న్యూఢిల్లీ: వరుస భూకంపాలు నేపాల్‌ను నేలమట్టం చేశాయి. ఇటు భారత్‌నూ వణికించాయి. అయితే.. పెను తుపాన్లు, సునామీల ముప్పును గుర్తించినట్లు.. భూకంప ముప్పునూ ముందస్తుగా గుర్తించలేమా? ఇప్పటికైతే.. భూకంపాలు ఎప్పుడు వస్తాయో కచ్చితంగా అంచనా వేయడం మాత్రం అసాధ్యం. కానీ.. భూకంపం మొదలయ్యాక.. అది విధ్వంసం సృష్టించడానికి కొన్ని సెకన్ల ముందయితే మాత్రం గుర్తించొచ్చు.
అలా ముందస్తు భూకంప హెచ్చరికలు పంపే వ్యవస్థ జపాన్, చైనా, తైవాన్, టర్కీ, మెక్సికో దేశాల్లో ఇప్పటికే పని చేస్తోంది. భారత్‌లోనూ దీనిని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే నెలలో ఈ వ్యవస్థను కేంద్రం ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ఇందు కోసం ఐఐటీ రూర్కీలోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ విభాగం ఓ పాజెక్టు కూడా ప్రారంభించిం ది. ప్రాజెక్టులో భాగంగా ఛమోలి-ఉత్తరకాశీల మధ్య 100 సెన్సర్లను ఏర్పాటు చేయాలని ప్రతి పాదించగా, 52 సెన్సర్లను ఇదివరకే అమర్చారు.
ఇక ముందుగానే భూకంప హెచ్చరికలు!
Published Mon, May 18 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement