సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే ఆస్పత్రులను అధికారులు ఫినిష్ చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఆస్పత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు.
చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment