
గుడివాడ టౌన్: రాష్ట్రంలో కోటీ 47 లక్షల పైచిలుకు కుటుంబాల్లో ఇప్పటివరకు కోటీ 35 లక్షల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన బియ్యం అందిస్తున్నామన్నారు. ప్రజలు ఇంటికే పరిమితమై కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment