
గుడివాడ: కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించినట్లు తెలిస్తే వర్తకులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment