సామాన్యుల ఇళ్లల్లో దొంగలు పడితే ఏం చేస్తాం?... పోలీసులను ఆశ్రయిస్తాం మరి పోలీస్ బాస్‌కే తెలియకుండా ఆయన ఖాతాకే కన్నం పెడితే... పరిస్థితి ఏమిటి? ఆ కన్నం పెట్టినోళ్లు కూడా పోలీసు అయితే...!? కరీంనగర్ జిల్లాలో ఇలాంటి విచిత్రమైన కుంభకోణమే జరిగింది. పోలీసులకు ప్రభుత్వం ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ మొత్తం ఎస్పీ ఖాతాలో జమకాగా, అందులోంచి ఏకంగా రూ.16 లక్షలను మాయం చే శారు. గుట్టు రట్టవడంతో ఆ మొత్తాన్ని మళ్లీ ఎస్పీ ఖాతాలోనే జమ చేసేందుకు సదరు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
కరీంనగర్ క్రైం :ఉన్నతాధికారులు మొదలు క్షేత్రస్థాయి వరకు సుమారు మూడువేల పైచిలుకు పోలీసు సిబ్బంది జిల్లాలో పనిచేస్తున్నారు. వీరందరికీ నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్‌ను కూడా ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ ద్వారా పోలీసు కుటుంబాలకు సరఫరా చేసే ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తోంది. అయితే గ్యాస్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా పోలీసులకు అందజేయడం లేదు.
సాధారణ వినియోగదారుడికి ఎంత వసూలు చేస్తున్నారో పోలీసు కుటుంబాల నుంచి కూడా అంతే మొత్తాన్ని వసూలు చేసి ఎస్పీ ఖాతాలో జమ చేస్తారు. ఆ తరువాత గ్యాస్ సరఫరా చేసిన ఏజెన్సీలు సబ్సిడీ ధర మినహా మిగిలిన మొత్తాన్ని డ్రా చేసుకుంటాయి. ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బును మాత్రం ఎస్పీ ఖాతాలోనే నిల్వ ఉంచుతారు. ఈ లెక్కన గత కొన్నేళ్లుగా ఎస్పీ ఖాతాలో రూ.లక్షల జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు పోలీసు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంది.
రూ.16 లక్షలు మాయం
ఎస్పీ ఖాతాలో జమ అయిన మొత్తంపై పోలీసు శాఖలోని కొందరు అధికారుల కన్ను పడింది. పోలీస్ బాస్‌కు తెలియకుండానే ఖాతాను నిర్వహిస్తున్న ఓ అధికారితోపాటు కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది అందులోని డబ్బులను స్వాహ చేయడం ప్రారంభించారు. పోలీస్ వర్గాల సమాచారం మేరకు... ఇప్పటివరకు రూ.16లక్షలు మాయం చేసినట్లు తెలిసింది.
అయితే గత నెలలో గ్యాస్ ఏజెన్సీ ఖాతాల లావాదేవీలపై అధికారులు ఆడిటింగ్ నిర్వహించారు. ఎస్పీ ఖాతాను నిర్వహిస్తున్న ఇన్‌చార్జి ఒకరు ఆడిటింగ్ అధికారులు తేల్చిన మొత్తం డబ్బు ఖాతాలో ఉందని పేర్కొంటూ సంబంధిత పత్రాలపై సంతకం చేశారు.
గత నెలలో వెలుగులోకి..
ఆడిటింగ్ అధికారులు వెళ్లిపోయిన తరువాత బ్యాంక్ ఖాతా లెక్కలను పరిశీలిస్తే సదరు ఇన్‌చార్జికి దిమ్మతిరిగి పోయింది. అందులో ఉండాల్సిన మొత్తం కంటే దాదాపు రూ.16 లక్షలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి సదరు ఇన్‌చార్జి కూడా అందులోనుంచి సుమారు రూ.3 లక్షలు తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. మళ్లీ ఆ మొత్తాన్ని జమ చేయొచ్చని భావించి ఆ డబ్బును తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఏకంగా రూ.16 లక్షలు ఖాతాలోంచి మాయం కావడంతో మిగిలిన రూ.13 లక్షలు ఎవరు కాజేశారని ఆరా తీయగా.. సదరు ఇన్‌చార్జి తర్వాత ఎస్పీ ఖాతా బాధ్యతలు చూస్తున్న వ్యక్తి ఒకరు ఆ డబ్బును డ్రా చేసినట్లు తెలిసింది. సదరు వ్యక్తి ఆ డబ్బుతో ఏకంగా స్విఫ్ట్ డిజైర్ కారును కొనుగోలు చేశాడని తెలియడంతో పోలీసు అధికారులు నిర్ఘాంతపోయారు. వెంటనే సదరు సిబ్బందిని పిలిపించి ఈ డబ్బులు కట్టాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా రెండు రోజుల తర్వాత కొంత మొత్తం చెల్లించి మిగిలిన రూ.10 లక్షల మొత్తాన్ని వారం రోజుల్లో జమ చేస్తానని చెప్పినట్లు సమాచారం.
ముఖం చాటేసిన అధికారి
అయితే వారం రోజుల తరువాత రేపుమాపు డబ్బును జమ చేస్తానని చెబుతున్న వ్యక్తి గత 15 రోజులుగా కార్యాలయానికి రావడం లేదని తెలిసింది. అధికారులు అతని కోసం వెతుకుతున్నప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి వరకు ఎస్పీ అకౌంట్ నుంచి మాయమైన రూ.10 లక్షలు జమ చేయలేదని సమాచారం. ఎస్పీకి తెలిస్తే కఠిన చర్యలుంటాయని భయపడిన పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా రికవరీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి
- ఎస్పీ వి.శివకుమార్
గ్యాస్ సబ్సిడీ ఖాతాలో డబ్బులు మాయమైన అంశాన్ని మంగళవారం రాత్రి ఁసాక్షి* ప్రతినిధి.. ఎస్పీ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సీరియస్‌గా స్పందించారు. ఁ్ఙఈ అంశం నా దృష్టికి రాలేదు. బాధ్యులను ఎవరినీ వదిలేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం** అని స్పష్టం చేశారు.
ఎస్పీ ఖాతాకే కన్నం
Published Wed, Nov 12 2014 3:50 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement