
మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవిని శనివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూమిలో 32 కిలోమీటర్ల లోతులో రాత్రి 10.37 గంటల సమయంలో ఇది సంభవించింది.
దక్షిణ ఫిలిప్పీన్స్, ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాలు, మలేసియాలో సునామీ అలలు మీటరు ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసినట్లు పసిఫిక్ సునామీ వారి్నంగ్ సెంటర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment