాకు ముగింపు పలికారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముకుంటున్న ఆరుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించారు. రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. 171 గోదాముల్లో 17,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, హైదరాబాద్‌లోని కేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టారు. రేషన్ లబ్ధిదారులు తమ జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని విస్తరించనున్నారు. రాష్ట్రంలో 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 800 కోట్ల వరకు ఆదా అవుతోంది. కార్డుదారులకు త్వరితగతిన సరుకులు అందించడానికి వీలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. ఆన్లైన్లో కనీస మద్దతు ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు, చెల్లింపుల విధానం ప్రాచుర్యం పొందింది. 2016–17 ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో 15 లక్షల మంది రైతుల నుంచి రూ. 11 వేల కోట్ల విలువ చేసే 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట వేశాం రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్ఫలితాలను సాధించాం. సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. అర్హులైన పేదలందరికీ సక్రమంగా సరుకులు అందివ్వగలుగుతున్నాం. సాంకేతికతతో అక్రమాలను అరికడుతూనే నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. – సీవీ ఆనంద్, పౌర సరఫరాలశాఖ కమిషనర్ -
ధరల మంట
పటాన్చెరు టౌన్: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజురోజుకూ మార్కెట్లో పెరుగుతున్న రేట్లను చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలకు పిండివంటలు చేసి పెడదామని ఆశపడ్డ తల్లులు పెరిగిన ధరలకు చూసి బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటివరకు కిలో రూ.70 ఉన్న నూనె ధర ప్రస్తుతం రూ.85కి పెరిగింది. బియ్యం కిలో రూ.38 ఉండగా రూ.45 చేరింది. నువ్వులు కిలో రూ.100 ఉండగా ప్రస్తు తం రూ.120పైనే పలుకుతోంది. బెల్లం కిలో రూ.40 ఉండగా రూ.50పైగా విక్రయిస్తున్నారు. సం క్రాంతి పం డగకు వినియోగించే నూనెలు, నువ్వులు, పెసరపప్పు ధరలు అమాంతం పెరిగాయి. పిండివంట లు ప్రియం కావడంతో అవి లేకుండా పండుగ చేసుకో వాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలు జరుపుకొనే పండుగ.. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చిన తర్వాత వచ్చే పండగ సంక్రాంతి. రైతులు ఈ పండగను అనందోత్సహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలువులు ఇవ్వనుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి కనిపిస్తుంది. పండగకు ఇంటింటా పిండివంటల ఘమఘమలు వెదజల్లుతుంటాయి. ఈ ఏడాది ఆశించిన పంట దిగుబడుల రాకపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. మరోవైపు నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండడంతో పండుగ ఎలా జరుపుకునేదని గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. పిండివంటలో పండుగ ఘనంగా చేసుకోవాలంటే అప్పు చేయక తప్పదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ ఎలా చేసేది? నిన్న మున్నటి వరకు పెరసపప్పు కిలో రూ.60 ఉంటే ఇప్పుడు కిలో రూ.75కు చేరింది. నూనె ధర అమాంతం పెరిగింది. పిండివంటలు చేసుకుందామంటే పామాయిల్ ధరలు కూడా అందిరావడం లేదు. అన్ని ధరలు ఇలా పెరిగితే పండుగ ఎలా చేసుకునేది. పండుగకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను ప్రభుత్వం తక్కువ ధరలకు అందజేయాలి. – కొత్తకోట రాజేశ్వరి, గృహిణి రూ. వేలల్లో ఖర్చు చేయాలి రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో భయమేస్తోంది. పిండివంటలతో పండుగా వైభవంగా జరుపుకోవాలంటే వందల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేలా ఉంది. కొత్త పంటలు చేతికి వచ్చే సమయంలో పండుగకు ధరలు దిగుతాయనుకుంటే పెరిగాయి. – సుధారాణి గృహిణి ధరలు ఇలా.. సరుకు రెండు నెలల క్రితం ప్రస్తుతం నువ్వులు 100 120 బియ్యం బీపీటీ 35 40 బియ్యం హెచ్ఎంటీ 44 48 సన్‌ఫ్లవర్ నూనె 75 85 పామాయిల్ 60 70 కందిపప్పు 65 70 పెసరపప్పు 68 75 మినుపపప్పు 70 75 -
లగ్జరీ.. జూబ్లీహిల్సే మరి..
సాక్షి, హైదరాబాద్: లగ్జరీ నివాసాలు... హై ఎండ్ షోరూమ్‌లు... నిత్యావసర సరుకులు.. గృహోప కరణ వస్తువులు.. బ్రాండెడ్ దుస్తులు... వాహనాలు... గుండు సూది నుంచి బెంజ్ కార్ల వరకు సంపన్నుల చిరునామాగా నిలుస్తోందీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్. ఇందులోనూ జూబ్లీహిల్స్ రోడ్ నం.36 దేశంలోనే లగ్జరీకి సింబల్‌గా నిలుస్తోంది. దేశంలోని మెట్రో నగరాల్లో హైఫై ప్రాంతాలను గుర్తించేందుకు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ తాజాగా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో ముంబైలోని పోవాయ్, బ్రీచ్ క్యాండీ ప్రాంతాలు తొలిస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఢిల్లీలోని మెహర్‌చంద్ మార్కెట్.. రెండో, బెంగళూరులోని ఇందిరానగర్.. మూడో, గుర్గావ్లోని గలేరియా మార్కెట్.. నాల్గో స్థానంతోపాటు.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ఐదో స్థానంలో నిలిచింది. చాలా రిచ్ ఏరియా.. జూబ్లీహిల్స్ రోడ్ నం.36 ప్రాంతం సుమారు 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 5,000 లగ్జరీ నివాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సుమారు వందకుపైగా హై ఎండ్ రిటైల్స్టోర్లు, షోరూమ్‌లు, మాల్‌లు, పబ్‌లు, స్టోర్లున్నాయి. వీటిలో దుస్తులు, ఫ్యాషన్ వస్త్రాలు, నిత్యావసరాలు, కాఫీ షాప్‌లు, షూజ్, వాచెస్, డైమండ్స్, ఆభరణాలు, బెంజ్‌కార్లు, ర్యాప్టర్ వంటి విదేశీ బైక్ షోరూమ్‌లు సహా దేశంలో అన్ని రకాల లిక్కర్, వైన్, రమ్, జిన్ తదితర బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయి. అలాగే విదేశీ మద్యం సైతం లభ్యమయ్యే అతిపెద్దదైన టానిక్ లిక్కర్‌మాల్, అతిపెద్ద జూబ్లీ 800 పబ్ సైతం ఇక్కడే ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్ ఇళ్లు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.25 కోట్లు వెచ్చించాల్సిందేనని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దె నెలవారీగా రూ.లక్షకు పైమాటే. వాణిజ్య స్థలాలకు కూడా నెలకు రూ.లక్షల్లో చెల్లించాల్సిందే. ఇక ఈ ప్రాంతంలో చదరపు గజం స్థలం కొనుగోలు చేయాలంటే రూ.2 లక్షలు వెచ్చిం చక తప్పదు. హైపర్ మార్కెట్లు, జాయింట్ హైపర్ మార్కెట్లు, ఫ్యాషన్ స్టోర్లు, బోటిక్స్‌కు ఈ ప్రాంతం నిలయంగా మారినట్లు సర్వే వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు సహా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పని చేస్తున్న సీఈఓలు, ఉన్నతోద్యోగులు, బడా కాంట్రాక్టర్లు, బహుళ జాతి కంపెనీల సీఈఓలు సైతం ఇక్కడ తమ శాశ్వత చిరునామా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో హైఎండ్ రిటైల్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని అనరాక్ రియల్టీ సంస్థ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
ఇంటి బిల్లు దిగొచ్చింది!
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, సామాన్యులు ఎక్కువగా వినియోగించే 200కుపైగా రకాల ఉత్పత్తులు కాస్త చౌకగా మారాయి. వీటీపై జీఎస్టీ తగ్గింపు బుధవారం (ఈ నెల 15) నుంచి అమల్లోకి వచ్చింది. షాంపూలు, డిటర్జెంట్లు, సౌందర్య ఉత్పత్తుల ధరలను సవరించినట్టు పెద్ద పెద్ద రిటైల్ మాల్స్ బోర్డులు పెట్టి మరీ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. చాక్లెట్లు, ఫర్నిచర్, చేతి గడియారాలు, కట్లరీ వస్తువులు, సూట్‌కేసులు, సెరామిక్ టైల్స్, సిమెంట్ ఆర్టికల్స్ ఇలా 200కుపైగా వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తూ గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక మందగమన నేపథ్యంలో వ్యాపారులు, వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 178 నిత్యావసరాలను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. అన్ని రెస్టారెంట్లకు (ఏసీ, నాన్ఏసీ) ఏకరీతిన 5 శాతం పన్నుగా ఖరారు చేశారు. గతంలో ఏసీ రెస్టారెంట్లపై 18 శాతం పన్ను, నాన్ఏసీ రెస్టారెంట్లపై 12 శాతం పన్ను అమల్లో ఉంది. 28 శాతం పన్ను పరిధిలో 228 వస్తువులు ఉంటే వాటిని 50కి పరిమితం చేశారు. విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, పెయింట్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, కార్లు, బైక్‌లపైనే అధిక పన్ను ఉంది. మిగతా వాటిని 18, 12, 5 శాతం పన్ను పరిధిలోకి సర్దుబాటు చేశారు. చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ, కస్టర్డ్ పౌడర్, మార్బుల్స్, గ్రానైట్, దంత సంరక్షణ ఉత్పత్తులు, పాలిష్‌లు, క్రీములు, శానిటరీవేర్, లెదర్ వస్త్రాలు, కృత్రిమ ఉన్ని, కుక్కర్లు, స్టవ్‌లు, బ్లేడ్స్, స్టోరేజీ వాటర్ హీటర్లు, బ్యాటరీలు, తదితర ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి దిగొచ్చింది. వైర్లు, కేబుల్స్, ఫర్నిచర్, పరుపులు, సూట్‌కేసులు, డిటర్జెంట్, షాంపూలు, మెయిర్ క్రీమ్, హెయిర్‌డై, ఫ్యాన్లు, రబ్బరు ట్యూబులు తదితర ఉత్పత్తులను 18 నుంచి 12 శాతానికి తీసుకొచ్చారు. -
అంతా గోల్మాల్..!
నల్లగొండ టూటౌన్ : కాలం మారింది.. వాటితో పాటే జనం మారుతున్నారు..అంతా ఉరుకుల పరుకుల జీవితం..వినియోదారులు ఇలా వచ్చి అలా వస్తువులు తీసుకుపోతున్నారు. ఈ మార్పును గమనించిన వ్యాపారులు ప్రజల అవసరాలను ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నారు. కిరాణా షాపుల్లో ఏ వస్తువు విక్రయించినా దాని మీద పూర్తి వివరాలు ఉండాలి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అవి కనిపించడం లేదు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు రాలేదనే ఒక్క మాటతో సరిపెట్టుకుంటున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత అధికారులు చిరు వ్యాపారులపై అడపా దడపా దాడులు చేసి కేసులు చేస్తున్నారే తప్ప రూ.లక్షల వ్యాపారం చేసే వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండానే.. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, హాలియ, నకిరేకల్, దేవరకొండ తదితర పట్టణాల్లో కిరాణా వ్యాపారం ప్రతి రోజు లక్షల్లో జరుగుతోంది. ఆయా పట్టణాల్లో ఎక్కువ శాతం దుకాణాల్లో ప్యాకేజీ చేసిన నిత్యవసర వస్తువులు దర్శనమిస్తున్నాయి. నిత్యవసర వస్తువులను ప్యాకేజీ చేయాలంటే తప్పని సరిగా తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే తమ తమ దుకాణాల వెనకనో లేదా మరో చోటనే కంది పప్పు, పెసర పప్పు, మైనం పిండి, మినుప గుండ్లు, చక్కెర, గోదుమ పిండి తదితర వాటిని స్వయంగా వ్యాపారులే తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ని పప్పు ధాన్యాలను బస్తాల్లో తెచ్చి స్థానికంగా ఒక కిలో, అరకిలో ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. ప్యాకేజీ చేయడానికి జిల్లాలో ఒక్క దుకాణానికి కూడా జిల్లా తూనికల కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. కార్పోరేట్ దుకాణాల వారికి మాత్రమే తూనికలు కొలతల శాఖ నుంచి అనుమతి ఉంది. జిల్లా వ్యాప్తంగా చిన్నవి, పెద్ద కిరాణా దుకాణాలు కలిపి సుమారు 5200 వరకు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో అతి పెద్దవైన 450 దుకాణాదారులు స్వయంగా ప్యాకేజీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రణ లేని ప్యాకేజీ విధానం ... ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నిత్యవసర వస్తువుపై కచ్చితంగా సంబంధిత కంపెనీ చిరునామాతో పాటు పూర్తి వివరాలు ఉండాలి. ప్రతి ప్యాకెట్‌పై ధర, దాని బరువు, ఎప్పుడు ఎక్కడ తయారు చేసింది .. తేదీ, కంజూమర్ నంబర్ తదితర వివరాలతో కూడిన ముద్రణ ఉండాలి. ఆయా ప్యాకెట్లపై ఏవిధమైన వివరాలు లేకుంటే జీరో దందా కిందకు వస్తుంది. అదే విధంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే ప్యాకేజీ తయారు చేయడం వలన తూకాల్లో కూడా తేడాలు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఆయా కిరాణ దుకాణాదారులు కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు కూడా ఇస్తున్న పాపాన పోవడంలేదు. అక్రమ దందాలో రాటుతేలిన కొంత మంది వ్యాపారులు ఇటు వినియోగదారులను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సబంబంధిత అధికారులు మేల్కొని బడా వ్యాపారుల అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
GST గందరగోళం
►గ్రేటర్ సామాన్య, వ్యాపార వర్గాల్లో గందరగోళం ►లాభ నష్టాలపై బేరీజు.. కొరవడిన అవగాహన ►నిత్యావసర సరుకుల ధరలు దిగివస్తాయని ఆశ ►సినిమా, విందు, వినోదాలు ప్రియమే.. ►జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను అమలు జూలై ఒకటో తేదీ సమీపిస్తుండడంతో ‘జీఎస్టీ’ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పన్ను విధానం అమలైతే ఎవరికి లాభం.. ఎవరికి భారం అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిత్యావసర సరుకుల ధరలు దిగివస్తాయా? అని సామాన్యులు.. లగ్జరీ వస్తువుల మాటేంటి? అని ఉన్నతవర్గాలు, మా పరిస్థితి ఎలా ఉంటుందోనని మధ్య తరగతి.. ఎవరికి వారు ఆలోచనలతో తలమునకలయ్యారు. మరోవైపు నగరంలోని 20 శాతం మంది వ్యాపారులు వ్యాట్ నుంచి జీఎస్టీలోకి మారనేలేదు. ఈ నేపథ్యంలో జీఎస్టీ గురించిన సందేహాలు.. లాభనష్టాలపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం. ‘ఒకే దేశం.. ఓకే పన్ను’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెడుతున్న ‘వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై గ్రేటర్లో విభిన్న వర్గాల్లో పలు అనుమానాలుతలెత్తుతున్నాయి. ఏ వస్తువుపై ఎంత పన్ను పరిధిలోకి వస్తుందన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతుండగా.. మరికొన్ని పెరుగుతున్నాయి. జీఎస్టీ అమలుపై పలు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారుల అభిప్రాయం తెలుసుకునేందుకు గ్రేటర్ వ్యాప్తంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. జీఎస్టీ పన్నుతో ఆయా రంగాలపై పడనున్న ప్రభావం.. వ్యాపారులు, వినియోగదారుల అభిప్రాయాలపై ప్రత్యేక కథనం.. 20 శాతం డీలర్లు దూరందూరం.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుపై డీలర్లకు అవగాహన కొరవడింది. వ్యాట్ నుంచి జీఎస్టీలో మార్పు కోసం మూడు నాలుగు పర్యాయాలు అవకాశం కల్పించినప్పటికీ నగరంలో సుమారు 20 శాతం మంది డీలర్లు ఇంకా నమోదు చేసుకోలేదు. నగర పరిధిలో సుమారు 1.26 లక్షలమందికి పైగా వ్యాపారులు వ్యాట్ డీలర్లుగా నమోదవగా అందులో 80 శాతం డీలర్లు మాత్రమే జీఎస్టీ కింద మార్పు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జీఎస్టీలో నమోదు కోసం మరో మారు ప్రత్యేక పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారు. ఇప్పటికే జీఎస్టీలో నమోదైన డీలర్లకు ప్రొవిజనల్ ఐడీలను సైతం కేటాయించారు. జీఎస్టీ నెట్వర్క్ ద్వారా ఐడీలతో పాటు జీఎస్టీ విధి విధానాల ఫార్మాట్లను సైతం జారీ చేశారు. ఐడీలు పొందిన డీలర్లు జీఎస్టీకి అనుగుణంగా తమ వ్యాపార సంస్థలోని బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జీఎస్టీలో నమోదు చేసుకున్న డీలర్లు తమ రిటర్న్‌లను 3 బీ ఫార్మెట్లో ఆగస్టు వరకు సమర్పించవచ్చు. సెప్టెంబర్ నుంచి మాత్రం ప్రతినెలా రిటర్న్‌లను పక్కాగా జీఎస్టీ ఫార్మెట్‌లోనే సమర్పించాలి. స్పష్టత లేని రైలు చార్జీలు.. ట్రైన్ చార్జీలపైన ఇప్పటికీ స్పష్టత లేదు. జనరల్, స్లీపర్ క్లాస్ చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఏసీ చార్జీలు మాత్రం స్వల్పంగా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే వస్తువుల పార్శిల్ చార్జీలు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. ఏసీ రెస్టారెంట్లలో బాదుడు.. నాన్ఏసీ రెస్టారెంట్లు, దాబాల్లో ధరలు స్వ ల్పంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం సేవా పన్ను, వ్యాట్, స్వచ్ఛభారత్ సెస్, క్రిషి సెస్ అంటూ 20 శాతం వినియోగదారుల నుంచి హోటళ్లు పిండుతున్న పన్నులు తగ్గనున్నాయి. జూలై నుంచి స్టార్ హోటళ్లలో 28 శాతం పన్ను పడనుంది. నాన్ ఏసీ రెస్టారెంట్లలో పన్ను 12 శాతం ఉండగా, ఏసీ రెస్టారెంట్లలో 18 శాతంగా నిర్ణయించారు. రూ.50 లక్షల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో ఈ పన్ను 5 శాతానికి పరిమితం చేశారు. సేవా రుసుం మాత్రం ఆయా రెస్టారెంట్లను బట్టి వసూలు చేస్తారు. నిత్యావసరాలకు నో ఫికర్.. బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి సరుకులను జీఎస్టీ నుంచి మినహాయించారు. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు ఊరట లభించనుంది. ఇంటి సరుకుల కొనుగోలుకు ప్రతినెలా చేసే ఖర్చులో రూ.500 నుంచి రూ.వెయ్యి మిగిలే అవకాశముంది. కాగా కొన్ని బ్రాండెడ్ నిత్యావసరాల కొనుగోలుపై ఐదుశాతం పన్ను పడనున్నట్టు బేగంబజార్ హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. సినిమా వినోదం భారం థియేటర్లో సినిమా టికెట్ ధరలను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. రూ.100 కన్నా తక్కువ ధర ఉన్న టికెట్లపై 18 శాతం, రూ.100 కంటే ఎక్కువున్న టికెట్ ధరపై 28 శాతంగా వేశారు. జూలై 1 నుంచి పాత వినోదపు పన్ను స్థానే కొత్త పన్నుల శ్లాబు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినోదపు పన్ను ఆధారంగా విధిస్తున్నారు. ఇది సున్నా నుంచి 110 శాతం వరకూ ఉంది. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్లో రూ.70 ఉన్న గరిష్ట టికెట్ ధర రూ.120కి చేరింది. మల్టీప్లెక్స్‌లు మినహా మిగతా సినిమాహాళ్లకు వీటిని వర్తింపజేశారు. స్వల్పంగా డీటీహెచ్, కేబుల్.. కేబుల్ సర్వీస్, డీటీహెచ్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. ప్రస్తుత ట్యాక్స్ 15 శాతం ఉంది. జీఎస్టీ అమలైతే మరో 3 శాతం పెరిగి 18 శాతానికి చేరుతుంది. అంతకు మించి వసూలు చేసే వెసులుబాటు లేదు. అయితే దీనిపై తమకు ఏ విధమైన స్పష్టతా లేదంటూ నగరంలోని కేబుల్, డీటీహెచ్ నిర్వాహకులు చెబుతున్నారు. పెరగనున్న మొబైల్ డేటా .. మొబైల్ డేటా ప్లాన్స్ ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌కు 3 శాతం పెరగనున్నాయి. ప్రస్తుత ట్యాక్స్ 15 శాతం చెల్లిస్తున్నాం. జీఎస్టీ అమలైతే 18 శాతానికి పెరగనుంది. విమాన చార్జీలపై2 శాతం భారం అన్ని డోమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులపైనా సుమారు 2 శాతం చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రస్తుతం ఫ్లెక్సీఫైర్ చార్జీలు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ చార్జీలు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు జూలై 5న హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు ఎయిర్ ఇండియా చార్జీ రూ.6,698 వరకు ఉంది. దీనిపైన 2 శాతం అదనంగా అంటే రూ.150 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఏ రోజుకు ఆ రోజు చార్జీల్లో మార్పులు చోటుచేసుకోనున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా అదనపు భారం పడుతుంది. ’బ్రాండెడ్ దుస్తులు’ కొనొచ్చు సిటీ యువత ఫాలో ఆయ్యే బ్రాండెడ్ దుస్తులపై రేటు కాస్త తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీలో బ్రాండెడ్ దుస్తులకు 5 శాతం పన్ను ఖరారు చేశారు. ప్రస్తుతం వీటిపై ఎక్సైజ్, వ్యాట్ కలిపి 7.5 శాతం పన్ను ఉంది. అంటే రూ.1,000 ప్యాంట్‌కు ప్రస్తుతం పన్నులు కలిపి 1,075 చెల్లిస్తుంటే.. జీఎస్టీతో రూ.1,050కే లభిస్తుంది. రూ.1,000 లోపు చీరలు, వస్త్రాలపై ఐదు శాతం, అంతకంటే ఖరీదైన దుస్తులపై 12 శాతం పన్ను ఉంటుంది. గృహోపకరణాలపై హెచ్చుతగ్గులు ప్రస్తుతం రూ.20 వేలుండే టీవీ పన్నులతో రూ.24,900కు లభిస్తోంది. ఇక నుంచి జీఎస్టీలో 18 శాతం పన్నుతో అదే టీవీ రూ.23,600కే వస్తుంది. బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి అమ్మితే ఐదు శాతం పన్ను పడే అవకాశముంది. ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి గృహోపకరణాలకు 24.2 నుంచి 27 శాతం వరకు పన్నులున్నాయి. జీఎస్టీలో వీటన్నింటినీ 28 శాతం పన్ను విభాగంలో చేర్చారు. అంటే ఒక శాతం ధరలు పెరిగే అవకాశముంది. హైఎండ్ వాహనాల ధరలు పైకి.. జీఎస్టీతో కొన్ని రకాల వాహనాల ధరలు కొంత తగ్గనుండగా, మధ్యస్థాయి, హైఎండ్ వాహనాల ధరలు పెరుగుతాయి. 300 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులపై జీఎస్టీ సానుకూల ప్రభావం చూపనుంది. ఈ తరహా వాహనాలపై రూ.2500 వరకు ధర తగ్గవచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పల్సర్ ధర ప్రస్తుతం రూ.87 వేలు ఉండగా జీఎస్టీతో రూ.85 వేలకు తగ్గుతుంది. ప్రస్తుతం రూ.68 వేలు ఉన్న హోండా యాక్టివా రూ. 65,500కు చేరే అవకాశం ఉంది. ఇక హై ఎండ్ జాబితాలోకి వచ్చే కవాసకి, కేటీఎం డ్యూక్, హర్లీ డేవిడ్సన్ వంటివాటి ధరలు రూ.5 వేల నుంచి వాటి స్థాయిని బట్టి రూ.లక్ష వరకు పెరగవచ్చు. జీఎస్టీతో హై ఎండ్ వాహనాలపై 28 శాతం కామన్ ట్యాక్స్‌తో పాటు మరో 15 శాతం సర్వీస్ ట్యాక్స్ కలుస్తుంది. ప్రీమియం కార్ల ధరలు తగ్గనుండగా, హై ఎండ్ వాహనాల ధరలు మాత్రం కొంత మేర పెరుగుతాయి. స్విఫ్ట్ డిజైర్, ఇన్నోవా, హోండాసిటీ వంటి కార్ల ధరలు పెరుగనున్నాయి. మొబైల్స్ కాస్ట్లీ గురూ.. కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతి చేసుకున్నా, స్థానిక తయారీ ఫోన్లైనా 18 శాతం పన్నులోకి తీసుకొచ్చారు. దీంతో సెల్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.10 వేల ఫోన్‌కు పన్నులతో రూ.11,280 చెల్లిస్తుంటే.. జీఎస్టీతో అదే ఫోన్ రూ.11,800 అవుతుంది. చౌకగా ‘చెప్పులు’.. చెప్పుల ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.500 లోపు ధరలుండే చెప్పులపై 9.5 శాతం వరకు పన్నులున్నాయి. దీన్ని జీఎస్టీలో ఐదు శాతానికి తగ్గించారు. అయితే రూ.500 కన్నా ఎక్కువ ధర ఉండే చెప్పులపై ప్రస్తుతం 23.1 నుంచి 29.58 శాతం వరకు పన్నులు ఉన్నాయి. వీటికి 18 శాతం జీఎస్టీ విధించారు. బూట్లు కూడా ఇంచుమించు అవే ధరలకు లభించవచ్చు. అమ్యూజ్మెంట్ పార్కుల్లో వాయింపు జీఎస్టీ అమలుతో అమ్యూజ్మెంట్ పార్కుల్లో టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం పార్కుల్లో సేవా పన్ను 15 శాతం ఉండగా, కొత్త పన్ను ప్రకారం 28 శాతం వసూలు చేస్తారు. -
ఆన్లైన్లో ఔషధ విక్రయం ప్రాణాంతకం!
విచ్చలవిడిగా లభించే మత్తు, నిద్ర మాత్రలు.. - యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు - ఆన్లైన్ ఔషధాల సరఫరా హానికరమని వెల్లడి - అమెరికా వంటి దేశాల్లో విటమిన్లు, సాధారణ మాత్రలే ఆన్లైన్లో సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి వస్తువుల్లా ఔషధాలను ఆన్లైన్లో విక్రయించడం వల్ల అనేక అనర్థాలు పొంచివున్నాయని నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి రోగులకు ప్రాణాంతకం కానుందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయించే పద్ధతికి కేంద్రం అనుమతిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రెండ్రోజుల కింద దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేశారు. సామాన్య రోగులకు ఈ పద్ధతి అందుబాటులో ఉండే వ్యవహారం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చిన్నపాటి మందుల దుకాణాల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం మందులు అంటగట్టే ప్రమాదం.. డాక్టర్ రాసిన చీటీలోని మెడిసిన్స్‌ను ఆన్లైన్లో కొన్నట్లయితే అవి డాక్టర్ రాసిన కంపెనీకి చెందినవే కావొచ్చు.. కాకపోవచ్చు. ఆన్లైన్ దుకాణాదారులు తమకు చౌకగా లభించే నాసిరకం ఫార్మసీ కంపెనీల మందులను సొంత లాభం కోసం కట్టబెట్టవచ్చు. ఆన్లైన్లో ఇలాంటివి విక్రయిస్తే రోగులు నష్టపోతారు. ఒక్కోసారి ప్రాణహాని జరిగే ప్రమాదముంది. డాక్టర్ రాసినవి కాకుండా వేరే మెడిసిన్ ఇస్తే అవి రియాక్షన్‌కు దారితీసి వికటించే ప్రమాదముంది. అందుకు ఆన్లైన్ మందుల అమ్మకం దారులు ఎలాంటి జవాబు దారీత నం, బాధ్యత వహించరు. ఎలాంటి పర్యవేక్షణకు తావు లేని ఆన్లైన్ అమ్మకాల వల్ల మత్తు మందులు, నిద్రమాత్రలను యువత విచక్షణ రహితంగా ఆర్డర్ చేస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అనేక మందుల దుకాణదారులు ఔషధాలతోపాటు సంబంధిత ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నాయి. వాటినీ ఇష్టారాజ్యంగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు వైద్యుడు చీటీ రాసినా ఆన్లైన్లో ఆర్డర్ వల్ల ప్రిస్కిప్షన్‌కు సాధికారత ఉండదు. దీనివల్ల మందుల చీటీ ఉంటేనే ఔషధాలు విక్రయించాలన్న కేంద్రం స్ఫూర్తి దెబ్బతింటుంది. అమెరికా వంటి దేశాల్లోనూ ఆన్లైన్లో కేవలం పారాసిటమాల్, విటమిన్ వంటి ట్యాబ్లెట్లనే విక్రయిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. డిస్కౌంట్ ప్రచారాలతో ప్రమాదం.. ఆన్లైన్ విక్రయాలు జరిపే కొన్ని మెడికల్ దుకా ణదారులు ఇంత బిల్లు చేస్తే డిస్కౌంట్లు ఇస్తామని, కొన్ని మెడికల్ టెస్టులు ఉచితంగా ఇస్తామని అంటున్నాయి. కొన్ని వస్తువులు ఉచితంగా ఇస్తామంటూ ప్రజల్ని ఆకట్టుకోవాలని చూ స్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపూరితమైన ఔషధాలకు ఇటువంటి ప్రకటనలు అనైతికమని చెబుతున్నారు. ఆన్లైన్లో మెడిసిన్స్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. ఆర్డర్ చేసిన వెంటనే మందులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆరోగ్యం విషమించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ మెడికల్ షాపులతో ఇప్పటికే చిన్న మెడికల్ దుకాణాలు తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఇక ఆన్లైన్ విక్రయాలు కూడా తోడైతే వాటి ఉనికే ప్రశ్నార్థకం కానుంది. యువతకు హాని ఆన్లైన్లో ఔషధాల విక్రయాల వల్ల మత్తు మందులు, నిద్ర మాత్రలు కూడా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి రానుంది. దీంతో వాటికి బానిసై పోయిన వారు ముఖ్యంగా యువతీ యువకులు శారీరకంగా మానసికంగా సామాజికంగా నష్టపోతారు. అందువల్ల ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలు నిలిపేయాలి. – వేణుగోపాల్‌శర్మ, రాష్ట్ర కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సంఘం ప్రతినిధి అత్యంత ప్రమాదకరం ఆన్లైన్లో మందుల విక్రయం అత్యంత ప్రమాదకరం. మందుల చీటీ లేకుండా కొనుగోలు చేయడమే తప్పు. అలాంటిది ఆన్లైన్ అనేది అందుకు విరుద్ధం. పైగా రోగి తనకు ఇష్టమైన, ఇష్టమైనన్ని మెడిసిన్స్ కొని వాడితే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో డాక్టర్ మందుల చీటీ లేకుండా మందులు ఇవ్వరు. – డాక్టర్ శివరామకృష్ణ, ఖమ్మం -
టమాటో@100: కేంద్రం ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: ప్రజల కడుపు మండిస్తూ కొండెక్కిన టమాటో, ఇతర నిత్యావసరాల ధరల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెన్సెక్స్ బుల్ తో పోటీపడుతూ కిలో రూ. 100 రూపాయలకు చేరుకున్న టమాటో ధరను ఉన్నపళంగా నేలకు దించడానికి చేపట్టవలసిన చర్యలపై బుధవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ఇతర ముఖ్య శాఖల మంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాంవిలాస్ పాశ్వాన్, రాధా మోహన్ సింగ్, నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. (చదవండి: ఇంటింటా చిటపట) ధరల స్థిరీకరణకు చేపట్టవలసిన చర్యలపై పారిశ్రామిక సమాఖ్య ఫిక్కీ ఇదివరకే సూచించిన అంశాలను మంతృల బృందం పరిశీలించనుంది. నిత్యావసరాల రవాణాను సులభతరం చేయడంద్వారా టొమాటో ధరలను అదుపు చయవచ్చని, రాష్ట్రాల వద్ద ఉన్న నిల్వల వివరాలను సేకరించి, సమీక్షించడం ద్వారా నిత్యావసరాల ధరలకు కళ్లెం వెయ్యవచ్చని ఫిక్కీ సూచించింది. ధరల స్థిరీకరణకు తాత్కాలిక, శాశ్వత విధానాలను మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో చక్కెర, మంచినూనె ఇతర వస్తువుల నిల్వలపైనా మంత్రులు చర్చిస్తారని తెలిసింది. దేశవ్యాప్తంగా కిలో టమాటో ధర సరాసరి రూ.80 పలుకుతుండగా, హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రూ.100గా ఉంది. పప్పుదినుసుల ధరలు సరాసరి రూ. 170 (కిలో)కి అమ్ముతుండగా కొన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు రూ. 200 వసూలు చేస్తున్నారు. -
ఇంటింటా చిటపట
మండుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు మార్కెట్‌కు వెళ్లాలంటనే భయమేస్తోందంటున్న జనం 15% వరకూ పెరిగిన నూనెల ధరలు కుతకుతలాడుతున్న పప్పులు.. బియ్యం, చక్కెర, అల్లం, వెల్లుల్లి ధరలూ నింగికి.. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో ప్రజల విలవిల ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ పచ్చిమిర్చి రూ. 100 పైనే కిలో టమాటా రూ. 90 బీరకాయ, చిక్కుడు రూ. 80పైనే సాక్షి నెట్వర్క్: కూరగాయల ధరలు కొండెక్కాయి.. పప్పులు ఎంతకూ దిగిరానంటున్నాయి.. నూనెలు మంటెక్కుతున్నాయి.. బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.. చక్కెర చేదెక్కిపోయింది.. సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది.. సగటు మనిషి జీవితం ఆగమాగమవుతోంది.. పేదలు, మధ్యతరగతి జనాలు విలవిల్లాడిపోతున్నారు. వంద రూపాయలు పట్టుకుని బజారుకు వెళితే ఒక్కరోజుకు సరిపడా సరుకులు కూడా రాక లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులతో సతమతమవుతున్నవారు ధరల పెంపుతో నిండా ఆవేదనలో కూరుకుపోతున్నారు. ధరల మంటతో ఇలా పేదలు, మధ్య తరగతి అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. అటు కేంద్ర ప్రభుత్వం ‘అచ్ఛేదిన్ ఆగయే’ అంటూ డప్పు కొట్టుకుంటోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వెలిగిపోతోందని ప్రకటనలు చేస్తోంది. నిత్యావసరాల ధరలు తగ్గించడంపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. కొనాలంటే భయం.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూరగాయల ధరలు 30 శాతానికిపైగా పెరగగా.. నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి. టమాటా, పచ్చిమిర్చి వంటివి కిలో రూ.100కు చేరుకున్నాయి. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, కాకర, క్యాబేజీ వంటివి వాటితో పోటీ పడుతున్నాయి. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలన్నీ పది రూపాయలకు నాలుగైదు కట్టలు చొప్పున విక్రయించేవారు. ప్రస్తుతం పది రూపాయలకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు. మార్కెట్లకు వెళుతున్నవారు ఒక్కో కూరగాయలను పావుకిలోకు మించి కొనేందుకు సాహసించడం లేదు. ఇక మార్కెట్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలు, తోపుడు బండ్లు వంటి వాటిలో కిలోకు మరో పది ఇరవై రూపాయలు అదనంగా విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి తదితర హోల్‌సేల్ మార్కెట్లతోపాటు మెహిదీపట్నం, ఎర్రగడ్డలోని రైతుబజార్లలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. నెల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.7కు లభించిన టమాటా ఇప్పుడు రూ.60 నుంచి రూ.70 మధ్య పలుకుతోంది. ఇది రిటైల్‌కు వచ్చే సరికి ప్రాంతాన్ని బట్టి రూ.90-100 వరకు విక్రయిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వారానికి సరిపడా కూరగాయల కోసం నెల రోజుల కింద రూ.300 వరకు ఖర్చు కాగా.. ఇప్పుడది రూ.550-600కు చేరుకోవడం గమనార్హం. ఇక అప్పుడప్పుడూ చుక్కలనంటే ధరలతో భయపెట్టే ఉల్లిగడ్డ మాత్రం ఇప్పుడు తక్కువ ధరకే (కిలో రూ.15కే) దొరుకుతుండడం గమనార్హం. ఈ జ్ఞాపకం మధురమే! కందిపప్పు కిలోకు ఒక రూపాయి డెబ్బై పైసలు, నూనె కిలోకు నాలుగున్నర రూపాయలు.. భలే తక్కువ ధరలు కదా! దాదాపు 45 ఏళ్ల కింద 1971లో రాసిన సరుకుల చిట్టా ఇది. మధుర జ్ఞాపకాలు అంటూ ఈ చిత్రం ఫేస్బుక్లో చెక్కర్లు కొడుతోంది. అప్పట్లో నాలుగు రకాల పప్పులు ఎనిమిది కిలోలు, మూడు కిలోల నూనె, పావుకిలో నెయ్యి, రెండు కేజీల చక్కెర, 2 సబ్బులు, పోపు సామగ్రి అంతా కలిపి కేవలం 40 రూపాయల 75 పైసలకే ఇచ్చేశారు. నిజంగా ఇది మధుర జ్ఞాపకమే! నిత్యావసరాలు భగ్గు కూరగాయలే కాదు బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. గత ఏడాది హోల్‌సేల్ మార్కెట్లో రూ.110కు కిలోచొప్పున లభించిన కందిపప్పు ఇప్పుడు రూ.150 దాటింది. అది రిటైల్ దుకాణాలకు వచ్చే సరికి కిలో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. లీటర్ వేరుశనగ నూనె రూ.100 నుంచి రూ.125కు, సన్‌ఫ్లవర్ నూనె రూ.80 నుంచి రూ.95కు పెరిగాయి. పేదలు వినియోగించే పామాయిల్ ధర కూడా లీటర్ రూ.65 నుంచి రూ.75కు పెరిగింది. బియ్యం, గోధుమలు వంటి వాటి ధరలూ 15 శాతం వరకూ పెరిగాయి. ఇక చింతపండు, అల్లం, వెల్లుల్లి, చక్కెర వంటి వాటి ధరలు కూడా బాగా పెరిగాయి. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కందిపప్పు కొనడం మానేశామని, ఇప్పుడు టమాటా వంటి కూరగాయలను కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకుని నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గిన సాగు కొన్నేళ్లుగా కొనసాగుతున్న తీవ్ర వర్షభావ పరిస్థితులుతో కూరగాయల సాగు తగ్గిపోయింది. భూగర్భజలాలూ అడుగంటడంతో నీళ్లు లేక చిన్న రైతులు కూడా కూరగాయలు పండించలేకపోతున్నారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులు అత్యధికంగా కూరగాయల సాగు చేసి హైదరాబాద్ నగరంలో విక్రయిస్తుంటారు. వారిలో ఈసారి సగం మంది కూడా కూరగాయలు సాగు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేసేవారు. ఈసారి 6 వేల ఎకరాల్లోనే వేశారు. అందులోనూ నీళ్లు లేక దిగుబడి బాగా తగ్గిపోయింది. ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో కూరగాయల పంటలకు భారీగా మచ్చల తెగులు సోకడంతో నష్టం కలిగింది. మార్కెట్‌కు వెళ్లాలంటే భయమే.. ‘‘పప్పులు, బియ్యం ధరలు బాగా పెరిగాయి. మార్కెట్‌కు వెళదామంటే భయమేస్తుంది. ధరలు ఇలా పెరిగితే పేదలు, సామాన్యుల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం వెంటనే ధరలు నియంత్రించాలి.’’ - బసయ్య, తాండూరు, రంగారెడ్డి జిల్లా ఏం తినేటట్లు లేదు ‘‘కనీసం కూ రగాయలు కూడా కొనలేకపోతున్నాం. రెండు నెలల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనట్లు పచ్చిమిర్చి, టమాటా ధరలు కిలో 100 రూపాయలు దాటిపోయాయి. ఇలాగే ఉంటే ఏమీ కొనలేం. ఏమీ తినలేం..’’ - చింతల ఏసమ్మ, హైదరాబాద్ -
దోసెకు పేదలిక దూరమేనా?
► కుతకుతలాడుతున్న కందిపప్పు ► చుక్కలు తాకుతున్న మినపపప్పు ► ఘాటెక్కిన మిర్చి, కొండెక్కిన చింతపండు ► దోసె, ఇడ్లీ మర్చిపోవాల్సిందేనంటున్న మధ్యతరగతి ► పచ్చడన్నం కూడా భారమవుతుందన్న పేదలు ► పచ్చళ్లు పెట్టుకోవడం కూడా కష్టమే హైదరాబాద్: దోసె, ఇడ్లీలకు పేదలు, సామాన్య ప్రజలు దూరం కావాల్సిందేనా? నాలుకను కట్టేసుకోవాల్సిందేనా? మండుతున్న ఎండలను మించిపోయేలా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను చూస్తే తప్పదనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు కుతకుతలాడుతోంది. మినపపప్పు ధర చుక్కలంటుతోంది. పల్లీల రేట్లూ పెరిగిపోయాయి. పంట చేతికొస్తున్న దశలోనే చింతపండు ధర కొండెక్కి కూర్చొంది. కిలో పచ్చి మిర్చి ఏకంగా రూ.వంద పలుకుతోంది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కింది. విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు వింటేనే సామాన్యుల గుండె దడదడలాడుతోంది. గత నెల రోజుల్లోనే పప్పుల ధరలు భారీగా పెరిగాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చితే ప్రస్తుతం చాలా నిత్యావసర సరుకుల ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ రేట్లతో సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులు తడుముకొని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట రూ.125 ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ. 180కి చేరింది. మినప పప్పు ధర రూ.130 నుంచి రూ.190 - 200కు ఎగబాకింది. కిలో పల్లీల రేటు రూ. 90 నుంచి రూ. 140కి చేరింది. ఇలా ఏ నిత్యావసర సరుకు తీసుకున్నా విపరీతంగా ధర పెరిగిపోవడం సామాన్య, దిగువ మధ్యతరగతి, చిరు వేతన జీవులను ఆర్థికంగా కుంగదీస్తోంది. పచ్చడన్నం తినాలన్నా భారమే.. కందిపప్పు ధర భారీగా పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్లలో సాంబారు, పప్పుకు కందిపప్పు బదులు పెసర పప్పు వాడుతున్నారు. మినపపప్పు రేటు విపరీతంగా పెరిగినందున ఇడ్లీ, దోసెలకు స్వస్తి చెప్పాల్సి వస్తోందని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటున్నాయి. ఇడ్లీలు, దోసెలు చేసుకోవడం దాదాపు మర్చిపోయామని కడపకు చెందిన ప్రేమలత అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు తెలిపారు. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనలేక పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగా ఉందని పేదలు కంట తడిపెట్టుకుంటున్నారు. పచ్చడికి అవసరమైన చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు నింగినంటుతుండటమే ఇందుకు కారణం. చింతపండు కిలో ధర రూ. 70 నుంచి రూ.120కి పెరిగింది. ఎండు మిర్చి రూ. వంద నుంచి 170కి ఎగబాకింది. పచ్చిమిర్చి కిలో రూ. 90 నుంచి రూ. 100 వరకూ పలుకుతోంది. నువ్వుల మాట ఇక చెప్పనక్కరలేదు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ. 140 పైనే ఉండటం సామాన్యులకు భారంగా మారింది. పెరిగిన ధరలతో పచ్చడి మెతుకులు సమకూర్చుకోవడం కూడా భారంగా ఉందని పేదలు వాపోతున్నారు. ఈ ఏడాది పచ్చళ్లూ కష్టమే... మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో ఏడాది పొడవున అత్యవసరాలకు వాడుకునేందుకు పచ్చళ్లు పెట్టాలనుకునేవారు సైతం పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఎండు మిర్చి కిలో రూ. 170 నుంచి 190 పలుకుతుండటం ఇందుకు ఒక కారణం. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నువ్వుల నూనె మంచిది. నాణ్యమైన నువ్వుల నూనె లీటరు రూ.160పైనే పలుకుతోంది. నాణ్యమైన మిర్చిపొడి కిలో రూ.250 పైనే ఉంది. పచ్చళ్లలో తప్పకుండా వాడాల్సిన ఆవాలు ధర కూడా చాలా పెరిగిపోయింది. మామిడి కాయ ఒక్కోటి సైజును బట్టి రూ.15 నుంచి రూ. 22 వరకూ ధర ఉంది. ముక్కలు కోసినందుకు ఒక్కో కాయకు ఏకంగా రూ. 4 వసూలు చేస్తున్నారు. దీంతో పచ్చళ్లు కూడా చాలా తక్కువ మోతాదులో పెట్టుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. ధరల పెరుగుదల తీరు ఇదీ.... సరుకు 2014 2015 2016 కందిపప్పు 70 115 180 మినపపప్పు 75 130 200 ఎండుమిర్చి 82 110 170 చింతపండు 70 105 120 పచ్చిమిర్చి 50 70 100 -
నకిలీ సరుకుల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నిత్యావసర సరుకులను కల్తీ చేస్తున్న ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు, కుంకుమతో పాటు మసాల దినుసులను కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 క్వింటాళ్ల కల్తీ పసుపు, 2 క్వింటాళ్ల మసాల దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుడు మధును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
చుక్కలు చూపిస్తున్న టమాట
కిలో రూ. 60 దాటి పైపైకి..గుంటూరులో కిలో రూ. 80 రైతు బజార్లలో నాసిరకం పలు జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట విజయవాడ: సామాన్యులకు మొన్న ఉల్లి కంటతడి పెట్టిస్తే.. నిన్న పప్పన్నం దూరమైంది. నేడు టమాట ఠారెత్తిస్తోంది. గత నెల మొదటి పక్షంలో కిలో రూ.10గా ఉన్న ధర, నెలాఖరుకు రూ. 20కి చేరింది. ఇప్పుడు పలు జిల్లాల్లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకూ అమ్ముతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఏకంగా రూ. 80కిపైగా విక్రయిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం ధర రూ. 30గా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా కిలో రూ. 34 నుంచి రూ. 40కి అమ్ముతున్న టమాటాలు మచ్చలు, పుచ్చులతో నాసిరకంగా ఉంటున్నాయి. టమాట ధరను నియంత్రించడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై సామాన్యులు మండిపడుతున్నారు.పలు జిల్లాల్లో పంట మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకూ ధర ఇలాగే ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అయి తే వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినడంతో ధర తగ్గడమెలా ఉన్నా పెరిగే చూచనలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో దెబ్బతీసిన వర్షాలు పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు టమాట పంటను దెబ్బతీస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా అనంతపురం, మదనపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు టమాట దిగుమతి అయ్యేది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని చిత్తూరు జిల్లాల్లో వర్షాలకు పంట దెబ్బతింది. మరోవైపు కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోను వర్షాభావంతో బోర్లు, బావులు, చెరువులు అడుగంటి టమాట సాగు తగ్గిపోయింది. ఏపీలో టమాట మార్కెట్‌కు కీలకంగా ఉండే చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అరకొరగా చేసిన సాగు కూడా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతింది. దీనికితోడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వర్షాలకు పంట దెబ్బతినడంతో అక్కడికి రవాణా చేసేందుకు హోల్‌సేల్ వ్యాపారులు ఎగబడుతుండటంతో ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కిలో రూ. 5 నుంచి రూ. 45 వరకూ పెరుగుతూ వచ్చింది. ఇక రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా వేలాది ఎకరాలు బీడువారాయి. దీంతో టమాట సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అక్కడ రైతు బజార్లో కిలో టమాట రూ. 60, బహిరంగ మార్కెట్లో రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు నియంత్రిస్తాం: మంత్రి పుల్లారావు రాష్ట్రంలో టమాటతోపాటు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టమోటాను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై సరఫరా చేయాలని మార్కెటింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సంక్షోభంలో ఉన్న ఆయిల్ ఫాం రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12,13 తేదీల్లో ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారని పుల్లారావు వెల్లడించారు. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించేందుకు రీసర్వే జరుగుతుందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పంటలను రక్షించేందుకు ఒకటి రెండు రోజుల్లో 1500 రెయిన్‌గన్స్ ద్వారా ప్రయోగాలు చేస్తామన్నారు -
ధరల దరువు
- తెలంగాణ, ఏపీల్లో చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలు - మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం - పేదలు రెండు పూటలా తినలేని దుస్థితి - కిలో రూ. 200కు చేరిన పప్పుల ధరలు - రెండింతలకుపైగా పెరిగిన కూరగాయలు - సలసలా కాగుతున్న వంటనూనెలు - వర్షాభావం, సాగు తగ్గడమే పెరుగుదలకు కారణం - పేదలు విలవిల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు కొండెక్కిన పప్పులు.. భగ్గుమంటున్న కూరగాయలు.. మరుగుతున్న నూనెలు.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరల దరువుకు సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్నారు. నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో పేద జనం లబోదిబోమంటున్నారు. పప్పుల ధరలు 200 మార్కుకు చేరగా.. కూరగాయల ధరలు రెండింతలకు పైగా పెరిగాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గతంలో రూ. 1,500 ఖర్చుచేస్తే నెలకు సరిపడా సరుకులు వచ్చేవని... ఇప్పుడు రూ. 6 వేలు తీసుకెళితేగానీ చాలడం లేదని ప్రజలు వాపోతున్నారు. పేదలైతే పెరిగిన ధరలను చూసి పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ధరలు ఇంతగా పెరుగుతున్నా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా కనీసం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. డిమాండ్ మేరకు సరఫరా కాకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆలుగడ్డ, బెండకాయ, చిక్కుడు, దొండకాయ ధరలు రూ. 20 నుంచి రూ.30 వరకు పలుకుతుండగా... టమాటా, వంకాయ, కాకర, బెండ, బీరకాయ కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో రూ. 42కి చేరింది. మొత్తంగా గత ఏడాదితో పోలీస్తే ఈ ధరలన్నీ రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో కూరగాయల సాధారణ సాగు 6 లక్షల ఎకరాలుకాగా... ఈ సారి 4 లక్షల ఎకరాలకు పడిపోయింది. మిరప 1.45 లక్షల ఎకరాలకుగాను ఇప్పటివరకూ పెద్దగా సాగు జరిగింది లేదు. దీంతో గత నెల కిలో రూ.25 పలికిన పచ్చిమిర్చి ధర అమాంతం రూ. 42కి పెరిగింది. అల్లం వెల్లుల్లి ధర పావుకిలోకే రూ.40 వరకు పలుకుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగుకావాల్సి ఉండగా... ఈ సారి 3.17 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దీంతో కందిపప్పు ధర ఏకంగా రూ.190కి చేరగా... మినపపప్పు ధర రూ.170కి పెరిగింది. పెసరపప్పు రూ. 135 నుంచి రూ. 150 మధ్య పలుకుతోంది. చివరికి ఆకుకూరల ధరలు కూడా రెండు మూడు రెట్లు పెరిగాయి. వంట నూనెల ధరలు కూడా గత ఏడాదితో పోలిస్తే 25% వరకు పెరిగాయి. తగ్గిన దిగుమతులు: ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో వినియోగమయ్యే మొత్తం కూరగాయల్లో 32 శాతం మేర రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుండగా... ఏపీ నుంచి 26 శాతం, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 42 శాతం మేర దిగుమతి అవుతున్నాయి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గాయి. దీంతో కర్నూలు, అనంతపురం, మదనపల్లిల నుంచి రాష్ట్రానికి రావాల్సిన టమాటా, ప్రకాశం, గుంటూరు, అనంతపురం నుంచి రావాల్సిన వంకాయ, బెంగళూరు, చిక్బళ్లాపూర్ల నుంచి రావాల్సిన బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు తదితరాల దిగుమతులు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదిలో హైదరాబాద్ మార్కెట్లోకి 2,200 క్వింటాళ్ల మేర టమాటా రాగా ఈసారి 1,800 క్వింటాళ్లకు పడిపోయింది. వంకాయ, క్యాబేజీ, క్యారట్ సరఫరా సైతం గణనీయంగా తగ్గింది. ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఖర్చులు బాగా పెరిగిపోయాయి.. ‘‘ప్రతి నెలా ఇంటికి ప్రతి లెక్క రాసుకుని జాగ్రత్తగా ఖర్చుపెడతాం. కానీ కొద్ది రోజులుగా పప్పులు, కూరగాయల ధరలు పెరగడంతో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కనీసం ఉదయం పూట టిఫిన్ చేయడానికి ధైర్యం చాలడం లేదు.’’ - రచ్చ లావణ్య, బాగ్‌అంబర్‌పేట కడుపునిండా తినలేని పరిస్థితి ‘‘రోజురోజుకూ ధరలు పెరిగిపోతుండడంతో ఏ వస్తువులూ కొనలేకపోతున్నాం. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తామన్నా లాభం లేదు. మూడు పూటల సరిగ్గా తిండికూడా తినలేని పరిస్థితులు ఉన్నాయి.’’ - బి.అక్కమ్మ, బర్కత్‌పుర ఏపీలో ధరాఘాతం! సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు సరుకుల కోసం మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బియ్యం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తూ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఉదాసీనంగా వ్యవహరించడం ద్వారా ధరల పెరుగుదలకు కారణమైన రాష్ట్రప్రభుత్వం వాటి నియంత్రణ దిశగా ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఉన్నతాధికారులతోనూ కలసి రోజూ సమీక్షలు నిర్వహిస్తోంది. పప్పుల ధరల కట్టడికి చర్యలు తీసుకోవాలని, అక్రమ నిల్వల వెలికితీతకు విజిలెన్స్ దాడులను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చెవిటివాని చెవిలో శంఖం ఊదిన చందంగా తయారైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కసారి కూడా వీటి గురించి కనీసం సమీక్షించిన దాఖలాలు లేకపోవడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రూ. 200 దాటిన కందిపప్పు.. బహిరంగ మార్కెట్లో కిలో కంది పప్పు ధర రూ.200 దాటిపోయింది. కిలో మినప్పప్పు రూ.210కి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కంటే చికెన్ ధరే తక్కువగా ఉంది. కిలో చికెన్ రూ. 120 - 130 ఉంటే కంది, మినప్పప్పు ధరలు రూ. 200 పైగా ఉన్నాయి. జీలకర మసూర పాత బియ్యం కిలో రూ. 52 నుంచి రూ. 55 వరకూ ఉంది. కొత్త బియ్యం ధర కూడా నాణ్యతను బట్టి కిలో రూ. 40 నుంచి 46 వరకూ ఉంది. పల్లీలు, చింతపండు, ఎండుమిర్చి, వంట నూనెలతోపాటు అన్ని నిత్యావసరాల ధరలు 8 నెలల క్రితంతో పోల్చితే 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కిలో రూ. 70 ఉన్న కందిపప్పు, మినప్పప్పు ధరలు ఇప్పుడు మూడు రెట్లు పెరిగాయి. కూర‘గాయాలే’...: కూరగాయల ధరలూ అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. కిలో ఉల్లిపాయల ధర మార్కెట్లో రూ. 35 నుంచి రూ. 40 వరకూ ఉంది. చింతపండు, మిరపకాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. కిలో ఎండుమిర్చి రూ. 130పైగా ఉంది. నాణ్యమైన చింతపండు కిలో రూ. 130పైగా ఉంది. రూ. 25 నుంచి 30 వరకూ వెచ్చించనిదే కిలో పచ్చిమిర్చి రావడంలేదు. భరించలేని భారం.. కొండెక్కిన రేట్లతో ఇంటిని నడపడం ఎంతో కష్టమవుతోంది. ఏడాదిలో బడ్జెట్ 50 శాతానికి పైగా పెరిగిపోయింది. ప్రభుత్వం పుణ్యమాని మినపపప్పు, కందిపప్పు రెట్టింపుకంటే పెరగడంవల్ల నచ్చిన టిఫిన్లు చేసుకోవడం మర్చిపోయాం. ఇడ్లీ, దోసెలు, పెసరట్లు చేయడమే లేదు. పప్పు వండడం తగ్గించుకున్నాం. రూ.50లకే రేషను కందిపప్పు ఇస్తామన్నారు... అదీ లేదు. రైతుబజార్లలో కుళ్లిపోయిన, నాణ్యతలేని కూరగాయలే దిక్కు. - కె. రాజేశ్వరి, గృహిణి, విశాఖపట్నం -
ధరాఘాతం
ఎకొండెక్కి కూర్చున్న నిత్యావసరాలు మధ్య తరగతికి బతుకు భారం వాచ్‌మేన్‌గా ఉంటూ, బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తూ నెలకు వచ్చే ఐఆరు వేల ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పప్పులు గతంలో కేజీ రూ.100కి కొనేవాడ్ని. ఇప్పుడు రెండొందలయింది. ఉల్లిపాయలు వారానికి రెండు కిలోలు కొనేవాడ్ని. ఇప్పుడు కేజీతోనే సరిపెడ్తన్నాను. పెరిగిన రేట్లతో బతకడం కష్టమైపోతుంది. గతంలో పిల్లల్ని సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లేవాళ్లం. ఇప్పుడు పిల్లలు అడిగినా తీసుకెళ్లడం లేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోతున్నాం. నెలకు రెండు వేలు అదనంగా ఖర్చవుతోంది. ధరలు తగ్గించకపోతే పేదలు, మధ్యతరగతి వాళ్లు బతకలేరు. అక్కయ్యపాలెంకు చెందిన వాచ్మెన్ దాకమర్రి కృష్ణ ఆవేదన ఇది.. మార్కెట్లో ఒక్క నిత్యావసర సరుకు ధర పెరిగితేనే అమ్మో! అంటాం. అలాంటిది పాలు, నీళ్లు తప్ప అన్నీ కొండెక్కి కూర్చుంటే ఏం చేస్తాం? వాటిని కిందకు దించేందుకు ప్రయత్నించే వారే కరువైతే ఏం చేస్తాం? బతకడం కోసం చచ్చినట్టూ కొనుక్కు తింటాం. ప్రతి మధ్య తరగతి కుటుంబం కొన్ని నెలలుగా అదే చేస్తోంది. అరకొర ఆదాయంతో అతికష్టంపై పిల్లాపాపలతో బతుకు బండి లాగిస్తోంది. సాక్షి, విశాఖపట్నం విశాఖపట్నం: మూడు నెలల క్రితం కిలో ఉల్లిపాయలు రూ.80లకు చేరితే అంతా అల్లాడిపోయారు. అయ్యబాబోయ్.. ఎంత ధరో! అంటూ లబలబలాడారు. రైతుబజార్లలో సబ్సిడీ ధరకు కుళ్లిపోయిన ఉల్లిపాయలను విక్రయిస్తున్నారంటే కిలోమీటర్ల మేర గంటలకొద్దీ నిలబడి కొనుక్కున్నారు. ఓపికలేని వారు కిలోలకు బదులు పాయలతోనే సరిపెట్టుకున్నారు. ఆ వెంటనే కాయగూరల రేట్లూ శరవేగంగా పెరిగిపోయాయి. గతంలో కిలో రూ.10కి, 20కి దొరికిన సాదాసీదా కూరగాయలు కూడా కోరలు చాచాయి. అంతలోనే నిత్యం ఇంట్లో అవసరమయ్యే మినపపప్పు, కందిపప్పు ధరలు పోటాపోటీగా ఎగబాకాయి. రెండు నెలల వ్యవధిలో అవి రెట్టింపయ్యాయి. దీంతో ఉల్లిపాయలకంటే ఒక్కొక్కటీ భారమవడంతో ఉల్లి ప్రతాపాన్ని మరిచిపోయారు. మార్కెట్లో ఉల్లి సరఫరా కాస్త మెరుగవడంతో ప్రభుత్వం సబ్సిడీ కౌంటర్లను ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పటికీ ఉల్లి కిలో రూ.40లు దిగనంటోంది. రేషన్‌షాపుల్లో కిలో రూ.50కే ఇస్తామన్న కందిపప్పు జాడలేకుండా పోయింది. ఏం తినాలి? ఎలా బతకాలి? సంపన్నులకే భారంగా మారిన ప్రస్తుత నిత్యావసర సరకుల ధరలు సామాన్య, మధ్య తరగతి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అసలే అంతంతమాత్రపు బతుకులతో ఉన్న వారికి పిల్లాపాపలతో పూట గడవడం కష్టతరమవుతోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ ఇంట్లో సగటున నెలకు మూడు కిలోల మినపపప్పు, రెండు కిలోల కిందిపప్పు, ఐదు కిలోల ఉల్లిపాయలు, నాలుగు లీటర్ల వంటనూనె అవసరమవుతుంది. ఇలాంటి వారంతా ఇప్పుడు సగానికి పైగా వీటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. ఇంట్లో టిఫిన్ల జోలికివెళ్లడం లేదు. హోటళ్లకెళ్లి తిందామంటే అక్కడ సైజు తగ్గించి, ధరలు పెంచేశారు. దీంతో మినపపప్పుతో వండే వంటకాలకు బదులు బియ్యం, ముంబై రవ్వలతో ఏదొకటి వండుకు తింటున్నారు. గతంలో వారానికి రూ.100కే సంచి నిండిన కూరగాయలు ఇప్పుడు రూ.200లైనా నిండడం లేదు. రూ.50లుండే కేబుల్ బిల్లు రూ.200లు చేసేశారు. నిన్న మొన్నటిదాకా ఒకింత అందుబాటులో ఉన్న చికెన్ ధరలు కూడా మళ్లీ ఎగబాకుతున్నాయి. ధరల భారం ఒకో ఇంటిపై నెలకు 2-3 వేల భారం పడుతోందని అంచనా. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ పోషణే కష్టమవుతుంటే అదుపు తప్పిన ధరల భారాన్ని మోయలేకపోతున్నారు. తమ చిన్నారుల సినిమా, షికార్లు వంటి సరదాలూ తీర్చలేకపోతున్నారు. ఇంట్లో పిల్లలకు ఇష్టమైన పిండివంటలనూ వండిపెట్టలేకపోతున్నారు. ‘సర్దుకుపోండిరా నాన్నా’ అంటూ నచ్చజెప్పుకుంటున్నారు. అనుబంధాలు ఆవిరి.. ఆకాశంలో విహరిస్తున్న ధరలతో అయిన వారెవరైనా ఇంటికి వస్తున్నారంటే ఆందోళన చెందే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో చుట్టాలు, స్నేహితులను ఆప్యాయంగా రమ్మని పిలిచిన వారే ఇప్పుడు ఏదోలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ధరలు అనుబంధాలను ఎలా ఆవిరి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. బతకడం కానాకట్టం.. మాది పేద కుటంబం. ఆరెంపీ వైద్యం చేసే నా పెనిమిటి (భర్త) తెచ్చే రెక్కల కష్టంతోనే ఇల్లు కట్టంగా గడుత్తుంది. నెలంతా కట్టపడితే ఏడెనిమిది వేలు డబ్బుల్రావడం నేదు. ఈ గవుర్మెంటు అన్ని సరుకులు రేట్లు పెంచుతూ పోతంది. మాలాంటోల్లు ఎలా బతుకుతారో ఆలోసించడం నేదు. పప్పులూ ఉప్పులూ పెరిగిపోతనాయి. పది సదువుతున్న నా కొడుకు పీజు కట్టడానికే ఈతరమాతరం అవుతంది. గతంలో ఆరేడు వేలతో నెట్టుకొచ్చేవోల్లం. ఇప్పుడు నెల నెలా రెండుమూడు వేలు అప్పుల్జేయాల్సి వస్తోంది. ధరలు తగ్గకపోతే మాలాంటో బతకడం కానాకట్టమే. -వరలక్ష్మి, గృహిణి, అశోక్‌నగర్ ఈ ధరలెప్పుడూ చూడలేదు.. ఇలాంటి ధరలు ముందెప్పుడూ చూడలేదు. ఇంటిల్లపాదికి ఎంత తక్కువలో చూసుకున్నా నాలుగైదు కేజీల కంది పప్పు, మినపప్పు అవసరం. నిత్యాసవర సరుకుల్లో వెయ్యి రూపాయలు కంది, మినపకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంపై ఆర్ధిక భారం పడుతోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోంది. ధరలు పెరగడంతో ఆకుకూరలు తినడం మానేసాం. పప్పు ఉంటేగాని ఆకుకూరలు వండుకోలేం. నాణ్యమైన పప్పులను రేషన్‌షాపుల ద్వారా ఇవ్వాలి. - కె.మహాలక్ష్మి, చిన్నూరు, అక్కయ్యపాలెం. అమ్మకాలు పడిపోయాయి.. ధరలు పెరగడం వల్ల అమ్మకాలు 30 శాతం పడిపోయాయి. కేజీ కొనేవారు అరకేజీయే కొంటున్నారు. మాకు పెట్టుబడులు పెరిగాయి. టిఫిన్లకు మినపపప్పు, పెసరపప్పులకు బదులు బియ్యం పిండిని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ధరలు తగ్గితేనే గాని అమ్మకాలు పెరగవు. లాభాలు రావు. -రేపాక రామకృష్ణ, కిరాణా షాపు. -
ఆర్భాటాలు ఎందుకు..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం వర్కింగ్ క్యాపిట్ కావాలని.. వందల కోట్లతో శంకుస్థాపనలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. ప్రచార ఆర్భాటాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావని తెలిపారు. టీడీపీ సర్కార్ ప్రజల ప్రధాన్యతలు, అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. మరో వైపు చంద్రబాబునాయుడు మా ఊరు- మా మట్టి అంటూ పండుగలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. సింగపూర్ ఒప్పందాల వెనక సీఎం చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రయోజనాలు ఏంటో.. త్వరలోనే బయట పడతాయని వ్యాఖ్యానించారు. -
ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ?
- అమలు విధానం వాయిదాకు అవకాశం - కొంత కాలం గడువు ఇవ్వాలని టీడీపీ డీలర్ల ఒత్తిళ్లు - అన్ని దుకాణాలకు అందని ఎలక్ట్రానిక్ కాటాలు వినుకొండ: నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు రేషన్ దుకాణాల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ (ఈ-పాస్)విధానానికి తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన డీలర్లు తెచ్చిన ఒత్తిడి మేరకే ఈ విధానం అమలును కొంతకాలంపాటు వాయిదా వేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోని చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్టు అధికారులు ముందుగానే ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు దాదాపుగా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ కాటాలను సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని షాపులకు ఇంకా రావాల్సివుందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాలు అన్ని షాపులకు అందజేయక పోవడాన్ని సాకుగా చూపి విధానం అమలును తాత్కాలికంగా వాయిదా వేయనున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలోని ఏ ఒక్క షాపు నుంచి కూడా కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. పాతపద్ధతి ప్రకారమే రేషన్ దుకాణాల నుంచి సరుకుల పంపిణీ జరుగుతుందని అంటున్నారు. రేషన్ దుకాణాల డీలర్లకు సరుకుల పంపిణీకి సంబంధించి ఇంకా రెవెన్యూ అధికారులు కీ రిజిస్టర్లు ఇవ్వలేదు. జిల్లాలో 2,713 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 567 దుకాణాల్లో ఈ-పాస్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తెనాలి డివిజన్లో ఇంకా 604 బయోమెట్రిక్ మెషీన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. కిరోసిన్ పంపిణీలో అమలు కాని ఈ-పాస్ విధానం.... కిరోసిన్ హాకర్లు ప్రతి నెల 10 నుంచి 20వ తేదీ వరకు రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేస్తారు. 20 నుంచి 28 వరకు డీలర్లు కార్డుదారులకు కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు వెళ్లి వేలు ముద్ర వేస్తే (ఈ-పాస్ విధానం) బియ్యం, కందిపప్పు, పంచదార, కిరోసిన్ తీసుకున్నట్లు వస్తుంది. కానీ కార్డుదారులకు ఆ సమయంలో కిరోసిన్ పంపిణీ జరగదు. దీంతో ప్రతి నెలా బ్లూకిరోసిన్ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది కిరోసిన్ హాకర్లకు, డీలర్లకు కాసులు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం ... జిల్లాలో ప్రధానంగా నరసరావుపేట, గురజాల డివిజన్ల పరిధిలో బయోమెట్రిక్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాటాలు రాష్ట్రంలోని అన్ని షాపులకు ఒక్కరే సరఫరా చేయాల్సి ఉంది. అందువల్ల కొంత జాప్యం జరుగుతోంది. అంతేతప్ప మరొక కారణం కాదు. త్వరలో ప్రతి చోటా ఈ పాస్ విధానం అమల్లో ఉంటుంది. - చిట్టిబాబు, డీఎస్వో -
సాపాటు లేదు..సాయం లేదు..
బియ్యం..నిత్యావసరాల ఊసులేదు ఇస్తామన్న రూ.2 వేల జాడలేదు పస్తులతో అలమటిస్తున్న ‘గంగపుత్రులు’ నిద్ర లేచింది మొదలు పొద్దుగుంకే వరకు సముద్రంతో సహజీవనం చేస్తారు. నడి సంద్రంలోకి వెళ్లి వేటాడటం.. తెచ్చిన మత్స్యసంపదను అమ్ముకోవడమే వీరికి తెలిసిన విద్య. వేటకెళ్తేనే వీరికి పూటగడుస్తుంది. వేటకెళ్లని నాడు పస్తులే. ఏటా ఏప్రిల్-మే నెలల్లో సంతానోత్పత్తి కాలంలో అమలులోకి వచ్చే వేటనిషేధం వీరి పాలిట ఆశని పాతమే అవుతుంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పత్తాలేకుండా పోతే వీరి పరిస్థితి అగమ్య గోచరమే. విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. -
ఫిబ్రవరి నుంచి ఆహార భద్రత
ఆహార భద్రత కార్డుల ద్వారా చౌకధరలపై నిత్యావసర సరుకులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 15 లోపుపరిశీలించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అనంతరం సంక్రాంతి పండుగ లోపు లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులను పంపిణీ చేయాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగిరం చేశారు. ఇప్పటివరకు సామాజిక పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలనతో తలమునకలైన యంత్రాంగం తాజాగా ఆహారభద్రత అర్జీల పరిశీలనకు ఉపక్రమించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో 13.65 లక్షల వ ుంది ఆహారభద్రత కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 34.14 శాతం దరఖాస్తుల పరిశీలన మాత్రమే అధికారులు పూర్తిచేశారు. వికారాబాద్ రెవెన్యూ డివిజన్లో ఈ ప్రక్రియ వందశాతం పూర్తికాగా, మిగతా డివిజన్లలో మాత్రం నత్తనడకన సాగుతోంది. ము ఖ్యంగా అత్యధిక దరఖాస్తులు వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మండలాల్లో పరిశీలన ప్రక్రియ కేవలం 4.14 శాతం మాత్రమే జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగి రి, కాప్రా సర్కిళ్లలో 5 శాతానికి మించలేదు. అర్జీల పరిశీలన ఆ లస్యంగా సాగుతుండడం.. మరోవైపు ప్రభుత్వం సైతం ఒత్తిడి పెంచుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిశీలన పూర్తయిన వికారాబాద్ డివిజన్లోని సిబ్బందిని గ్రేటర్‌కు రప్పించి ప్రక్రియను త్వరితంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 600 మంది ఉద్యోగులను గ్రేటర్ హైద్రాబాద్‌లో దరఖాస్తుల ప్రక్రియకు పంపింది. దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అర్హత నిర్ధారణ ఎలా..? ఇప్పటివరకు సామాజిక పింఛన్ల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులకు తాజాగా ఆహారభద్రత లబ్ధిదారులను తేల్చే అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సామాజిక పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను గుర్తించగా.. సమగ్ర కుటుంబ సర్వే(ఎస్కేఎస్) వివరాలతో సరిపోల్చే క్రమంలో వేలసంఖ్యలో అర్హులను తిరస్కరించింది. ఎస్కేఎస్ సాఫ్ట్వేర్, తాజాగా డాటా ఎంట్రీ సాఫ్ట్వేర్ మధ్య నెలకొన్న సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను నిలిపివేసి తప్పులు సరిదిద్దేందుకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకు సంబంధించి ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో పరిశీలన ప్రక్రియపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఎస్పీ ఖాతాకే కన్నం
సామాన్యుల ఇళ్లల్లో దొంగలు పడితే ఏం చేస్తాం?... పోలీసులను ఆశ్రయిస్తాం మరి పోలీస్ బాస్కే తెలియకుండా ఆయన ఖాతాకే కన్నం పెడితే... పరిస్థితి ఏమిటి? ఆ కన్నం పెట్టినోళ్లు కూడా పోలీసు అయితే...!? కరీంనగర్ జిల్లాలో ఇలాంటి విచిత్రమైన కుంభకోణమే జరిగింది. పోలీసులకు ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ మొత్తం ఎస్పీ ఖాతాలో జమకాగా, అందులోంచి ఏకంగా రూ.16 లక్షలను మాయం చే శారు. గుట్టు రట్టవడంతో ఆ మొత్తాన్ని మళ్లీ ఎస్పీ ఖాతాలోనే జమ చేసేందుకు సదరు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. కరీంనగర్ క్రైం :ఉన్నతాధికారులు మొదలు క్షేత్రస్థాయి వరకు సుమారు మూడువేల పైచిలుకు పోలీసు సిబ్బంది జిల్లాలో పనిచేస్తున్నారు. వీరందరికీ నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్‌ను కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ ద్వారా పోలీసు కుటుంబాలకు సరఫరా చేసే ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తోంది. అయితే గ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా పోలీసులకు అందజేయడం లేదు. సాధారణ వినియోగదారుడికి ఎంత వసూలు చేస్తున్నారో పోలీసు కుటుంబాల నుంచి కూడా అంతే మొత్తాన్ని వసూలు చేసి ఎస్పీ ఖాతాలో జమ చేస్తారు. ఆ తరువాత గ్యాస్ సరఫరా చేసిన ఏజెన్సీలు సబ్సిడీ ధర మినహా మిగిలిన మొత్తాన్ని డ్రా చేసుకుంటాయి. ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బును మాత్రం ఎస్పీ ఖాతాలోనే నిల్వ ఉంచుతారు. ఈ లెక్కన గత కొన్నేళ్లుగా ఎస్పీ ఖాతాలో రూ.లక్షల జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు పోలీసు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది. రూ.16 లక్షలు మాయం ఎస్పీ ఖాతాలో జమ అయిన మొత్తంపై పోలీసు శాఖలోని కొందరు అధికారుల కన్ను పడింది. పోలీస్ బాస్‌కు తెలియకుండానే ఖాతాను నిర్వహిస్తున్న ఓ అధికారితోపాటు కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది అందులోని డబ్బులను స్వాహ చేయడం ప్రారంభించారు. పోలీస్ వర్గాల సమాచారం మేరకు... ఇప్పటివరకు రూ.16లక్షలు మాయం చేసినట్లు తెలిసింది. అయితే గత నెలలో గ్యాస్ ఏజెన్సీ ఖాతాల లావాదేవీలపై అధికారులు ఆడిటింగ్ నిర్వహించారు. ఎస్పీ ఖాతాను నిర్వహిస్తున్న ఇన్చార్జి ఒకరు ఆడిటింగ్ అధికారులు తేల్చిన మొత్తం డబ్బు ఖాతాలో ఉందని పేర్కొంటూ సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. గత నెలలో వెలుగులోకి.. ఆడిటింగ్ అధికారులు వెళ్లిపోయిన తరువాత బ్యాంక్ ఖాతా లెక్కలను పరిశీలిస్తే సదరు ఇన్చార్జికి దిమ్మతిరిగి పోయింది. అందులో ఉండాల్సిన మొత్తం కంటే దాదాపు రూ.16 లక్షలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి సదరు ఇన్చార్జి కూడా అందులోనుంచి సుమారు రూ.3 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. మళ్లీ ఆ మొత్తాన్ని జమ చేయొచ్చని భావించి ఆ డబ్బును తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏకంగా రూ.16 లక్షలు ఖాతాలోంచి మాయం కావడంతో మిగిలిన రూ.13 లక్షలు ఎవరు కాజేశారని ఆరా తీయగా.. సదరు ఇన్చార్జి తర్వాత ఎస్పీ ఖాతా బాధ్యతలు చూస్తున్న వ్యక్తి ఒకరు ఆ డబ్బును డ్రా చేసినట్లు తెలిసింది. సదరు వ్యక్తి ఆ డబ్బుతో ఏకంగా స్విఫ్ట్ డిజైర్ కారును కొనుగోలు చేశాడని తెలియడంతో పోలీసు అధికారులు నిర్ఘాంతపోయారు. వెంటనే సదరు సిబ్బందిని పిలిపించి ఈ డబ్బులు కట్టాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా రెండు రోజుల తర్వాత కొంత మొత్తం చెల్లించి మిగిలిన రూ.10 లక్షల మొత్తాన్ని వారం రోజుల్లో జమ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ముఖం చాటేసిన అధికారి అయితే వారం రోజుల తరువాత రేపుమాపు డబ్బును జమ చేస్తానని చెబుతున్న వ్యక్తి గత 15 రోజులుగా కార్యాలయానికి రావడం లేదని తెలిసింది. అధికారులు అతని కోసం వెతుకుతున్నప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు ఎస్పీ అకౌంట్ నుంచి మాయమైన రూ.10 లక్షలు జమ చేయలేదని సమాచారం. ఎస్పీకి తెలిస్తే కఠిన చర్యలుంటాయని భయపడిన పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా రికవరీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి - ఎస్పీ వి.శివకుమార్ గ్యాస్ సబ్సిడీ ఖాతాలో డబ్బులు మాయమైన అంశాన్ని మంగళవారం రాత్రి ఁసాక్షి* ప్రతినిధి.. ఎస్పీ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సీరియస్‌గా స్పందించారు. ఁ్ఙఈ అంశం నా దృష్టికి రాలేదు. బాధ్యులను ఎవరినీ వదిలేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం** అని స్పష్టం చేశారు. -
ప్రచారార్భాటమే!
‘ఉచితం’ మూడింటికే పరిమితం బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి హుళక్కి సరఫరా లేదని చేతులెత్తేస్తున్న డీలర్లు పాడేరు: ఉచితంగా నిత్యావసర సరకుల పంపిణీపై ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. తుఫాన్ బాధితులందరికీ 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, కిలో పంచదార, లీటరు పామాయిల్, రెండు కిలోల కందిపప్పు, అరకిలో కారంపొడి, కిలో ఉప్పు, రెండు కిలోల బంగాళా దుంపలు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఊదరగొట్టేస్తున్నారు. అయితే వాస్తవంగా బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మరే వస్తువూ ఏజెన్సీలో పంపిణీ చేయడం లేదు. డిపోలకు మిగిలిన వస్తువులు చేరక పోవడంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. పౌరసఫరాల శాఖ నుంచి వస్తువులు సరఫరా చేయడంలోనే తీవ్రజాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ. బియ్యం, పంచదార, కిరోసిన్ పొందేందుకే మూడు రోజుల నుంచీ డిపోల చుట్టూ తిరుగుతున్న గిరిజనులు మిగిలిన వాటి కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలో అని వాపోతున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్డు దారులతోపాటు లేని వారికి కూడా వస్తువులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అన్నీ ఒకేసారి ఇస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. పంపిణీ వేగవంతం చేయాలి బియ్యం, కిరోసిన్, పంచదారకే పరిమితం చేయకూడదు. అన్ని వస్తువు లు సత్వరం పంపిణీ చేయాలి. ఒక్కో వస్తువు కోసం ఒక్కో రోజు తిరగడం గిరిజనులకు అసాధ్యంగా ఉంది. పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలరు. ఇప్పటికైనా డీఆర్ డిపోలో ఒకే రోజు అన్ని వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జీసీసీ అధికారులు చొరవ చూపాలి. పౌరసరఫరాల విభాగం కూడా ఉచిత నిత్యావసర వస్తువులను ఏజెన్సీకి త్వరితగతిన తరలించే ఏర్పాట్లు చేయాలి. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే మూడు వస్తువులే ఇచ్చారు ప్రభుత్వం పప్పు, బియ్యం, ఉప్పు, నూనె తదితర వస్తువులను ఇస్తామన్నా మాకు మూడే ఇచ్చారు. బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి రాలేదంటున్నారు. ఈ వస్తువుల కోసం పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలం. - కె.చిన్నమ్మి, రాయిగెడ్డ, ఇరడాపల్లి పంచాయతీ -
ఆక్రందన.. ఆవేదన
తుఫాన్ బాధితుల అష్టకష్టాలు సాయం అందక, వేదన తీరక జనం అగచాట్లు అన్ని చోట్లా అక్రమాలు, అన్యాయాలు అందని నీరు, ఆహార పొట్లాలు సామాన్యుల్లో ఆగ్రహావేశాలు సుడిగాలి గొడ్డలి వేటు తగిలిన విశాఖజిల్లా తెప్పరిల్లడానికి అష్టకష్టాలూ పడుతోంది. అస్తవ్యస్తమైన జనజీవనం తేరుకోవడానికి అన్నిశక్తులూ కూడదీసుకుంటోంది. అందుకు దోహదపడాల్సిన పాలనావ్యవస్థ మాత్రం అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులో లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న ఆక్రందన ఆగ్రహంగా రూపాంతరం చెందుతోంది. సాయం పక్కదారి పడుతోందన్న నిరసన నలుదిశలా వ్యక్తమవుతోంది. మరోవైపున కీలకమైన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అవరోధాలు దాటుకుంటూ నెమ్మదిగా సాగుతూ ఉండగా నీటి సమస్య మాత్రం అదే స్థాయిలో అవస్థలు పెడుతోంది. సాక్షి, విశాఖపట్నం : గంటలు రోజులవుతున్నాయి. పెనుతుఫాన్ తాకిడి కారణంగా నెలకొన్న దుర్భర పరిస్థితులు అతి నెమ్మదిగా తిరుగుముఖం పడుతున్నాయి. అయితే అనేక ఈ సంక్షోభ పరిస్థితిలో అందాల్సిన సాయం ఆశించిన స్థాయిలో లేదన్న నిరాశానిస్పృహలు ఎల్లెడలా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న అట్టడుగు వర్గాల వారి అవస్థలు ఇప్పటికీ చెప్పనలవికాకుండా ఉన్నాయి. ఆహారం కోసం, నీటి కోసం వీరు చేస్తున్న దీనాలాపాలు జిల్లా నలుమూలలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఖర్చు భరించగలిగే వారి పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపించినా, రెక్కాడితే కాని డొక్కాడని వారి పరిస్థితులే దయనీయంగా ఉన్నాయి. చాలా చోట్ల సాయం పక్కదారి పడుతుం డడంతో బాధితుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. తుఫాన్ అనంతరం మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆహార పొట్లాలతో వాహనం వస్తే చాలు ఎగబడి లాక్కునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఇంటికీ ఆహారం-మంచినీళ్లు యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. వేలాది మంది బాధితులు ఆహార పొట్లాల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం లేకుండా ఉంది. ఆహారం అందడం లేదన్న ఆవేదన అందరి నుంచి వినిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి తరలించిన నిత్యావసరాల పంపిణీ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే లు తమ అనుచరులకు కట్టబెట్టడంతో వారు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యేలు పంపించిన నిత్యావసరాలు, కాయగూరలను విశాఖ వెంకోజీ పాలెంలో స్థానిక నాయకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తుండడం తో అక్కడివారు మండిపడ్డారు. దాంతో పంపిణీని నిలిపేశారు. కలెక్టరేట్‌కు తరలించిన ఆహార పొట్లాలు అందక జాలరిపేట, రెల్లివీధివాసులు శాపనార్ధాలు పెడుతుండడంతో పోలీసులు కల్పించుకుని వారిని చెదరగొట్టారు. జిల్లాలో శిథిలాల తొలగింపు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. జాతీయ రహదారిపై, ప్రధాన రహదారులపై పను లు జోరుగా సాగుతున్నాయి. కానీ అంతర్గత రహదారులు, మారు మూల ప్రాంతాల్లో నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు ప్రభుత్వం చెబుతున్నట్టుగా చకచకా సాగడం లేదు. ఉన్నత వర్గాల వారుంటున్న ప్రాంతాలకిస్తున్న ప్రాధాన్యాన్ని సందుగొందులు, మురికివాడలకు ఇవ్వడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. బాధితులను అందరి కంటే ముందుగా ఆదుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారన్న ఆక్షేపణ వినిపిస్తోంది. మరొక పక్క రాష్ర్టంలోని 12 కార్పొరేషన్లతో పాటు 50 మున్సిపాల్టీల నుంచి సుమారు ఏడువేల మంది కార్మికులొచ్చినా వారికి ఏం చేయాలో చెప్పేవారే లేకుండా పోయారు. వారిని పట్టిం చుకునే వారూ లేరు. గోపాలపట్నం, గాజువాక ప్రాంతాల్లో అతికష్టమ్మీద విద్యుత్ సరఫరాను పునరుద్దరించగలిగారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కాస్త తగ్గింది. నిత్యావసరాల ధరలు అందుబాటులోకి వచ్చినా సక్రమంగా లభించడం లేదు. దాదాపు అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. అంతా నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. ఎవరూ పట్టించుకోలేదు.. మామిడిచెట్టుకూలిపోయి ఇల్లుమొత్తం ధ్వంసమైంది. నేను, నా కుమార్తెలు మొండిగోడల మధ్యే కాలం గడుపుతున్నాం. ఎవరూ పట్టించుకోలేదు. చెట్టు తొలగించలేదు. ఆహార పొట్లాలు కూడా లభించలేదు. - మీనాక్షమ్మ, ఊర్వశి సెంటర్, గౌరీనగర్ మంచినీళ్లు లేవు.. నాలుగురోజులుగా మంచినీళ్లందక చాలా ఇబ్బందులు పడుతున్నాం. బోర్లు పనిచేయడం లేదు. నల్లాల్లో మంచినీళ్లు రావడం లేదు. ట్యాంకర్లు ఎప్పుడొస్తున్నాయో తెలియడం లేదు. మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. - రత్నమాల, మహిళా సంఘం నాయకురాలు, కైలాసపురం ఆహారపొట్లాలేవీ? అక్కయ్యపాలెం గోలీలిపాలెంలో 200 కుటుంబాలకు పైగా ఉంటున్నాం. నాలుగు రోజులుగా ఏ ఒక్కరూ మాసందులోకి తొంగిచూడలేదు. ఆహార పొట్లాలు కాదు కదా కనీసం మంచినీళ్లు కూడా పంపిణీ చేయలేదు. - ఎన్.రమ, గోలీలిపాలెం -
పేదల నోటికి చేదుకాలం
పండుగల వేళ పిండివంటల మాట అటుంచి పేదల ఇళ్లలో నిత్యావసర సరుకులే నిండుకుంటున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో అదనపు రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు.. ఎప్పుడూ ఇచ్చే సరుకులకే ఎగనామం పెట్టారు. బియ్యం, పంచదార, కిరోసిన్ తప్ప ఇతర నిత్యావసర సరుకులు కార్డుదారులకు దూరమయ్యాయి. మరొకపక్క అనేక సాకులతో కార్డుల్లో ఉన్న సభ్యులను తొలగించడమే కాక.. కార్డులకూ కోత పెడుతున్నారు. సాక్షి, కాకినాడ :జిల్లాలోని 2,561 రేషన్‌షాపుల పరిధిలో 15,28,598 కార్డులున్నాయి. వీటిలో 13,52,429 తెల్లకార్డులుండగా, రచ్చబండ-2లో ఇచ్చిన మరో 87,477 కూపన్లున్నాయి. ఇక అంత్యోదయ అన్నయోజన కార్డులు 87,018, అన్నపూర్ణ కార్డులు 1,674 ఉన్నాయి. గత మార్చి వరకు బియ్యం, కిరోసిన్, పంచదారతో పాటు తొమ్మిది నిత్యావసరసరుకులను ‘అమ్మహస్తం’లో పంపిణీ చేయగా ఏప్రిల్ నుంచి పామాయిల్ సరఫరాను నిలిపివేశారు. తర్వాత ఒక్కొక్కటిగా అమ్మహస్తం సరుకులన్నింటికీ ఎసరు పెట్టారు. పూర్వం నుంచీ ఇస్తున్న కందిపప్పును కూడా గత మూడు నెలలుగా ఇవ్వడం మానేశారు. చివరికి ‘ఉప్పు’ను కూడా జాబితా నుంచి తొలగించారు. అక్టోబర్ నుంచి కేవలం బియ్యం, కిరోసిన్, పంచదార మాత్రమే పంపిణీ చేయనున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక పేదలు గగ్గోలు పెడుతున్నారు. పండుగలవేళ పిండివంటలు కాదు కదా.. కనీసం పప్పన్నానికీ గతి లేకుండా చేశారని వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా నిలిపి వేసిన సరుకుల ధరలు బహిరంగ మార్కెట్లో భగ్గుమంటున్నాయి. రేషన్‌షాపులో రూ.40కు సరఫరా చేసే కిలో పామాయిల్ మార్కెట్లో రూ.55-60 మధ్య, రూ.50కే సరఫరా చేసే కిలో కందిపప్పు బయటమార్కెట్లో రూ.80కు పైగా, రూ.17కే సరఫరాచేసే కిలో గోధుమపిండి రూ.25-30 మధ్యచ అరకిలో రూ.6.75కు సరఫరా చేసే చక్కెర కిలో రూ.35-40 మధ్య, రూ.5కు సరఫరా చేసే కిలో ఉప్పు రూ.10-15 మధ్య పలుకుతున్నాయి. జన్మభూమి పుణ్యమాని ఈ నెల రేషన్ సరుకుల తరలింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో రేషన్‌షాపుల్లో సరుకులందక పేదలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. సర్కారుకు నెలకు రూ.4.5 కోట్ల ఆదా! గత రెండుమూడు నెలలుగా సరుకులు తీసుకోనందున, మనుగడలో లేనట్టు పరిగణించి 3.87 లక్షల యూనిట్ల (కార్డుల్లోని సభ్యులు)కుఅక్టోబర్ నుంచి సరుకులు నిలిపివేశారు. కొన్ని కార్డుల్లో ఒకరిద్దరిని లేనట్టు లెక్కించి, సరుకులు నిలిపివేస్తే మరికొన్ని కార్డులనే పక్కన పెట్టేశారు. యూనిట్ల పరంగా చూస్తే కాకినాడ డివిజన్లో 74,886 మందికి, రాజమండ్రిలో 1,02,616 మందికి, అమలాపురంలో 67,422 మందికి, పెద్దాపురంలో 77,249 మందికి, రామచంద్రపురంలో 49,011 మందికి, రంపచోడవరంలో 22,082 మందికి సరుకులు నిలిపి వేశారు. ఇలా ప్రభుత్వానికి నెలకు రూ.నాలుగున్నర కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. నిజానికి మనుగడలో లేరని తొలగించిన కార్డుదారుల్లో చాలా మంది బతికే ఉన్నారని, పనుల నిమిత్తం నెలల తరబడి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే సరుకులు తీసుకోలేకపోయారని అంటున్నారు. మరొక పక్క ఆధార్ సాకుతో రేషన్‌కార్డుల్లో భారీగా కోత పెట్టారు. జిల్లాలోని తెల్లరేషన్‌కార్డుల ద్వారా 47,79,552 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో ఇప్పటి వరకు ఆధార్ నంబర్లు సమర్పించిన వారు 41,74,722 మంది. మరో 6 లక్షల మందిని ఆధార్ నమోదు చేసుకోని కారణంగా తిరస్కరించారు. ఈ నెల నుంచి మనుగడలో లేని వారిని తొలగించిన ప్రభుత్వం దశలవారీగా ఆధార్ నంబర్లు లేని వారికి, వివిధ కారణాలతో తిరస్కరించిన వారికి కూడా సరుకులు నిలిపివేయనుందని చెబుతున్నారు. జనాగ్రహానికి వేదిక కానున్న జన్మభూమి.. తమ కార్డులను తొలగించడం అన్యాయమంటూ మామిడికుదురు మండలం లూటుకుర్రులో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభలో బాధితులు అధికారులను నిలదీశారు. ఇదే పరిస్థితి మరికొన్ని చోట్ల జరిగిన సభల్లో కూడా కనిపించింది. ఈ నెల 20 వరకు జరగనున్న జన్మభూమి సభల్లో ఒక వైపు పింఛన్లు..మరొక వైపు కోతపెట్టిన లక్షలాది కార్డుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని అధికారులు గుబులు పడుతున్నారు. -
వరద ముంపులో బుచ్చెంపాలెం
దేవరాపల్లి: మండలంలోని వాలాబు రిజర్వాయరు నుంచి పోటెత్తిన వరదనీరు శనివారం బుచ్చెంపాలెం గ్రామాన్ని ముంచెత్తింది. వర్షా లకు రిజర్వాయరులో నీటి మట్టం పెరిగిపోవడంతో గ్రామంలో జనం ఎటూ వెళ్లలేని పరిస్థితి చోటుచేసుకుంది. ఏ క్షణాన వరదనీరు తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనన్న భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ఎదురు చూపుఇక్కడ 18 కుటుంబాలవారు నిత్యావసరాలు, వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామంలో జ్వరాలతోపాటు కునెపు నర్సమ్మ(60) శుక్రవారం రాత్రి వంటచేస్తుండగా అగ్నిప్రమాదానికి గురైంది. వైద్యసిబ్బంది పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు చర్యలు శూన్యం ముంపునకు గురవుతున్న ఈ గ్రామానికి వెళ్లేం దుకు దేవరాపల్లి ఎస్ఐ ఇ. లక్ష్మణరావు శుక్రవారం ప్రయత్నించారు. సెల్‌ఫోన్ సాయంతో వారి క్షేమసమాచారాన్ని తెసుకొని వారిని ముం పునుంచి బయటపడాలని కోరారు. ఈ పరిస్థితుల్లో ఒకే నాటుపడవ ఉందని, మీరు రావద్దని, మేము రాలేమని ఆ గ్రామస్థులు చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారని గ్రామస్తులు విలేకరులకు చెప్పారు. -
పామోనిల్
- ఆరు నెలలుగా అందని పామోలిన్ - ఇక సరఫరా కష్టమేఅంటున్న అధికారులు - పౌర సరఫరాలలో ప్రతిసారీ ఇదే తంతు సాక్షి, కడప: బాబు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. రుణాల మాఫీ నుంచి నిత్యావసర సరుకుల వరకు సక్రమంగా అందిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. రెండు నెలలుగా అన్న ఎన్టీఆర్ పేరుతో అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తామని బీరాలు పలుకుతూ వస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం పామోలిన్‌కు మంగళం పాడినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటుండటాన్ని చూస్తే భవిష్యత్తులో పంపిణీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సబ్సిడీ రేట్ల దృష్ట్యా పంపిణీ చేయడం కుదరదని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితిని పరిశీలిస్తే పామోలిన్ సరుకుల జాబితా నుంచి తొలగిస్తారని సంబంధిత శాఖ అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. ఆరు నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : అంతకుముందు రాష్ట్రపతి పాలనలో మూడు నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలు కలుపుకొని దాదాపు ఆరు నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారినా పామోలిన్ ఆయిల్ మాత్రం సక్రమంగా పంపిణీ జరిగేది. ప్రస్తుతం ఆరు నెలలుగా మండలాల్లోని రేషన్ డీలర్లకు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పండుగలు వచ్చినా సరుకు పంపిణీకి మాత్రం నోచుకోలేదు. ప్రతి వంటలోనూ నూనె వాడకం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పామోలిన్ సరఫరా చేయకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చౌక వస్తువుల్లోనూ కోత: జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా 7,48,575 మంది కార్డుదారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి అమ్మహస్తం పథకంలో పంపిణీ చేసే చాలా వస్తువులు ప్రస్తుతం కోత పెట్టారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర మాత్రమే అన్ని గోడౌన్లకు పంపి రేషన్షాపులన్నింటికీ అందించారు. అయితే గోధుమపిండి మాత్రం కడప, చెన్నూరు, ఎర్రగుంట్ల, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి, ఒంటిమిట్ట, సిద్ధవటం, పోరుమామిళ్ళ, జమ్మలమడుగు, ముద్దనూరు, పులివెందుల, వేంపల్లికి మాత్రమే అందించగా మిగతా ప్రాంతాలకు గోధుమపిండి కొరత ఏర్పడింది. కందిబేడలకు సంబంధించి కూడా జిల్లాలోని చెన్నూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్నమండెం, ముద్దనూరు, పులివెందుల సెంటర్లకు మాత్రమే పంపించారు. సరుకు ఉన్న మేరకు మాత్రమే పంపండంతో చాలా మండలాలకు కందిపప్పు ప్రస్తుతానికి అందేటట్లు కనిపించడం లేదు. గోధుమలు కూడా కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో మాత్రమే సరఫరా చేశారు. అమ్మహస్తం పథకంలో భాగంగా 9 వస్తువులను సరఫరా చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారికి మాత్రం ఒక్క బియ్యం, చక్కెర పూర్తిగా అన్ని రేషన్‌షాపులకు అందిస్తుండగా మిగతా వస్తువులను మాత్రం పూర్తిస్థాయిలో కోత విధించారు. పౌర సరఫరాల శాఖ డీఎం ఏమంటున్నారంటే ప్రస్తుతం సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల విషయంలో కోత పెడుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బుల్లయ్య దృష్టికి తీసుకుపోగా.. ప్రస్తుతానికి పామోలిన్ రాలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమేనని.. పామోలిన్‌ను రేషన్ సరుకుల జాబితా నుంచి తొలగించే అవకాశముందన్నారు. ఈసారి బియ్యం, చక్కెరతోపాటు కొంతమేర స్టాక్ ఉన్న కందిబేడలు, గోధుమపిండి, గోధుమలు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. -
ఎగ్జిబిట్.. రెడీమేడ్!
ఒక్కోదానికి రూ.3 వేల ధర సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తరగతి గదులకే పరిమితమవుతున్న విద్యార్థుల సృజనాత్మకత చోద్యం చూస్తున్న అధికారులు హన్మకొండ చౌరస్తా : మార్కెట్లో నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. ఏదేని వస్తువును కొనుక్కోవచ్చు. కానీ, విద్యార్థులు తయారు చేసి.. ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించే ఎగ్జిబిట్లు కూడా ఇప్పుడు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. ఈ దందాను సాక్షాత్తు ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడే నిర్వహిస్తూ దండుకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రతి నెల వేలాది రూపాయల వేతనం తీసుకుంటూ అదనపు సంపాదనకు కోసం అర్రులు చాస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆరోపణలు వెల్లువెత్తినా.. అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది. రెడీమేడ్ ఎగ్జిబిట్ల రంగ ప్రవేశంతో విద్యార్థుల సృజనాత్మకత తరగతి గదులకే పరిమితమవుతున్న క్రమంలో ఇలాంటి దందాతో విద్యార్థుల సృజనాత్మ శక్తి అంతరించిపోయే ప్రమాదం ఉందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఇన్స్పైర్-2014ను దశలవారీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయ్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇన్‌స్పైర్‌లో ఎగ్జిబిట్లు ప్రదర్శించవచ్చు. కాగా, ఎగ్జిబిట్‌ను రూపొందిం చేందుకు ప్రభుత్వం ఆయా పాఠశాలలకు చెందిన ప్రతి విద్యార్థికి రూ. 5వేలు అందజేస్తుంది. ఇందులో రూ. 2,500 ఎగ్జిబిట్‌ను తయారు చేసేం దుకు కావాల్సిన ముడిసరుకు కోసం, మరో రూ. 2500లు ప్రయాణ, ఇతర ఖర్చులకు చెల్లిస్తుంది. అయితే విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టి వారిని ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయులు.. పాఠశాల నుంచి ఏవో ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తే చాలనుకుని విద్యార్థులకు తెలియకుండానే రెడీమేడ్‌గా ఎగ్జిబిట్లను తయారు చేయించి ప్రదర్శనలో ఉంచుతుండడం గమనార్హం. ఎగ్జిబిట్లను అమ్ముకుంటున్న ఉపాధ్యాయుడు ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో వి ధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెడీమెడ్ ఎగ్జిబిట్లను తయారుచేసి అమ్ముతున్నాడు. హన్మకొండ జులైవాడలోని ఆయన ఇల్లును ఏకం గా ఎగ్జిబిట్లు తయారుచేసే కుటీర పరిశ్రమగా మా ర్చుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఎగ్జిబిట్ల తయారీకి డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులను కూలీలుగా పెట్టుకున్నాడు. కాగా, సదరు ఉపాధ్యాయుడు ఒక్కో ఎగ్జిబిట్‌ను రూ. 3000 చొప్పున విఖ్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, ఎగ్జిబిట్లను కొనుగోలు చేసేందుకు మన జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ నుంచి వస్తున్నారంటే అతడి వ్యాపారం ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరితే... ‘నా ఇంటిపైన ఎగ్జిబిట్లను తయారు చేసి అమ్ముతున్న మాట వాస్తవమే. వాటికీ.. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎగ్జిబిట్ల తయారీకి గైడ్‌గా వ్యవహరించాలని కొందరు విద్యార్థులు కోరితే సరేనన్నా. అయినా... ఎగ్జిబిట్లను తయారు చేసే వారందరూ డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులే. చదువుకుంటూ ఉపాధి పొందడంలో తప్పేముంది.’ అని సమాధానమిచ్చాడు. -
సహకార సంఘాలకు రేషన్ దుకాణాలు
మంత్రి దినేశ్ గుండూరావు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి సహకార సంఘాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. తన శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. రేషన్ షాపులు వంశ పారంపర్యంగా కొందరికే పరిమితమవుతున్నాయని, దీని వల్ల ఫిర్యాదులు కూడా ఎక్కువవుతున్నాయని వెల్లడించారు. ఇకమీదట వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, గ్రామ పంచాయతీలకు రేషన్ షాపులను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాగా పని చేస్తున్న స్వయం సహాయక సంఘాలకు కూడా షాపులను కేటాయిస్తామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న షాపులను కాలక్రమేణా రద్దు చేస్తూ పోతామని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సహకార సంఘాల చేతుల్లోకి వెళ్లాలనేది ప్రభుత్వ ఆశయమని తెలిపారు. కాగా రాష్ర్టంలో కొత్తగా వెయ్యి రేషన్ షాపులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీటిని మంజూరు చేసేటప్పుడు వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రేషన్ షాపులకు భవనాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. లెవీకి స్వస్తి రాష్ట్రంలో ఇకమీదట రైస్ మిల్లర్ల నుంచి లెవీ బియ్యాన్ని సేకరించే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి బదులు రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ధాన్యాన్ని ఆహార, పౌర సరఫరాల శాఖ బియ్యం ఆడించి రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’కు తరలిస్తామని తెలిపారు. -
టమోత.. ఉల్లి ఘాటు
నల్లగొండ టుటౌన్ : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా టమాటా, ఉల్లి ధరలు రోజు రోజుకూ పోటా పోటీగా పెరుగుతుండడంతో సామాన్యులు వాటిని కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కేజీ టమాటా రూ. 50 ఉండగా, ఉల్లిగడ్డలు కిలో రూ.28లు పలుకుతోంది. వర్షాభావ పరస్థితులే టమాటా, ఉల్లిగడ్డల ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. గత సంవత్సరం వర్షాలు అధికంగా కురవడంతో పంటలు దెబ్బతిని ఉల్లి ధరలు పెరిగాయి. ఈ సంవత్సవం వర్షాలు తక్కువగా కురవడంతో నిత్యావసరాలు వినియోగదారుడికి భారంగా మారుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో టమాటా కిలో రూ. 20 ఉంటే ప్రస్తుతం రూ. 50 నుంచి రూ. 60 లకు పెరిగింది. గత సంవత్సరం కిలో రూ. 10గా ఉన్న ఉల్లి వారం క్రితం రూ.20లకు కిలోగా ఉండగా ప్రస్తుతం కిలో రూ.28 పలుకుతోంది. ప్రతి రోజు కూరల్లో వినియోగించే టమాట, ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. చిత్తురు టు నల్లగొండ ప్రతి సంవత్సరం నల్లగొండ కూరగాయల మార్కెట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా వచ్చే టమాటా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. లోకల్ నుంచి టమాటా రాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇదే ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇక్కడ వర్షాలు కురవక పోవడంతో టమాటా సాగు చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. నల్లగొండ మార్కెట్‌కు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, కలిగిరి ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతోంది. దాంతో ట్రాన్స్‌పోర్టు చార్జీలే అధికమవుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు ఉల్లిగడ్డలు జిల్లాకు ఎక్కుగా మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతాయి. గత ఏడాది కిలో రూ.10లు ఉన్న ఉల్లి ఈసారి ఏకంగా రూ. 28లకు చేరింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలే ధరల పెరగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అప్పుడు వచ్చిన భారీ వర్షాలకు ఉల్లిపంట కొట్టుకుపోయాయి. అప్పటి ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఉల్లి , టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పటి వర్షాలే కారణం మహారాష్ట్రలో గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా ఉల్లి దిగుమతి తగ్గిపోయిందని హైదరాబాద్ వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ఉల్లి ధరలు పెరిగాయి. మల్లీ కొత్త ఉల్లిగడ్డలు వచ్చే వరకు ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. - పున్న గీత, వ్యాపారి లోకల్ టమాటా రావడంలేదు నల్లగొండ చుట్టు పక్కల ప్రాంతాల నంచి వచ్చే టమాటా పూర్తిగా బంద్ అయ్యింది. వర్షాలు కురవక రైతులు టమాటా సాగు చేయలేదు. చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ట్రాన్స్‌పోర్టు చార్జీలే ఎక్కువై ధర పెరిగింది. - చింత యాదగిరి, కూరగాయల వ్యాపారి -
ఆపరేషన్
కలెక్టరేట్: బోగస్ రేషన్ కార్డులకు ఇక చెక్ పడనుందా? దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను రాయితీపై అందిస్తుంది. ఇందుకోసం జిల్లాలో దాదాపు 1,332 చౌకధరల దుకాణాలు. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ ఇతర కార్డులు కలిపి దాదాపు ఏడు లక్షలకు పైగా ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకు బోగస్ కార్డులు ఉన్నట్లు అధికారు లు అంచనా వేశారు. జరగని కార్డుల విభజన జిల్లాలో రేషన్ దుకాణాల సంఖ్య పెరుగుతున్నా, కార్డుల విభజనకు మాత్రం రాజకీ య గ్రహణం చుట్టుకుంది. కార్టుల విభజ న ఎప్పుడు మెదలు పెట్టినా రాజకీయ ఒత్తి డి కారణంగా మధ్యలోనే నిలిచిపోతోంది. 2008, 2009లో ఈ ప్రక్రియను మొదలు పెట్టిన అధికారులు ఓ బడానేత, యూని యన్ నాయకుల ఒత్తిడి మేరకు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కార్డులు తక్కువగా ఉన్న రేషన్ దుకాణాల వారికి నష్టం తప్పలేదు. నగరంలో ఇలా జిల్లా కేంద్రంలో 87 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందు లో దాదాపు 25 దుకాణాల పరిధిలోనే వెయ్యి నుంచి ఐదు వేల కార్డుల వరకు ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి పౌరసరఫరాల కమిషనర్ నిబంధనల మేరకు ఒక్కో రేషన్ షాపులో, మున్సిపాలిటీ పరిధి అయితే 600 నుంచి 650, గ్రామీణ, మండల పరిధి అయితే 400 నుంచి 450 కార్డులు మాత్రమే ఉండాలి. నగరం లో చాలా దుకాణాలలో బోగస్ కార్డులతోపాటు, నిబంధనలకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రీ సైక్లింగ్ చేస్తూ అడ్డం గా దొరకిపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో వెలుగు చూశాయి. అవి కూడా నిజామాబాద్ నగరానికి సంబంధించిన రేషన్ డీలర్ల బియ్యమే అని అధికారులు కూడా తేల్చారు. దీనిపై సీరియస్‌గా స్పం దించిన జేసీ, కమిషనర్‌కు లేఖ రాశారు. వెంటనే కార్డుల విభజన మొదలు పెట్టాలని, బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. పనిలో పనిగా ఎలాగూ ప్రస్తుతం కార్డులపై ‘డబ్ల్యూఏపీ’ అక్షరాలను తొలగించి, ఆ స్థానంలో డబ్ల్యూటీఎస్ను చేరుస్తున్నారు. పనిలో పనిగా కార్డుల విభజన చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలో 62 వేల పాత గులాబీ కార్డులు, 40 వేల పింఛన్‌దారులు, మిగతా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్ ఉద్యోగులను కలుపుకొని దాదాపు 30 వేల మంది, ఏపీఎల్ కుటుంబానికి చెందిన వారు మరో 25 వేల మంది వరకు ఉంటారు. ఇవన్నీ కలిపితే దాదాపు లక్షన్నర వరకు పింక్ కార్డులు ఉంటాయి. జిల్లాలో దాదాపు రెండు లక్షల వరకు కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలలో లెక్కకు మించిన కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు మరో అడుగు ముం దుకేసి రచ్చబండలో ముందుగానే బినామీ పేర్లతో కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏడు లక్షల వరకు కార్డుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నగరంలో 26 దుకాణాలు, జిల్లావ్యాప్తంగా మరో వంద రేషన్ షాపుల విభజనకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో జిల్లావ్యాప్తం గా మరో 150 వరకు రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.